గుజరాత్ లోని మహెసాణాలో గల వాలీనాథ్ మహాదేవ్ ఆలయం లో దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
February 22nd, 07:48 pm
గుజరాత్ లోని మహెసాణా లో గల వాలీనాథ్ మహాదేవ్ ఆలయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించడం తో పాటు గా, అక్కడ జరిగిన పూజ కార్యక్రమం లో కూడా పాలుపంచుకొన్నారు.ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ , ఉత్తర ప్రదేశ్ పర్యటన
February 21st, 11:41 am
ఫిబ్రవరి 22న ఉదయం 10:45 గంటలకు అహ్మదాబాద్ లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మహేసన చేరుకుని వలీనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు, దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహేసనలోని తారాభ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని రూ.8,350 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4:15 గంటలకు నవ్సారికి చేరుకుని, అక్కడ రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల జాతికి అంకితం చేసి, శంకుస్థాపన, సుమారు రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన, పనుల ప్రారంభం చేస్తారు. సాయంత్రం 6:15 గంటలకు ప్రధాన మంత్రి కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ ను సందర్శిస్తారు. అక్కడ రెండు కొత్త ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను (పిహెచ్ డబ్ల్యుఆర్) జాతికి అంకితం చేస్తారు.