భారతదేశం యొక్క రాబోయే వెయ్యి సంవత్సరాలకు మేము బలమైన పునాది వేస్తున్నాము: ఆస్ట్రియాలో ప్రధాని మోదీ
July 10th, 11:00 pm
వియన్నాలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. గత 10 సంవత్సరాలలో దేశం సాధించిన పరివర్తనాత్మక పురోగతి గురించి ఆయన ప్రసంగించారు మరియు 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా - విక్షిత్ భారత్‌గా మారే మార్గంలో భారతదేశం సమీప భవిష్యత్తులో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఆస్ట్రియా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 10th, 10:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియన్నా లో ప్రవాసీ భారతీయులు ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొని, భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమ స్థలానికి ప్రధాన మంత్రి రాగానే, భారతీయ సముదాయం ఆయనకు ఎంతో ఉత్సాహం తోను, ఆప్యాయంగాను స్వాగతం పలికింది. ఆస్ట్రియా కార్మిక, ఆర్థిక వ్యవస్థ శాఖ మంత్రి శ్రీ మార్టిన్ కొచెర్ కూడా ఈ సాముదాయిక సభ లో పాలుపంచుకొన్నారు. ఆస్ట్రియా నలుమూలలా విస్తరించివున్న ప్రవాసీ భారతీయులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.భారత-ఆస్ర్టియా విస్తృత భాగస్వామ్యంపై ఉమ్మడి ప్రకటన
July 10th, 09:15 pm
ఆస్ర్టియా చాన్సలర్ కార్ల్ నెహామర్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూలై 9-10 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఆస్ర్టియా అధ్యక్షుడు మాననీయ అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్ ను కలవడంతో పాటు చాన్సలర్ నెహామర్ తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇది ఆస్ర్టియాలో ప్రధానమంత్రి తొలి పర్యటన మాత్రమే కాదు, 41 సంవత్సరాల కాలంలో భారతదేశ ప్రధానమంత్రి ఒకరు ఆస్ర్టియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అంతే కాదు, 2024 సంవత్సరం ఉభయదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 75వ సంవత్సరం కావడం విశేషం.ఆస్ట్రియా ఛాన్సలర్ తో కలిసి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉమ్మడి పత్రికా ప్రకటన
July 10th, 02:45 pm
హృదయ పూర్వక స్వాగతాన్ని పలికి, ఆతిథ్యమందించినందుకు మొట్టమొదటగా ఛాన్సలర్ నెహమర్ కు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా వుంది. నా ఈ పర్యటన చారిత్రాత్మకమైనది, ప్రత్యేకమైనది. 41 సంవత్సరాల తర్వాత ఆస్ట్రియాలో పర్యటిస్తున్న భారతీయ ప్రధానిగా నాకు గుర్తింపు లభించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో నేను పర్యటించడం కాకతాళీయం, సంతోషకరం.ఆస్ట్రియాలోని వియన్నా చేరుకున్న ప్రధాని మోదీ
July 09th, 11:45 pm
తన రెండు దేశాల పర్యటనలో భాగంగా రెండో విడత ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రియాలోని వియన్నా చేరుకున్నారు. ప్రధాని తన పర్యటనలో అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్ మరియు ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌లను కలుస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి.రష్యన్ ఫెడరేషన్.. రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియాలలో (2024 జూలై 08-10 మధ్య) ప్రధాని పర్యటన
July 04th, 05:00 pm
ఈ మేరకు రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానొం మేరకు 2024 జూన్ 8,9 తేదీల్లో ప్రధానమంత్రి మాస్కో సందర్శిస్తారు. ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన సాగే 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా దేశాధినేతలిద్దరూ రెండు దేశాల మధ్యగల బహుముఖ సంబంధాలను సమీక్షిస్తారు. అలాగే పరస్పర ప్రయోజనంగల సమకాలీన ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు.వియన్నా లో జరిగిన ఉగ్రవాద దాడులను ఖండించిన ప్రధాన మంత్రి
November 03rd, 12:13 pm
వియన్నా లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు.