ఐటీయూ ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 22nd, 03:34 pm
ఈ రోజు చాలా ప్రత్యేకమైనది, చాలా పవిత్రమైనది. నేటి నుంచి 'హిందూ క్యాలెండర్' నూతన సంవత్సరం ప్రారంభమైంది. మీ అందరికీ, దేశ ప్రజలందరికీ విక్రమ్ సంవత్ 2080 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత సువిశాలమైన మన దేశంలో, భిన్నత్వంతో నిండిన దేశంలో, శతాబ్దాలుగా వేర్వేరు క్యాలెండర్లు ప్రబలంగా ఉన్నాయి. కొల్లం కాలానికి చెందిన మలయాళ క్యాలెండర్, తమిళ క్యాలెండర్, ఇది వందల సంవత్సరాలుగా భారతదేశానికి తిథి జ్ఞానాన్ని ఇస్తోంది. విక్రమ్ సంవత్ కూడా 2080 సంవత్సరాల క్రితం నుండి కొనసాగుతోంది. ప్రస్తుతం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2023 సంవత్సరం జరుగుతుండగా, విక్రమ్ సంవత్ అంతకు ముందు 57 సంవత్సరాలు గా ఉంది. కొత్త సంవత్సరం మొదటి రోజున, టెలికాం, ఐసిటి మరియు సంబంధిత ఆవిష్కరణలకు సంబంధించి భారతదేశంలో చాలా పెద్ద ప్రారంభం జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఏరియా ఆఫీస్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ)కు చెందిన ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 6జీ టెస్ట్ బెడ్ ను కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ సాంకేతికటకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఇది డిజిటల్ ఇండియాకు కొత్త శక్తిని ఇస్తుంది, అలాగే దక్షిణాసియా, గ్లోబల్ సౌత్ కోసం కొత్త పరిష్కారాలు, కొత్త ఆవిష్కరణలను తీసుకువస్తుంది. ఇది ముఖ్యంగా మన విద్యారంగానికి, మన ఆవిష్కర్తలకు-స్టార్టప్ లకు, మన పరిశ్రమకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.ఐ.టి.యు. ప్రాంతీయ కార్యాలయం, ఆవిష్కరణల కేంద్రాన్ని ప్రారంభించిన - ప్రధానమంత్రి
March 22nd, 12:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారతదేశంలో కొత్త ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐ.టి.యు) కు చెందిన ఏరియా కార్యాలయంతో పాటు, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఈరోజు విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. భారత్ 6-జి విజన్ డాక్యుమెంట్ ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు, 6-జి ఆర్.&డి. టెస్ట్ బెడ్‌ను ప్రారంభించారు. ‘కాల్-బి-ఫోర్-యు-డిగ్’ అనే యాప్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఐ.టి.యు. అనేది ఐక్యరాజ్యసమితికి చెందిన సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీల (ఐ.సి.టి.ల) ప్రత్యేక ఏజెన్సీ. ఏరియా కార్యాలయం ఏర్పాటు కోసం 2022 మార్చి నెలలో ఐ.టి.యు. తో భారతదేశం హోస్ట్ కంట్రీ ఒప్పందంపై సంతకం చేసింది. భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలకు ఈ కార్యాలయం సేవలందిస్తుంది, దేశాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రాంతంలో పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ కార్యాలయం ప్రోత్సహిస్తుంది.PM Modi's Mann Ki Baat: Tourism, farmers, under 17 FIFA world cup and more
March 27th, 11:30 am