మ‌లేశియా ప్ర‌ధాని తో కలసి పాల్గొన్న సంయుక్త‌ పత్రికా ప్రతినిధుల సమావేశంలో మీడియా కు ప్ర‌ధాన మంత్రి విడుదల చేసిన ప్ర‌క‌టన పాఠం

April 01st, 07:35 pm

ప్ర‌ధాని శ్రీ న‌జీబ్ నేను క‌లసి చాలా సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. ఇరు దేశాల మ‌ధ్య‌ గ‌ల సాంస్కృతిక‌, ఆర్ధిక‌, వ్యూహాత్మ‌క కార్య‌క‌లాపాలను గురించి స‌మ‌గ్రంగా చ‌ర్చించుకోవ‌డం జ‌రిగింది. 2015 నవంబ‌ర్ లో నా మలేశియా ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా తీసుకున్న ప్ర‌ధాన‌మైన నిర్ణ‌యాల అమ‌లులో ఎలాంటి ప్ర‌గ‌తి సాధించామో చ‌ర్చించ‌డం జ‌రిగింది. ఇరు దేశాల మ‌ధ్య‌ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం సంయుక్త దృక్ప‌థాన్ని క‌లిగి వుండాల‌ని మేం నిర్ణ‌యించాం. ఇరు దేశాల మ‌ధ్య ఉండే దూర‌దృష్టి కార్య‌రూపం దాల్చ‌గ‌లిగేలా ఉండాలి. ఇందుకోసం ఇరు దేశాలు త‌మ స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవడం, నూత‌న అంశాలలో ఇరు దేశాల మ‌ధ్య‌న సంబంధాల‌ను ఏర్ప‌రచుకోవ‌డం రెండు దేశాల దూర‌దృష్టిలో ముఖ్యమైన‌వి.