సుపరిపాలన, అహింసా మరియు సత్యాగ్రహ సందేశం ఇచ్చిన భారతదేశం: ప్రధాని

April 29th, 01:13 pm

బసవ జయంతిని పురష్కరించుకుని ఒక కార్యక్రమం గురించి మాట్లాడుతూ, భారతదేశ చరిత్ర ఓటమి, పేదరికం లేదా వలసవాదం గురించి మాత్రమే కాదు. భారతదేశం సుపరిపాలన, అహింస మరియు సత్యాగ్రహ సందేశానిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ట్రిపుల్ తలాక్ అనుసరణ వల్ల ముస్లిం మహిళలు పడుతున్న బాధలను ఆపడానికి ముస్లిం సమాజంలోనే సంస్కర్తలు ఉద్భవిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూసుకోవద్దని ఆయన ముస్లిం సమాజాన్ని కోరారు.

అంతర్జాతీయ బసవ కన్వెన్షన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

April 29th, 01:08 pm

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బసవ జయంతి 2017 ను పురష్కరించుకుని జరిగిన బసవ సమితి స్వర్ణోత్సవ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారతదేశం యొక్క సాధువుల గొప్ప చరిత్ర గురించి మరియు సామాజిక సంస్కరణల కోసం అన్వేషణ చేపట్టిన సన్యాసుల గురించి మరియు వివిధ సమయాలలో జరిగిన పరివర్తన గురించి మాట్లాడారు.