Prime Minister Narendra Modi to chair fourth National Conference of Chief Secretaries in Delhi

December 13th, 12:53 pm

PM Modi will chair the 4th National Conference of Chief Secretaries in Delhi, focusing on entrepreneurship, employment, and skilling to leverage India's demographic pidend. Key themes include manufacturing, renewable energy, and circular economy, with special sessions on economic growth, investment, and capacity building.

We are working fast in every sector for the development of Odisha: PM Modi at Odisha Parba 2024

November 24th, 08:48 pm

PM Modi addressed Odisha Parba 2024, celebrating Odisha's rich cultural heritage. He paid tribute to Swabhaba Kabi Gangadhar Meher on his centenary, along with saints like Dasia Bauri, Salabega, and Jagannath Das. Highlighting Odisha's role in preserving India's cultural persity, he shared the inspiring tale of Lord Jagannath leading a battle and emphasized faith, unity, and pine guidance in every endeavor.

ఒడిశా పర్వ 2024 ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

November 24th, 08:30 pm

న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ‘ఒడిశా పర్వ 2024’ ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు హాజరైన ఒడిశా సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదితో స్వభావ్ కవి గంగాధర్ మెహర్ మరణించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భక్త దసియా భౌరీ, భక్త సాలబేగ, భగవద్గీతను ఒడియాలో రచించిన శ్రీ జగన్నాథ్ దాస్‌‌కు సైతం ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం (2024-2028) అమలుకు కార్యాచరణ ప్రణాళిక

August 22nd, 08:22 pm

భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక అమలు దిశగా రెండు దేశాల ప్రధానమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా ద్వైపాక్షిక సహకారం వేగం పుంజుకోవడాన్ని 2024 ఆగస్టు 22న వార్సాలో సమావేశం సందర్భంగా వారిద్దరూ గుర్తించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 2024-28 మధ్య ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన-అమలుకు ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో కింది ప్రాధాన్యాంశాల పరంగా ద్వైపాక్షిక సహకారానికి ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది:

‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు’’పై భారత-పోలెండ్ సంయుక్త ప్రకటన

August 22nd, 08:21 pm

పోలెండ్ ప్రధానమంత్రి మాననీయ డోనాల్డ్ టస్క్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 21,22 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ చారిత్రక పర్యటన చోటు చేసుకుంది.

పోలాండ్ ప్ర‌ధానితో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ భేటీ

August 22nd, 06:10 pm

ఫెడ‌ర‌ల్ ఛాన్స‌ల‌రీని చేరుకున్న ప్ర‌ధానికి పోలాండ్ ప్ర‌ధాని శ్రీ డోనాల్డ్ ట‌స్క్ సంప్ర‌దాయ‌బ‌ద్దంగా సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

పోలండ్ ప్రధానితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనల ఆంగ్ల అనువాదం

August 22nd, 03:00 pm

అందమైన వార్సా నగరంలో సాదర స్వాగతం, మర్యాదపూర్వకమైన ఆతిథ్యం అలాగే స్నేహపూర్వక మాటలు అందించిన ప్రధాన మంత్రి టస్క్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

June 18th, 05:32 pm

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శివరాజ్ సింగ్ చౌహాన్, భగీరథ్ చౌదరి గారు, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, శాసనమండలి సభ్యుడు మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ భూపేంద్ర చౌదరి గారు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా రైతు సోదర సోదరీమణులు, కాశీక లోని నా కుటుంబ సభ్యులారా,

ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో ప్రధానమంత్రి ప్రసంగం

June 18th, 05:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ ను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) కింద 9.26 కోట్ల మంది లబ్ధిదారులకు 17వ వాయిదా సొమ్ము రూ.20,000 కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే 30,000 మంది పైగా స్వయం సహాయక బృందాల సభ్యులకు కృషిసఖి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. టెక్నాలజీ సహాయంతో దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమంతో అనుసంధానం అయ్యారు.

ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ , ఉత్తర ప్రదేశ్ పర్యటన

February 21st, 11:41 am

ఫిబ్రవరి 22న ఉదయం 10:45 గంటలకు అహ్మదాబాద్ లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మహేసన చేరుకుని వలీనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు, దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహేసనలోని తారాభ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని రూ.8,350 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4:15 గంటలకు నవ్సారికి చేరుకుని, అక్కడ రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల జాతికి అంకితం చేసి, శంకుస్థాపన, సుమారు రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన, పనుల ప్రారంభం చేస్తారు. సాయంత్రం 6:15 గంటలకు ప్రధాన మంత్రి కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ ను సందర్శిస్తారు. అక్కడ రెండు కొత్త ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను (పిహెచ్ డబ్ల్యుఆర్) జాతికి అంకితం చేస్తారు.

జనవరి 25 వ తేదీ నాడు బులంద్‌శహర్ ను మరియు జయ్‌పుర్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

January 24th, 05:46 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 25 వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ ను మరియు రాజస్థాన్ లో జయ్‌పుర్ ను సందర్శించనున్నారు. 19,100 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి బులంద్‌శహర్ లో మధ్యాహ్నం పూట దాదాపు గా ఒక గంట నలభై అయిదు నిమిషాల వేళ కు ప్రారంభించడం తో పాటు వాటి ని దేశ ప్రజల కు అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు లు రేల్ వే, రహదారి, చమురు మరియు గ్యాస్, ఇంకా పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణం ల వంటి అనేక ముఖ్య రంగాల కు సంబంధించినవి.

PM Modi's address to the people of Mizoram via VC

November 05th, 02:15 pm

Addressing the people of Mizoram via video conference, Prime Minister Narendra Modi today said, “Before 2014, people perceived the northeastern states, such as Mizoram, as distant from Delhi both physically and psychologically. The BJP recognized this sense of distance and, after coming into power as part of the NDA government in 2014, made it a priority to bridge this gap by addressing the aspirations and needs of the northeastern states.”

వీధి వ్యాపారులపై పిఎం స్వనిధి పథకం యొక్క అద్భుతమైన ప్రభావం: ఎస్బిఐ ద్వారా ఒక విశ్లేషణ

October 24th, 03:02 pm

2020లో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి స్వనిధి పథకం, పట్టణ వీధి వ్యాపారుల కోసం మైక్రో క్రెడిట్ పథకం, ఇది రూ. 50,000 వరకు పూచీకత్తు రహిత రుణాలను అందిస్తుంది. పిఎం స్వనిధి పేరుతో ఎస్బీఐ ఇటీవలి పరిశోధన పని: గ్రాస్రూట్ మార్కెట్ మావెరిక్స్‌ను సాధికారపరచడం ద్వారా దేశం యొక్క సామాజిక వస్త్రాన్ని బలోపేతం చేయడం పిఎం స్వనిధి యొక్క పరివర్తన ప్రభావాన్ని విశ్లేషించింది. ప్రధానమంత్రి స్వనిధి అట్టడుగున ఉన్న పట్టణ సూక్ష్మ వ్యాపారవేత్తలను సజావుగా అనుసంధానించారు, మార్గంలో ఉన్న కమ్యూనిటీ అడ్డంకులను విచ్ఛిన్నం చేశారు.

రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్ లో ప్రధాని ప్రసంగం

April 26th, 08:01 pm

అర్నబ్ గోస్వామి గారూ, రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ సహోద్యోగులందరూ, దేశవిదేశాల్లోని రిపబ్లిక్ టీవీ వీక్షకులందరూ, లేడీస్ అండ్ జెంటిల్ మెన్! నేను ఏదైనా చెప్పే ముందు, నా చిన్నతనంలో నేను విన్న ఒక జోక్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన కుమార్తె ఆత్మహత్య కు పాల్పడుతూ, తాను జీవితంలో విసిగిపోయానని, ఇక బతకడం ఇష్టం లేదని నోట్ రాసి పెట్టింది. ఏదో ఒకటి తిని కంకారియా సరస్సులో దూకి చనిపోతానని రాసింది. మరుసటి రోజు ఉదయం తన కూతురు ఇంట్లో లేదని ప్రొఫెసర్ గుర్తించాడు. ఆమె గదికి వెళ్లి చూడగా ఒక ఉత్తరం దొరికింది. ఆ లేఖ చదివిన తర్వాత ఆయనకు చాలా కోపం వచ్చింది. తాను ప్రొఫెసర్ ను అని, ఇన్నేళ్లు కష్టపడ్డానని, అయినా సూసైడ్ లెటర్ లో కూతురు కంకారియా ను తప్పుగా రాసిందని ఆయన అన్నారు. అర్నబ్ హిందీ లో బాగా మాట్లాడటం ప్రారంభించడం సంతోషంగా ఉంది. అతను చెప్పింది నేను వినలేదు, కానీ అతని హిందీ సరైనదా కాదా అనే దానిపై నేను శ్రద్ధ పెట్టాను. బహుశా, ముంబైలో నివసించిన తరువాత మీ హిందీ మెరుగుపడింది.

న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సదస్సులో ప్రధాని ప్రసంగం

April 26th, 08:00 pm

న్యూ ఢిల్లీలోని తాజ్ పాలెస్ హోటల్ లో ఈ రోజు జరిగిన ‘రిపబ్లిక్ సదస్సు’ నుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, వచ్చే నెలకు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రిపబ్లిక్ బృందానికి అభినందనలు తెలియజేశారు. 2019 లో జరిగిన సదస్సులో పాల్గొనటాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అది ప్రజలు వరుసగా రెండోవిడత భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వానికి స్థిరత్వాన్ని ఇచ్చిన సమయమని అన్నారు. భారతదేశానికి ఇదే తగిన సమాయమని దేశం గ్రహించిందనటానికి అది నిదర్శనమన్నారు. ఈ ఏడాది ‘మార్పుకు సమయం’ అనే అంశం మీద జరుపుతున్న సదస్సును దృష్టిలో ఉంచుకొని ఇది నాలుగేళ్లక్రితం తాము ఎంచుకున్న దూరదృష్టిని ప్రతిఫలించిందని, క్షేత్రస్థాయిలో మార్పు చూస్తున్నామని అన్నారు,

మార్చి నెల 25 న కర్నాటక ను సందర్శించనున్న ప్రధానమంత్రి

March 23rd, 05:54 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మార్చి నెల 25 వ తేదీ నాడు కర్నాటక ను సందర్శించనున్నారు. ఉదయం పూట ఇంచుమించు 10 గంటల 45 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి చిక్కబళ్ళాపుర లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండ్ రిసర్చ్ ను ప్రారంభిస్తారు. బెంగళూరు మెట్రో లో భాగం గా ఉన్న వైట్ ఫీల్డ్ (కడుగోడి) నుండి కృష్ణరాజపుర మెట్రో లైను ను మధ్యాహ్నం పూట దాదాపు గా ఒంటి గంట వేళ కు ప్రధాన మంత్రి ప్రారంభించి, మెట్రో లో ప్రయాణిస్తారు కూడాను.

‘పట్టణ ప్రాంతాల కు సంబంధించిన ప్రణాళిక రచన, అభివృద్ధి మరియు పారిశుధ్యం’ అనే అంశం పై బడ్జెటు అనంతరం ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

March 01st, 10:20 am

స్వాతంత్ర్యం తర్వాత మన దేశంలో కొన్ని ప్రణాళికాబద్ధమైన నగరాలు మాత్రమే నిర్మించబడటం దురదృష్టకరం. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి గత 75 సంవత్సరాలలో 75 కొత్త మరియు ప్రధాన ప్రణాళికాబద్ధమైన నగరాలు నిర్మించబడి ఉంటే, ఈ రోజు భారతదేశం యొక్క చిత్రం పూర్తిగా భిన్నంగా ఉండేది. కానీ ఇప్పుడు 21వ శతాబ్దంలో, భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విధంగా, భవిష్యత్తులో భారతదేశానికి అనేక కొత్త నగరాలు అవసరం కానున్నాయి.

‘పట్టణ ప్రాంతాల కు సంబంధించిన ప్రణాళిక రచన, అభివృద్ధి మరియు పారిశుధ్యం’ అనే అంశం పై బడ్జెటు అనంతరం ఏర్పాటైనవెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 01st, 10:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పట్టణ ప్రాంతాల అభివృద్ధి పట్ల ప్రణాళిక రచన లో శ్రద్ధ’ అనే అంశం పై బడ్జెటు అనంతర కాలం లో ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఉపాయాల ను మరియు సూచనల ను కోరుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ ఆరో వెబినార్ గా ఉంది.

గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్, దిండిగల్ 36వ స్నాతకోత్సవ వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

November 11th, 04:20 pm

ఇక్కడ స్నాతకోత్సవానికి రావడం నాకు చాలా స్ఫూర్తిదాయకమైన అనుభవం. గాంధీగ్రామ్ ను మహాత్మా గాంధీ స్వయంగా ప్రారంభించారు. ప్రకృతి సౌందర్యం, స్థిరమైన గ్రామీణ జీవితం, సరళమైన కానీ మేధోపరమైన వాతావరణం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన మహాత్మాగాంధీ ఆలోచనల స్ఫూర్తిని ఇక్కడ చూడవచ్చు. నా యువ మిత్రులారా, మీరందరూ చాలా ముఖ్యమైన సమయంలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. గాంధేయ విలువలు చాలా సందర్భోచితంగా మారుతున్నాయి. సంఘర్షణలకు ముగింపు పలకడం, లేదా వాతావరణ సంక్షోభం గురించి కావచ్చు, మహాత్మా గాంధీ ఆలోచనలు నేటి జ్వలించే సమస్యలకు సమాధానాలు కలిగి ఉన్నాయి. గాంధేయ జీవన విధానంలో విద్యార్థులుగా, గొప్ప ప్రభావాన్ని చూపే గొప్ప అవకాశం మీకు ఉంది.

PM attends 36th Convocation Ceremony of Gandhigram Rural Institute at Dindigul, Tamil Nadu

November 11th, 04:16 pm

PM Modi attended the 36th Convocation Ceremony of Gandhigram Rural Institute at Dindigul in Tamil Nadu. The Prime Minister mentioned that Mahatma Gandhi’s ideals have become extremely relevant in today’s day and age, be it ending conflicts or climate crises, and his ideas have answers to many challenges that the world faces today.