నవంబరు 11న గుజరాత్ లోని వడ్ తాల్ లో శ్రీ స్వామి నారాయణ్ మందిర్ 200వ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి

November 10th, 07:09 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నవంబరు 11న ఉదయం 11.15 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా, గుజరాత్ లోని వడ్ తాల్ లో శ్రీ స్వామినారాయణ్ మందిర్ 200వ వార్షికోత్సవ సంబంధిత కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో 51,000 మందికి పైగా కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాల పంపిణీ;

October 28th, 01:05 pm

ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకం జరిగిన 51,000 మందికి పైగా యువతీయువకులకుప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 29న ఉదయం పదిన్నర గంటలకు దృశ్య మాధ్యమం (వీడియో కాన్ఫరెన్సింగ్) ద్వారా నియామక పత్రాలను అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.

మహారాష్ట్రలో రూ. 7600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న పీఎం

October 08th, 07:31 pm

మ‌హారాష్ట్ర‌లో రూ.7600 కోట్ల‌కు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు మ‌ధ్యాహ్నం 1 గంట‌కు వీడియో అనుసంధానం ద్వారా శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

మహారాష్ట్రలో రేపు రూ.11,200 కోట్లకుపైగా విలువైన వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన.. ప్రారంభోత్సవం చేయనున్న ప్రధానమంత్రి

September 28th, 07:00 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌హారాష్ట్ర‌లో సెప్టెంబరు 29న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ.11,200 కోట్లకుపైగా వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం, శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.

6న ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమం’ లో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

September 05th, 02:17 pm

గుజరాత్ లోని సూరత్ లో జరప తలపెట్టిన ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమం’ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం 12.30 కి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు.

ఆగస్టు 31న మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

August 30th, 04:19 pm

వందే భారత్ రైళ్లు మూడింటికి ఆగస్టు 31న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టి కోణాన్ని సాకారం చేస్తూ వస్తున్న ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు... మీరట్ - లక్నో, మదురై-బెంగళూరు, చెన్నై –నాగర్ కోయిల్ మధ్య ప్రయాణిస్తాయి.

Judiciary has consistently played the moral responsibility of being vigilant : PM Modi in Jodhpur

August 25th, 05:00 pm

Prime Minister Narendra Modi attended the Platinum Jubilee celebrations of the Rajasthan High Court in Jodhpur, where he highlighted the importance of the judiciary in safeguarding democracy. He praised the High Court's contributions over the past 75 years and emphasized the need for modernizing the legal system to improve accessibility and efficiency.

రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 25th, 04:30 pm

మహారాష్ట్ర నుండి బయలు దేరిన సమయంలో వాతావరణం సరిగా లేనికారణంగా- జరిగిన ఆలస్యానికి చింతిస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేసిన ఆయన, భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాజస్థాన్ హైకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నదని అన్నారు. ఎందరో మహానుభావులు అందించిన న్యాయం, వారి చిత్తశుద్ధీ, అంకితభావాన్నీ గౌరవించుకునే సందర్భమిది అని ప్రధాన మంత్రి అన్నారు. రాజ్యాంగం పట్ల దేశానికి ఉన్న విశ్వాసానికి నేటి కార్యక్రమం ఒక ఉదాహరణ అని, ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేవారందరికీ, రాజస్థాన్ ప్రజలకూ ప్రధాని అభినందనలు తెలియజేశారు.

మాజీ ఉప-రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు జీవన ప్రస్థానంపై జూన్ 30న మూడు పుస్తకాలను ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి

June 29th, 11:03 am

మాజీ ఉప-రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు 75వ జన్మదినోత్సవం నేపథ్యంలో ఆయన జీవన ప్రస్థానంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 30న మధ్యాహ్నం 12:00 గంటలకు మూడు పుస్తకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోగల అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

‘ఇండియా‌స్ టెకేడ్: చిప్స్ ఫార్ వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి; సుమారు 1.25 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన మూడు సెమికండక్టర్ సదుపాయాల కు మార్చి నెల 13 వ తేదీ న ఆయన శంకుస్థాపన చేయనున్నారు

March 12th, 03:40 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి నెల 13 వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ‘ఇండియాస్ టెకేడ్: చిప్స్ ఫార్ వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకోవడం తో పాటుగా సుమారు 1.25 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన మూడు సెమికండక్టర్ ప్రాజెక్టుల కు శంకుస్థాపన ను కూడా జరపనున్నారు. ఈ సందర్భం లో దేశవ్యాప్తం గా యువత ను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

సుమారు రూ. 41,000 కోట్ల విలువైన 2000 పైగా రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఫిబ్రవరి 26న శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.

February 25th, 03:30 pm

ప్రధాన మంత్రి 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేస్తారు. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు, మొత్తం వ్యయం దాదాపు రూ. 21,520 కోట్లు. ఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గిస్తాయి, భద్రత మరియు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి, రైలు ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఫిబ్రవరి 16 వ తేదీ న ‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

February 15th, 03:07 pm

వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2024 ఫిబ్రవరి 16 వ తేదీ నాడు ఉదయం పూట 11 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా 17,000 కోట్ల రూపాయల కు పైగా వ్యయమయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, దేశ ప్రజల కు ఆ ప్రాజెక్టుల ను అంకితం చేయడంల తో పాటు ఆ ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లు రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తు ప్రసారం, త్రాగునీరు మరియు పెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువు లు సహా అనేక మహత్వపూర్ణ రంగాల అవసరాల ను తీర్చుతాయి.

ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ సమక్షంలో శ్రీలంక, మారిషస్‌లలో ప్రారంభం కానున్న యూపిఐ సేవలు

February 11th, 03:13 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు, శ్రీ రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాన మంత్రి శ్రీ ప్రవింద్ జుగ్నాత్ శ్రీలంక, మారిషస్‌లలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపిఐ) సేవలను ప్రారంభించడంతోపాటు మారిషస్‌లో రూపే కార్డ్ సేవలను ప్రారంభించనున్నారు. 12 ఫిబ్రవరి, 2024న మధ్యాహ్నం 1 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫిన్‌టెక్ ఇన్నోవేషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. భాగస్వామ్య దేశాలతో మన అభివృద్ధి అనుభవాలు మరియు ఆవిష్కరణలను పంచుకోవడంపై ప్రధాన మంత్రి బలమైన దృష్టి పెట్టారు. శ్రీలంక, మారిషస్‌లతో భారతదేశం బలమైన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాల దృష్ట్యా, ఈ ప్రస్థానం వేగవంతమైన, ఒడిదొడుకులు లేని డిజిటల్ లావాదేవీల అనుభవం ద్వారా విస్తృత వర్గానికి చెందిన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దేశాల మధ్య డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

‘వికసిత్ భారత్, వికసిత్ గుజరాత్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫిబ్రవరి 10 వ తేదీ నాడు ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

February 09th, 05:50 pm

‘వికసిత్ భారత్, వికసిత్ గుజరాత్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫిబ్రవరి 10 వ తేదీ నాడు మధ్యాహ్నం పూట ఒంటి గంట వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి, గుజరాత్ లో ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ (పిఎమ్ఎవై) తదితర గృహ నిర్మాణ పథకాల లో భాగం గా 1.3 లక్షల కు పైగా గృహాల ప్రారంభం మరియు భూమి పూజలలో పాలుపంచుకొంటారు.

మహిళల్లో అవగాహన పెంచుతున్న వ్యవస్థాపకురాలికి ప్రధానమంత్రి ప్రశంస

January 18th, 04:04 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. దేశవ్యాప్తంగాగల యాత్ర లబ్ధిదారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సమీకృత వ్యవసాయంతో రైతు-ఇంజినీరుకు రెట్టింపు ఆదాయం

January 18th, 03:54 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. దేశవ్యాప్తంగాగల యాత్ర లబ్ధిదారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

జనవరి 18న వికసిత భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో సంభాషించనున్న ప్ర‌ధాన మంత్రి

January 17th, 05:13 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 18 మధ్యాహ్నం 12:30 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా వికసిత భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న వేలాది మంది వికసిత భార‌త్ సంక‌ల్ప్ యాత్ర ల‌బ్దిదారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు.

పీఎం - జన్ మన్ కింద పీఎంఏవై (జి) 1 లక్ష మంది లబ్ధిదారులకు మొదటి విడతను విడుదల చేయనున్న ప్రధాన మంత్రి

January 14th, 01:22 pm

ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం - జన్ మన్) కింద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ ( పీఎంఏవై-జి) కి సంబందించిన 1 లక్ష మంది లబ్ధిదారులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 15వ తేదీ నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొదటి విడతను విడుదల చేయనున్నారు. . ఈ సందర్భంగా ప్రధానమంత్రి పీఎం - జన్ మన్ లబ్ధిదారులతో కూడా సంభాషిస్తారు.

శ్రీ సోనాల్ మాతా శతజయంతి కార్యక్రమంలో ప్రధాన మంత్రి వీడియో సందేశం

January 13th, 12:00 pm

ప్రస్తుత ఆధ్యాత్మిక నాయకురాలు (గాదిపతి) పూజ్య కంచన్ మాత, మరియు పరిపాలనాధికారి పూజ్య గిరీష్ అపా! ఈ రోజు, పవిత్రమైన పుష్య మాసంలో, మనమందరం ఆయ్ శ్రీ సోనాల్ మా యొక్క శత జయంతిని జరుపుకుంటున్నాము. సోనాల్ తల్లి ఆశీస్సులతో ఈ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకోవడం నిజంగా గర్వకారణం. మొత్తం చరణ్ కమ్యూనిటీకి, నిర్వాహకులకు, సోనాల్ మా భక్తులకు అభినందనలు. చరణ్ కమ్యూనిటీకి ఆరాధన, అధికారం, సంప్రదాయాల కేంద్రంగా మదదా ధామ్ కు ప్రత్యేక స్థానం ఉంది. నేను వినమ్రంగా శ్రీ ఆయి పాదాలకు నమస్కరిస్తున్నాను మరియు ఆమెకు నివాళులు అర్పిస్తున్నాను.

ఆయి శ్రీ సోనాల్ మాత శతజయంతి సందర్భంగా వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం

January 13th, 11:30 am

సోనాల్ మాత శతజయంతి వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఆయి శ్రీ సోనాల్ మాత జ‌న్మ‌శ‌తాబ్ది ఉత్స‌వం పవిత్ర పుష్య మాసంలో నిర్వహిస్తున్న సందర్భంగా మాత ఆశీస్సులు పొందడంపై కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ, ఈ పవిత్ర కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవ‌డం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల నిర్వహణపై చరణ్ సమాజంతోపాటు నిర్వాహకులందర్నీ ప్రధాని మోదీ అభినందించారు. ‘‘మద్దా ధామ్ చరణ సమాజానికి భక్తి, శక్తి, ఆచార-సంప్రదాయాల కూడలిగా ఉంది. నేను శ్రీ ఆయి పాదాలకు ప్రణమిల్లి, నా భక్తిప్రపత్తులను చాటుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.