ఉక్రెయిన్ అధ్యక్షునితో ప్రధాన మంత్రి భేటీ

September 24th, 03:57 am

న్యూయార్క్ లో ‘ది సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమం సందర్భంగా నిన్న (2024 సెప్టెంబర్ 23న) ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జిలెన్ స్కీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.

భార‌త ప్ర‌ధాన‌మంత్రి ఉక్రెయిన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భార‌త్‌, ఉక్రెయిన్ దేశాల ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌

August 23rd, 07:00 pm

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఆహ్వానం మేర‌కు ఆగ‌స్ట్ 23, 2024న భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉక్రెయిన్ దేశాన్ని సంద‌ర్శించారు. రెండు దేశాల మ‌ధ్య‌న 1992లో దౌత్య‌సంబంధాలు ఏర్ప‌డిన త‌ర్వాత భార‌త‌దేశ ప్ర‌ధాని ఉక్రెయిన్లో ప‌ర్య‌టించ‌డం ఇదే మొద‌టిసారి.

ప్రధానమంత్రి ఉక్రెయిన్ పర్యటన (2024 ఆగస్టు 23) సందర్భంగా సంతకాలు పూర్తయిన పత్రాల జాబితా

August 23rd, 06:45 pm

వ్యవసాయం, ఆహార పరిశ్రమ రంగాల్లో సహకారంపై భారత్-ఉక్రెయిన్ ఒప్పందం.

ఉక్రెయిన్ అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం

August 23rd, 06:33 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు కీవ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్ స్కీతో సమావేశమయ్యారు. మరుసియిన్ స్కీ ప్యాలెస్ వద్ద ప్రధానమంత్రికి అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వాగతం పలికారు.

ఉక్రెయిన్ కు భిష్మ్ క్యూబులను బహూకరించిన ప్రధానమంత్రి

August 23rd, 06:33 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉక్రెయిన్ ప్రభుత్వానికి నాలుగు భిష్మ్ (సహయోగ్ హిత, మైత్రికి భారత ఆరోగ్య కార్యక్రమం) క్యూబులను బహూకరించారు. ఈ మానవతాపూర్వకమైన సహాయం అందించినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్ స్కీ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. క్షతగాత్రులకు వేగంగా చికిత్స అందించేందుకు తద్వారా విలువైన ప్రాణాలు కాపాడేందుకు ఈ క్యూబులు ఉపయోగపడతాయి.

పిల్లలపై మార్టయిరాలజిస్ట్ ఎక్స్ పొజిషన్: సందర్శించిన ప్రధానమంత్రి

August 23rd, 03:24 pm

ఉక్రెయిన్లో అమరులైన బాలల స్మృతికి కీవ్ నేషనల్ హిస్టరీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన (మార్టయిరాలజిస్ట్ ఎక్స్ పొజిషన్)ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్‌ స్కీ ఉన్నారు.

పోలెండ్ , ఉక్రెయిన్ సందర్శనకు ముందు ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన

August 21st, 09:07 am

మన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో పోలెండును నేను సందర్శించబోతున్నాను. మధ్య ఐరోపాకు చెందిన పోలెండ్ ఒక ప్రముఖ ఆర్థిక భాగస్వామ్య దేశంగా ఉంది.

జి7 సమిట్ సందర్భం లో యూక్రేన్ అధ్యక్షుని తోసమావేశమైన ప్రధాన మంత్రి

June 14th, 04:25 pm

ఇటలీ లో జి7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూక్రేన్ యొక్క అధ్య‌క్షుడు శ్రీ‌ వొలొదిమీర్ జెలెన్ స్కీ తో 2024 జూన్ 14 వ తేదీ న ఒక ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి తాను మూడో సారి పదవీ బాధ్యతల ను చేపట్టినందుకు అధ్యక్షుడు శ్రీ వొలొదిమీర్ జెలెన్ స్కీ హృదయపూర్వక శుభాకాంక్షల ను తెలిపినందుకు ఆయన కు ధన్యవాదాలను పలికారు.

ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నికైనందుకు అభినందనల ను తెలిపిన అధ్యక్షుడు శ్రీజెలెన్ స్కీ

June 06th, 08:56 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యూక్రేన్ అధ్యక్షుడు శ్రీ వొలొదిమీర్ జెలెన్ స్కీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల లో శ్రీ నరేంద్ర మోదీ కి లభించిన విజయం పట్ల ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడితో భారత ప్రధాని సమావేశం

May 20th, 07:57 pm

ఉక్రెయిన్ యుద్ధంవల్ల మొత్తం ప్రపంచంపై ప్రభావం పడిందని ప్రధానమంత్రి అన్నారు. అయితే ఇది తనకు రాజకీయ లేక ఆర్ధిక సమస్య కాదని, ఇది తనకు మానవతకు, మానవ విలువలకు సంబంధించిన సమస్య అని ప్రధాని అన్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడుమాననీయ వోలోడిమిర్జెలెన్‌స్కీతోప్రధానమంత్రి ఫోన్‌ సంభాషణ

December 26th, 08:39 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉక్రెయిన్ అధ్యక్షుడు మాననీయ వోలోడిమిర్ జెలెన్‌స్కీతో ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా జి20కి భారత్‌ అధ్యక్షతపై ఉక్రెయిన్ అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి స్పందిస్తూ- జి20కి అధ్యక్షత సమయంలో భారత్‌ ప్రాధాన్యాల గురించి వివరించారు. ఇందులో భాగంగా ఆహార, ఇంధన భద్రత వంటి అంశాల్లో వర్ధమాన దేశాల గళానికి ప్రాముఖ్యం ఇస్తామని ఆయన తెలిపారు. ద్వైపాక్షిక సహకారం బలోపేతానికిగల అవకాశాలై దేశాధినేతలిద్దరూ చర్చించారు. ఈ ఏడాది ఆరంభంలో ఉక్రెయిన్‌ నుంచి స్వదేశం వచ్చిన భారత విద్యార్థుల చదువు కొనసాగింపునకు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానమంత్రి ఉక్రెయిన్‌ అధికారవర్గాలను కోరారు.