బంజారా సంస్కృతీ, ప్రజల గురించి చిరస్మరణీయ అనుభవాలు పంచుకున్న ప్రధానమంత్రి
October 05th, 06:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్రలోని వాషిమ్ పర్యటన సందర్భంగా, బంజారా సంస్కృతీ, అక్కడి ప్రజలకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు.వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన సాధువులతో ప్రధాన మంత్రి భేటీ
October 05th, 05:47 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన గౌరవనీయ సాధువులతో భేటీ అయ్యారు. సమాజానికి సేవ చేసేందుకు వారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.వాషిమ్ లో పోహరా దేవి ఆలయంలో ప్రధాన మంత్రి పూజలు
October 05th, 02:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఉన్న పోహరా దేవి ఆలయంలో ప్రార్థన చేశారు.బంజారా సంస్కృతిలో కీలక సంగీత వాయిద్యమైన నంగారాను మోగించిన ప్రధాన మంత్రి
October 05th, 02:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వాషిమ్ లో నంగారా మోగించారు. బంజారాల గొప్ప సంస్కృతిలో నంగారాకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.మహారాష్ట్రలోని వాషిమ్‌లో వ్యవసాయ, పశుసంవర్ధక రంగ కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
October 05th, 12:05 pm
మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్ గారు.. ప్రముఖ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గారు.. కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాజీవ్ రంజన్ సింగ్.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్.. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బంజారా సామాజిక వర్గానికి చెందిన నా సోదరసోదరీమణులు, దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదర సోదరీమణులు.. ఇతర గౌరవనీయులైన ప్రముఖులు, మహారాష్ట్ర సోదర సోదరీమణులారా.. ఈ పవిత్ర భూమి వాషిం నుంచి పోహ్రాదేవికి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. నవరాత్రుల సందర్భంగా ఈ రోజు జగదాంబ అమ్మవారి ఆశీస్సులు పొందే భాగ్యం కలిగింది. సంత్ సేవాలాల్ మహరాజ్, సంత్ రాంరావ్ మహారాజ్ సమాధిని సందర్శించి వారి ఆశీస్సులు తీసుకున్నాను. ఈ వేదిక మీద నుంచి ఈ ఇద్దరు మహానుభావులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాను.మహారాష్ట్రలోని వాషిమ్‌లో రూ.23,300 కోట్ల విలువైన వ్యవసాయ-పశుసంవర్ధక రంగ కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
October 05th, 12:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలోని వాషిమ్‌లో రూ.23,300 కోట్ల విలువైన వ్యవసాయ-పశుసంవర్ధక రంగ కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘పిఎం-కిసాన్ నిధి’ 18వ విడత నిధుల పంపిణీతోపాటు ‘నమో షేత్కారీ మహాసన్మాన్ నిధి యోజన’ 5వ విడతకు శ్రీకారం చుట్టారు. అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎఐఎఫ్) కింద 7,500కుపైగా ప్రాజెక్టులను, 9,200 రైతు ఉత్పత్తిదారు సంస్థలు సహా మహారాష్ట్రలో 19 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంగల అయిదు సౌర పార్కులను దేశానికి అంకితం చేశారు. అంతేకాకుండా పశుగణాభివృద్ధి దిశగా ఏకీకృత జీనోమిక్ చిప్‌తోపాటు జాతి-లింగ ఎంపికపై దేశీయ పశువీర్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రధాని ప్రారంభించారు.