కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

December 07th, 05:52 pm

పవిత్రమైన కార్యకర్ సువర్ణ మహోత్సవం సందర్భంగా, భగవాన్ స్వామి నారాయణుని పాదాలకు వినమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు హరి ప్రగత్ బ్రహ్మ స్వరూపమైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి ఈ రోజు. ఆయనకు కూడా భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్ చేస్తున్న నిర్విరామ కృషి, అంకిత భావం ద్వారానే భగవాన్ స్వామి నారాయణుడి బోధనలు, ప్రముఖ్ స్వామి మహరాజ్ తీర్మానాలు ఈ రోజు నిజరూపం దాలుస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్లు, యువత, చిన్నారులు భాగం పంచుకుంటున్న ఈ అద్బుతమైన సాంస్కృతిక కార్యక్రమం విత్తనం, చెట్టు, ఫలం అనే భావనను అందంగా సూచిస్తోంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, ఈ కార్యక్రమ ఉత్సాహాన్ని, శక్తినీ నా హృదయం అనుభూతి చెందుతోంది. ఇంత గొప్ప దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, మహనీయులైన సాధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినయంగా నమస్కరిస్తున్నాను.

అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 07th, 05:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్‌లో ఏర్పాటైన కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మొదట పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, ఆరాధనీయులైన సాధు సంతులకు, సత్సంగి కుటుంబ సభ్యులకు, ఇతర ప్రముఖులకు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ చరణాలకు శ్రీ మోదీ ప్రణామాన్ని ఆచరించారు. ఈ రోజు ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి సందర్భం కూడా అని ప్రధాని గుర్తుకు తీసుకువచ్చారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రబోధాలు, ప్రముఖ్ స్వామి మహారాజ్ సంకల్పాలు పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌ కఠోర శ్రమతో, అంకితభావం తో నెరవేరుతున్నాయని కూడా శ్రీ మోదీ అన్నారు. సుమారు ఒక లక్షమంది కార్యకర్తలతోపాటు యువతీయువకులు, బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇదెంత భారీ కార్యక్రమమో చెప్పకనే చెబుతోందని, దీనిని చూడడం తనకు సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు. తాను సభాస్థలిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఈ కార్యక్రమంలో ఉత్సాహాతిరేకం ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందీ తనకు తెలుస్తూనే ఉందన్నారు. పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, సాధువులందరికీ ఈ భవ్య దివ్య కార్యక్రమానికిగాను ఆయన తన అభినందనలను అందజేశారు.

Maharashtra has witnessed the triumph of development, good governance, and genuine social justice: PM Modi

November 23rd, 10:58 pm

Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.

PM Modi addresses passionate BJP Karyakartas at the Party Headquarters

November 23rd, 06:30 pm

Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.

అభివృద్ధి, వారసత్వంతో ముందుకు సాగిపోయేందుకు కట్టుబడి ఉన్నాం: ప్రధాన మంత్రి

November 12th, 07:05 am

ఇగాస్ పండుగ సందర్భంగా పౌరులందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, వారసత్వంల మేలికలయికతో మునుముందుకు సాగిపోయేందుకు దేశం కంకణం కట్టుకొందని ఆయన వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా ఉత్తరాఖండ్ పౌరులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఇగాస్ పండుగ వారసత్వం మరింతగా వర్ధిల్లగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 09th, 11:00 am

నేటి నుంచి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం మొదలవుతుంది. అంటే ఉత్తరాఖండ్ 25వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రానికి ఉజ్వలమైన, జాజ్వల్యమానమైన భవిష్యత్తును నిర్మించే దిశగా అంకితభావంతో మనముందున్న వచ్చే 25 సంవత్సరాల ప్రస్థానాన్ని మనం ప్రారంభించాలి. యాదృచ్ఛికమే అయినా, సంతోషకరమైన విషయమొకటి ఇందులో ఉంది: జాతీయవృద్ధి కోసం అంకితం చేసిన 25 ఏళ్ల విశేష సమయమైన భారత అమృత్ కాల్, మనం సాధించబోయే ఈ పురోగతి ఏకకాలంలో తటస్థించబోతున్నాయి. అభివృద్ధి చెందిన భారత్‌లో అభివృద్ధి చెందిన ఉత్తరాఖండ్ భావనను ఈ కలయిక దృఢపరుస్తుంది. ఈ కాలంలో మనందరి ఆకాంక్షలు నెరవేరతాయి. ఉత్తరాఖండ్ ప్రజలు రానున్న 25 ఏళ్ల లక్ష్యాలపై దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా ఉత్తరాఖండ్ ఘనతను చాటడంతోపాటు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అనే భావన రాష్ట్ర ప్రజలందరిలో ప్రతిధ్వనిస్తుంది. దృఢ సంకల్పాన్ని స్వీకరించిన ఈ ముఖ్య సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రెండు రోజుల కిందటే ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్ విజయవంతంగా నిర్వహించారు. మన ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో గణనీయమైన పాత్ర పోషిస్తారని విశ్వసిస్తున్నాను.

దేవభూమి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

November 09th, 10:40 am

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు రజతోత్సవ సంవత్సరం ఈ రోజే ప్రారంభమవుతున్నదని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పడి 25 వసంతాలు పూర్తవుతుండడాన్ని గుర్తుచేస్తూ... రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని ప్రజలను శ్రీ మోదీ కోరారు. వచ్చే 25 ఏళ్ల ఉత్తరాఖండ్ ప్రస్థాన సమయానికి భారత్ అమృత కాల్ కు కూడా 25 ఏళ్లు నిండబోతుండడం శుభసూచకమన్నారు. వికసిత భారత్ లో వికసిత ఉత్తరాఖండ్ సంకల్పం నెరవేరబోతుండడాన్ని అది సూచిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే 25 ఏళ్లకు పలు తీర్మానాలతో అనేక కార్యక్రమాలను ప్రజలు చేపట్టారని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు ఉత్తరాఖండ్‌ ఘనతను చాటుతాయని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ ఎదిగి ఆ ఫలితాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయని అన్నారు. ఈ సంకల్పాన్ని స్వీకరించిన రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ‘ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్’ను గుర్తుచేసిన ప్రధాని.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అల్మోడాలో రోడ్డు ప్రమాద మృతులకు ప్రధానమంత్రి సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ఇస్తున్నట్టు ప్రకటన

November 04th, 01:19 pm

ఉత్తరాఖండ్‌లోని అల్మోడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. పీఎంఓ ఇండియా ద్వారా సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Congress aims to weaken India by sowing discord among its people: PM Modi

October 08th, 08:15 pm

Initiating his speech at the BJP headquarters following a remarkable victory in the assembly election, PM Modi proudly stated, “Haryana, the land of milk and honey, has once again worked its magic, turning the state 'Kamal-Kamal' with a decisive victory for the Bharatiya Janata Party. From the sacred land of the Gita, this win symbolizes the triumph of truth, development, and good governance. People from all communities and sections have entrusted us with their votes.”

PM Modi attends a programme at BJP Headquarters in Delhi

October 08th, 08:10 pm

Initiating his speech at the BJP headquarters following a remarkable victory in the assembly election, PM Modi proudly stated, “Haryana, the land of milk and honey, has once again worked its magic, turning the state 'Kamal-Kamal' with a decisive victory for the Bharatiya Janata Party. From the sacred land of the Gita, this win symbolizes the triumph of truth, development, and good governance. People from all communities and sections have entrusted us with their votes.”

ప్రధానమంత్రిని కలిసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

October 08th, 06:35 pm

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ దామీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈ రోజు కలిశారు.

'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ

September 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.

ప్రధాన మంత్రి తోసమావేశమైన ఉత్తరాఖండ్ గవర్నరు

July 12th, 05:51 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఉత్తరాఖండ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్ మీత్ సింగ్ (రిటైర్డ్) న్యూ ఢిల్లీ లో ఈ రోజున సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

June 25th, 01:42 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింహ్ ధామీ ఈ రోజు న సమావేశమయ్యారు.

ఉత్తరాఖండ్లో బస్సు ప్రమాదం లో జరిగిన ప్రాణనష్టానికి సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి,బాధితులకు పరిహారాన్ని ప్రకటించారు

June 15th, 07:44 pm

ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లో జరిగిన ఒక బస్సు దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ప్రియతములను కోల్పోయిన కుటుంబాల కు ఆయన సంతాపాన్ని తెలియజేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు త్వరగా పున:స్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడిని ప్రధాన మంత్రి ప్రార్థించారు.

బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో పర్యాటకాన్ని పెంచుతోంది, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది: రిషికేశ్‌లో ప్రధాని మోదీ

April 11th, 12:45 pm

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని రాక సందర్భంగా రిషికేశ్ ర్యాలీలో గుమిగూడిన ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గంగామాతకి సమీపంలో ఉన్న చార్ ధామ్‌కి ప్రవేశ ద్వారం అయిన రిషికేశ్‌లో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ దార్శనికత మరియు ఇప్పటికే సాధించిన మైలురాళ్లకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రధాని చర్చించారు.

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన బహిరంగ సభలో ఉత్సాహంగా ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు

April 11th, 12:00 pm

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని రాక సందర్భంగా రిషికేశ్ ర్యాలీలో గుమిగూడిన ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గంగామాతకి సమీపంలో ఉన్న చార్ ధామ్‌కి ప్రవేశ ద్వారం అయిన రిషికేశ్‌లో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ దార్శనికత మరియు ఇప్పటికే సాధించిన మైలురాళ్లకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రధాని చర్చించారు.

ఎమర్జెన్సీ నాటి మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోయింది: ప్రధాని మోదీ

April 02nd, 12:30 pm

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. తన ప్రసంగాన్ని ప్రారంభించి, పిఎం మోదీ ఇలా వ్యాఖ్యానించారు, ఇది ఉత్తరాఖండ్‌లోని 'దేవభూమి'లో నా ప్రారంభ ఎన్నికల ర్యాలీని సూచిస్తుంది. అంతేకాకుండా, మినీ ఇండియాగా పేరుపొందిన ప్రాంతంలో మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు.

ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ శక్తివంతమైన ప్రసంగం చేశారు

April 02nd, 12:00 pm

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. తన ప్రసంగాన్ని ప్రారంభించి, పిఎం మోదీ ఇలా వ్యాఖ్యానించారు, ఇది ఉత్తరాఖండ్‌లోని 'దేవభూమి'లో నా ప్రారంభ ఎన్నికల ర్యాలీని సూచిస్తుంది. అంతేకాకుండా, మినీ ఇండియాగా పేరుపొందిన ప్రాంతంలో మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు.

Cabinet approves Flood Management and Border Areas Programme (FMBAP) for the period 2021-26

February 21st, 11:36 pm

The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi approved the proposal of Department of Water Resources, RD & GR for continuation of centrally sponsored Scheme, viz., “Flood Management and Border Areas Programme (FMBAP)” with total outlay of Rs. 4,100 crore for a period of 5 years from 2021-22 to 2025-26 (15th Finance Commission period).