‘వివా టెక్’ 5వ విడత సదస్సులో ప్రధానమంత్రి కీలకో ప్రసంగ పాఠం
June 16th, 04:00 pm
ఎక్కడ సంప్రదాయకత విఫలమవుతుందో అక్కడ ఆవిష్కరణ తోడ్పాటునిస్తుందన్నది నా విశ్వాసం. మన శకంలో అత్యంత విచ్ఛిన్నకర కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి విజృంభణ సమయంలో ఈ సత్యం ప్రస్ఫుటమైంది. అన్నిదేశాలూ అనేక కష్టనష్టాలకు లోనుకావడమేగాక భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. మన సంప్రదాయక విధానాలకు కోవిడ్-19 విషమ పరీక్ష పెట్టినప్పటికీ, ఆవిష్కరణలే మనను ఆదుకున్నాయి.వివాటెక్ 5 వ ఎడిషన్ లో కీలకోపన్యాసం చేసిన - ప్రధానమంత్రి
June 16th, 03:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, వివాటెక్ 5వ ఎడిషన్‌లో, దృశ్య మాధ్యమం ద్వారా కీలకోపన్యాసం చేశారు. ఐరోపాలో అతిపెద్ద డిజిటల్ మరియు అంకురసంస్థల కార్యక్రమాల్లో ఒకటిగా నిర్వహిస్తున్న, వివాటెక్-2021 లో కీలకోపన్యాసం చేయడానికి ప్రధానమంత్రి ని గౌరవ అతిథిగా ఆహ్వానించారు. 2016 నుండి ప్రతి సంవత్సరం పారిస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ నెల 16న వివాటెక్ అయిదో సంచిక ను ఉద్దేశించి కీలకోపన్యాసం చేయనున్న ప్రధాన మంత్రి
June 15th, 02:16 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16న సాయంత్రం 4 గంటల వేళ లో వివాటెక్ అయిదో సంచిక ను ఉద్దేశించి కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. వివా టెక్ 2021 కార్యక్రమం లో కీలకోపన్యాసం ఇవ్వడానికి ప్రధాన మంత్రి ని గౌరవ అతిథి గా ఆహ్వానించడమైంది.