I consider industry, and also the private sector of India, as a powerful medium to build a Viksit Bharat: PM Modi at CII Conference

July 30th, 03:44 pm

Prime Minister Narendra Modi attended the CII Post-Budget Conference in Delhi, emphasizing the government's commitment to economic reforms and inclusive growth. The PM highlighted various budget provisions aimed at fostering investment, boosting infrastructure, and supporting startups. He underscored the importance of a self-reliant India and the role of industry in achieving this vision, encouraging collaboration between the government and private sector to drive economic progress.

భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) నిర్వహించిన ‘‘జర్నీ టువార్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్’’ ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

July 30th, 01:44 pm

భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఈ రోజు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన ‘‘జర్నీ టువార్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్’’ (అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా పయనం: 2024-25 కేంద్ర బడ్జెట్ అనంతర సమావేశం) ప్రారంభ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వృద్ధి కోసం ప్రభుత్వం అమలుపరుస్తున్న విశాల దృష్టికోణం రూపు రేఖలను, అందులో పరిశ్రమ పోషించవలసిన పాత్రను వివరించాలన్న లక్ష్యంతో ఈ సదస్సు ను ఏర్పాటు చేశారు. పరిశ్రమ, ప్రభుత్వం, దౌత్య సముదాయం, మేధావి వర్గం తదితర రంగాలకు చెందిన ఒక వేయి మందికి పైగా ఈ సమావేశానికి స్వయంగా హాజరు కాగా, దేశ, విదేశాలలోని వివిధ సిఐఐ కేంద్రాల నుంచి చాలా మంది ఈ సమావేశంతో అనుసంధానమయ్యారు.

జులై 30న సిఐఐ నిర్వహించే బడ్జెట్ అనంతర సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

July 29th, 12:08 pm

భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ.) ఈ నెల 30న (మంగళవారం) న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే ‘‘ జర్నీ టువార్డ్ వికసిత్ భారత్ : ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25’’’ సదస్సునుద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

ఫిబ్రవరి 3 వతేదీ నాడు సిఎల్ఇఎ - కామన్‌వెల్థ్ అటార్నీస్ ఎండ్ సలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్2024 ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

February 02nd, 11:10 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 3 వ తేదీ న ఉదయం పూట సుమారు 10 గంటల వేళ కు విజ్ఞాన్ భవన్ లో కామన్‌వెల్థ్ లీగల్ ఎడ్ యుకేశన్ అసోసియేశన్ (సిఎల్ఇఎ) - కామన్‌వెల్థ్ అటార్నీస్ ఎండ్ సలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ (సిఎఎస్‌జిసి) 2024 ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో హాజరు అయ్యే జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.

డిసెంబరు 25న ‘పండిట్ మదన్ మోహన్ మాలవీయ’ రచనల మహా సంకలనం ఆవిష్కరించనున్న ప్రధాని

December 24th, 07:47 pm

మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబర్, 25న సాయంత్రం 4:30 గంటలకు ‘కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవీయ’ పేరిట 11 సంచికలతో కూడిన మాలవీయ రచనల మహా సంకలనం తొలి శ్రేణిని ఆవిష్కరిస్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. జాతికి అనుపమాన సేవలందించిన స్వాతంత్ర్య సమర యోధులను అమృత కాలంలో సముచిత గుర్తింపుతో గౌరవించాలన్నది ప్రధానమంత్రి దృక్కోణం. ఈ దిశగా ‘పండిట్ మదన్ మోహన్ మాలవీయ రచనల మహా సంకలనం’ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

‘ఇంటర్ నేశనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ 2023’ ను సెప్టెంబర్ 23 వ తేదీ న న్యూఢిల్లీ లో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

September 22nd, 02:10 pm

‘ఇంటర్ నేశనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ 2023’ ను 2023 సెప్టెంబర్ 23 వ తేదీ న ఉదయం 10 గంటల వేళ కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఏప్రిల్‌ 3న సీబీఐ వజ్రోత్సవాలను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

April 02nd, 10:43 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 3న మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్రీయ నేరపరిశోధక సంస్థ (సీబీఐ) వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విశిష్ట సేవకుగాను రాష్ట్రపతి పోలీసు పతకం, అత్యుత్తమ పరిశోధనకుగాను స్వర్ణ పతకాలను సీబీఐ అధికారులకు ప్రదానం చేస్తారు. అలాగే షిల్లాంగ్‌, పుణె, నాగ్‌పూర్‌ నగరాల్లో నిర్మించిన సీబీఐ కార్యాలయ ప్రాంగణాలను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. వీటితోపాటు సీబీఐ వజ్రోత్సవ సంవత్సరంలో భాగంగా స్మారక తపాలా బిళ్లను, నాణేన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అంతేకాకుండా సీబీఐ ట్విట్టర్‌ హ్యాండిల్‌ను కూడా ప్రారంభిస్తారు.

ఐటీయూ ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 22nd, 03:34 pm

ఈ రోజు చాలా ప్రత్యేకమైనది, చాలా పవిత్రమైనది. నేటి నుంచి 'హిందూ క్యాలెండర్' నూతన సంవత్సరం ప్రారంభమైంది. మీ అందరికీ, దేశ ప్రజలందరికీ విక్రమ్ సంవత్ 2080 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత సువిశాలమైన మన దేశంలో, భిన్నత్వంతో నిండిన దేశంలో, శతాబ్దాలుగా వేర్వేరు క్యాలెండర్లు ప్రబలంగా ఉన్నాయి. కొల్లం కాలానికి చెందిన మలయాళ క్యాలెండర్, తమిళ క్యాలెండర్, ఇది వందల సంవత్సరాలుగా భారతదేశానికి తిథి జ్ఞానాన్ని ఇస్తోంది. విక్రమ్ సంవత్ కూడా 2080 సంవత్సరాల క్రితం నుండి కొనసాగుతోంది. ప్రస్తుతం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2023 సంవత్సరం జరుగుతుండగా, విక్రమ్ సంవత్ అంతకు ముందు 57 సంవత్సరాలు గా ఉంది. కొత్త సంవత్సరం మొదటి రోజున, టెలికాం, ఐసిటి మరియు సంబంధిత ఆవిష్కరణలకు సంబంధించి భారతదేశంలో చాలా పెద్ద ప్రారంభం జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఏరియా ఆఫీస్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ)కు చెందిన ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 6జీ టెస్ట్ బెడ్ ను కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ సాంకేతికటకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఇది డిజిటల్ ఇండియాకు కొత్త శక్తిని ఇస్తుంది, అలాగే దక్షిణాసియా, గ్లోబల్ సౌత్ కోసం కొత్త పరిష్కారాలు, కొత్త ఆవిష్కరణలను తీసుకువస్తుంది. ఇది ముఖ్యంగా మన విద్యారంగానికి, మన ఆవిష్కర్తలకు-స్టార్టప్ లకు, మన పరిశ్రమకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.

ఐ.టి.యు. ప్రాంతీయ కార్యాలయం, ఆవిష్కరణల కేంద్రాన్ని ప్రారంభించిన - ప్రధానమంత్రి

March 22nd, 12:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారతదేశంలో కొత్త ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐ.టి.యు) కు చెందిన ఏరియా కార్యాలయంతో పాటు, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఈరోజు విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. భారత్ 6-జి విజన్ డాక్యుమెంట్‌ ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు, 6-జి ఆర్.&డి. టెస్ట్ బెడ్‌ను ప్రారంభించారు. ‘కాల్-బి-ఫోర్-యు-డిగ్’ అనే యాప్‌ ను కూడా ఆయన ప్రారంభించారు. ఐ.టి.యు. అనేది ఐక్యరాజ్యసమితికి చెందిన సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీల (ఐ.సి.టి.ల) ప్రత్యేక ఏజెన్సీ. ఏరియా కార్యాలయం ఏర్పాటు కోసం 2022 మార్చి నెలలో ఐ.టి.యు. తో భారతదేశం హోస్ట్ కంట్రీ ఒప్పందంపై సంతకం చేసింది. భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌ దేశాలకు ఈ కార్యాలయం సేవలందిస్తుంది, దేశాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రాంతంలో పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ కార్యాలయం ప్రోత్సహిస్తుంది.

ఐటియు ఏరియా ఆఫీస్ & ఇనొవేశన్ సెంటరు ను మార్చి నెల 22 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

March 21st, 04:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మార్చి నెల 22 వ తేదీ మధ్యాహ్నం పూట 12:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఒక కార్యక్రమం లో పాల్గొని, నూతన ఇంటర్ నేశనల్ టెలికమ్యూనికేశన్ యూనియన్ (ఐటియు) ఏరియా ఆఫీస్ & ఇనొవేశన్ సెంటరు ను ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, భారత్ 6జి విజన్ డాక్యుమెంటు ను ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. అలాగే, 6జి కి చెందినటువంటి ఆర్&డి టెస్ట్ బెడ్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి ‘కాల్ బిఫోర్ యు డిగ్’ అనే ఏప్ ను సైతం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.

నేశనల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యొక్క మూడో సదస్సు నుమార్చి నెల 10 వ తేదీ న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

March 09th, 04:48 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మార్చి నెల 10వ తేదీ న సాయంత్రం పూట 4 గంటల 30 నిమిషాల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో నేశనల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (ఎన్ పిడిఆర్ఆర్) యొక్క మూడో సదస్సు ను ప్రారంభించనున్నారు. ‘‘బిల్డింగ్ లోకల్ రిజిలియన్స్ ఇన్ ఎ చేంజింగ్ క్లయిమేట్ ’’ (మారుతున్న శీతోష్ణస్థితి లో స్థానికం గా ఆటుపోటుల కు తట్టుకొని నిలబడే సామర్థ్యాన్ని ఏర్పరచడం) అనేది ఈ ప్లాట్ ఫార్మ్ యొక్క మూడో సదస్సు తాలూకు ప్రధాన ఇతివృత్తం గా ఉంది.

Lachit Borphukan's life inspires us to live the mantra of 'Nation First': PM Modi

November 25th, 11:00 am

PM Modi addressed the closing ceremony of the year-long celebrations of the 400th birth anniversary of Lachit Borphukan in New Delhi. Terming Veer Lachit’s exploits a glorious chapter of the history of Assam, the PM said, “I salute this great tradition on the occasion of the festival of India’s eternal culture, eternal valour and eternal existence.”

శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ 400వ జయంతి సందర్భం లో ఏడాది పొడవునా నిర్వహించినఉత్సవాల ముగింపు కార్యక్రమం న్యూ ఢిల్లీ లో ఏర్పాటవగా, ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి

November 25th, 10:53 am

శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ 400వ జయంతి సందర్భం లో ఒక సంవత్సర కాలం పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఈ రోజు న న్యూ ఢిల్లీ లో ఏర్పాటు కాగా, ఆ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొని సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. ‘శ్రీ లాసిత్ బోర్ ఫుకన్- అసమ్ స్ హీరో - హూ హాల్టెడ్ ద ముఘల్స్’’ అనే పేరు గల ఒక పుస్తకాన్ని కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ఆవిష్కరించారు

శ్రీ ల‌చిత్‌ బర్ ఫూకన్ యొక్క 400వ జయంతి సందర్భంలో ఏడాది పొడవునా నిర్వహించిన ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి నవంబరు 25వ తేదీ నాడు ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

November 24th, 11:51 am

శ్రీ ల‌చిత్‌ బర్ ఫూకన్ 400వ జయంతి ని పురస్కరించుకొని సంవత్సరం పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపు సందర్భం లో 2022 నవంబర్ 25వ తేదీ న ఉదయం 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

నిఘా జాగృతివారం సూచకం గా నవంబర్ 3వ తేదీ న ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ప్రసంగించనున్నప్రధాన మంత్రి

November 02nd, 04:53 pm

సెంట్రల్ విజిలెన్స్ కమిశన్ (సివిసి) ఆధ్వర్యం లో నిఘా జాగృతి వారం కార్యక్రమాని కి గుర్తు గా నవంబర్ 3వ తేదీ నాడు ఉదయం పూట 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞ‌ాన్ భవన్ లో జరిగే కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.

'ఇన్-సితు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్' కింద ఢిల్లీలోని కల్కాజీలో కొత్తగా నిర్మించిన 3024 ఫ్లాట్లను నవంబర్, 2వ తేదీన ప్రారంభించనున్న - ప్రధాన మంత్రి

November 01st, 05:06 pm

ఢిల్లీ లోని కల్కాజీ లో 'ఇన్-సితు స్లమ్ రిహాబిలిటేషన్' ప్రాజెక్టు కింద మురికివాడల నివాసితులకు పునరావాసం కల్పించడం కోసం నిర్మించిన 3,024 ఈ.డబ్ల్యూ.ఎస్. ఫ్లాట్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 2022 నవంబర్, 2వ తేదీ, సాయంత్రం నాలుగున్నర గంటలకు, ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఒక కార్యక్రమంలో భూమి హీన్ క్యాంపులో అర్హులైన లబ్ధిదారులకు ప్రధానమంత్రి తాళం చెవులు అందజేస్తారు.