ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గ్లోబ ల్ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 లో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం...
February 10th, 11:01 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమంతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యజి, బ్రజేష్ పాఠక్ జి, కేంద్ర కేబినెట్‌లో నా సీనియర్ సహచరులు, లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, వివిధ దేశాలనుంచి విచ్చేసిన ఘనతవహించిన ప్రతినిధులకు, ఉత్తరప్రదేశ్ కు చెందిన మంత్రులు అందరికీ, పరిశ్రమ వర్గాలకు చెందినవారికి, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమాజానికి, విధాన నిర్ణేతలు, కార్పొరేట్ నేతలు, ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హాజరైన సోదర సోదరీమణులారా, మీ అందరికీ ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హృదయపూర్వక స్వాగతం. ముఖ్య అతిథిగా ఉంటూ మీ అందరికీ స్వాగతం పలికే బాధ్యతను నేను ఎందుకు తీసుకున్నానని మీ అందరూ ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే, నాకు ఇక్కడ అదనపు బాధ్యత కూడా ఉంది. మీరందరూ నన్ను భారతదేశ ప్రధానమంత్రిగా చేశారు. అలాగే నేను ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. నాకు ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రజల పట్ల ప్రత్యేక బాధ్యత కూడా ఉంది. ఇవాళ నేను ఆ బాధ్యతను పూర్తి చేసేందుకు నేను ఇందులో భాగస్వామినయ్యాను. అందువల్ల భారతదేశం వివిధ ప్రాంతాలనుంచి అలాగే విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్ కు విచ్చేసిన ఇన్వెస్టర్లందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాను.ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను లక్నోలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
February 10th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లక్నోలో ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్లోబల్ ట్రేడ్ షోను, ఇన్వెస్ట్ యుపి 2.0ను ప్రధానమంత్రి ప్రారంభించారు.ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్. దీని ద్వారా విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు, అకడమిక్ రంగానికి చెందిన వారు, ప్రపంచవ్యాప్తంగా గల మేధావులు, నాయకులు, వ్యాపార అవకాశాలపై సమిష్టిగా చర్చించి భాగస్వామ్యాలు కుదుర్చుకుంటారు.ఈ సమ్మేళనం సందర్భగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి స్వయంగా తిలకించారు.అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
September 14th, 12:01 pm
ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి. ఆనందిబెన్ పటేల్ గారు, ఉత్తర ప్రదేశ్ యువ, చురుకైన ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి, దినేష్ శర్మ గారు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలీగఢ్ కు చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా,అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
September 14th, 11:45 am
అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి తాలూకు నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి, ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ నమూనా ల ప్రదర్శన ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ కి సెప్టెంబర్ 14న శంకు స్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
September 13th, 11:20 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ కి 2021 సెప్టెంబన్ 14 న మధ్యాహ్నం 12 గంటల కు శంకు స్థాపన చేయనున్నారు. తరువాత ఇదే కార్యక్రమం లో ఆయన ప్రసంగం కూడా ఉంటుంది. ప్రధాన మంత్రి రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ మరియు ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ ల ప్రదర్శన నమూనాల ను సైతం సందర్శిస్తారు.సోషల్ మీడియా కార్నర్ 21 ఫెబ్రవరి 2018
February 21st, 08:38 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!నవ భారతదేశ నిర్మాణంలో నవ ఉత్తరప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది: ప్రధాని నరేంద్ర మోదీ
February 21st, 01:04 pm
లక్నోలో ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సామర్ధ్యం + విధానం + ప్రణాళిక + కార్యాచరణ పెర్ఫార్మన్స్ కు దారితీస్తాయి మరియు ఇప్పుడు సూపర్ హిట్ ప్రదర్శన ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ యొక్క తరుణం. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అడ్డంకులను తొలగించి పెట్టుబడిదారులకు ఎర్ర తివాచి పరుస్తుందని ఆయన అన్నారు.‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 21st, 01:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ లో ఈ రోజు ప్రారంభోపన్యాసం చేశారు.