జి-20 విద్య మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియోమాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం పాఠం
June 22nd, 11:00 am
జి-20 విద్య శాఖ మంత్రుల సమావేశాని కి గాను భారతదేశాని కి మిమ్ముల ను నేను ఆహ్వానిస్తున్నాను. విద్య మన నాగరకత కు ఆధారభూతమైన పునాది ఒక్కటే కాదు, అది మానవ జాతి భవిష్యత్తు కు వాస్తుశిల్పి గా కూడా ను ఉంది. విద్య మంత్రులు గా, అందరి కి అభివృద్ధి, అందరి కి శాంతి మరియు అందరి కి సమృద్ధి లను సాధించి పెట్టడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయాసల లో మానవ జాతి కి నాయకత్వం వహిస్తున్నటువంటి శెర్ పా గా మీరు ఉన్నారు. భారతదేశం యొక్క ధర్మ గ్రంథాల లో విద్య తాలూకు భూమిక ను ఆనందాన్ని ప్రసాదించేది అభివర్ణించడం జరిగింది. అది ‘‘విద్యా దదాతి వినయమ్, వినయద్ యాతి పాత్రతామ్. పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం, తతః సుఖమ్.’’ అని చెబుతుంది. ఈ మాటల కు ‘‘సిసలైనటువంటి జ్ఞానం అణకువ ను ఇస్తుంది. వినమ్రత నుండి యోగ్యత వస్తుంది. పాత్రత ఏ వ్యక్తి కి అయినా సంపద ను ప్రాప్తింప జేస్తుంది. సంపద ఏ వ్యక్తి ని అయినా సత్కార్యాల ను చేసే శక్తి ని అనుగ్రహిస్తుంది. మరి ఇదే ఆనందాన్ని కొనితెస్తుంది.’’ అని భావం. ఈ కారణం గా భారతదేశం లో మేం ఒక సమగ్రమైనటువంటి మరియు విస్తృత మైనటువంటి యాత్ర కు శుభారంభం చేశాం. మన యువతీ యువకుల కు మౌలిక అక్షరాస్యత అనేది ఒక బలమైన ఆధారం గా నిలుస్తుంది అని మేం విశ్వసిస్తున్నాం. మరి మేం దీని ని సాంకేతిక విజ్ఞానం తో కూడాను జోడిస్తున్నాం. దీనికి గాను మేం ‘‘నేశనల్ ఇనిశియేటివ్ ఫార్ ప్రఫిశన్సి ఇన్ రీడింగ్ విద్ అండర్ స్టాండింగ్ ఎండ్ న్యూమరసి’’ లేదా ‘‘నిపుణ్ భారత్’’ కార్యక్రమాన్ని ఆరంభించాం. ‘‘మౌలిక అక్షరాస్యత మరియు అంక జ్ఞానం’’ .. ఈ రెంటి ని మీ యొక్క సమూహం సైతం ప్రాధాన్య అంశం గా గుర్తించినందుకు నేను సంతోషిస్తున్నాను. మనం 2030 వ సంవత్సరాని కల్లా కాలబద్ధ రీతి లో దీని పై కృషి చేయాలి అనే ఒక సంకల్పాన్ని చెప్పుకొని తీరాలి.జి20 విద్యా మంత్రుల సమావేశం ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం
June 22nd, 10:36 am
సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, విద్య అనేది మన నాగరికతకు పునాది మాత్రమే కాదు, మానవత్వం భవిష్యత్తు రూపురేఖలను తీర్చిదిద్దేది అని అన్నారు. ప్రధాన మంత్రి విద్యా మంత్రులను షెర్పాలు అని ప్రస్తావిస్తూ, అభివృద్ధి, శాంతి, అందరి శ్రేయస్సు కోసం మానవజాతి కృషిలో వారు నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఆనందాన్ని తీసుకురావడంలో విద్య పాత్ర కీలకమని భారతీయ గ్రంథాలు వివరిస్తున్నాయని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. 'నిజమైన జ్ఞానం వినయాన్ని ఇస్తుంది, వినయం నుండి యోగ్యత వస్తుంది, యోగ్యత నుండి సంపద వస్తుంది, సంపద మనిషికి సత్కార్యాలు చేయడానికి వీలు కల్పిస్తుంది ఇదే సంతోషాన్ని ఇస్తుంది' అని అర్థం వచ్చే సంస్కృత శ్లోకాన్ని వినిపించారు ప్రధాన మంత్రి. సంపూర్ణ, సమగ్ర ప్రయాణం సాగిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘అండర్‌స్టాండింగ్, న్యూమరాసీతో చదవడంలో నైపుణ్యం కోసం జాతీయ చొరవ’ లేదా ‘నిపున్ భారత్’ చొరవను ఆయన ప్రస్తావించారు. ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరాసీ’ని జి20 కూడా ప్రాధాన్యతగా గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 2030 నాటికి నిర్దిష్ట కాలానుగుణంగా పని చేయాలని కూడా ఆయన నొక్కి చెప్పారు.శిక్షక్ పర్వ్ ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 07th, 10:31 am
మంత్రి వర్గంలో నా సహద్యోగి శ్రీ ధర్మేంద్ర ప్రధాంజీ, శిక్షక్ పర్వ్ (శిక్ష క్ పర్వ్) అనే ఈ కీలక కార్య క్ర మంలో మాతో క లుసుకుంటున్నాను. అన్నపూర్ణా దేవి గారు, డాక్టర్ సుభాష్ సర్కార్ గారు, డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ గారు, దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యా శాఖ గౌరవనీయ మంత్రి గానా, జాతీయ విద్యా విధానం నమూనాను తయారు చేయడానికి కమిటీ అధ్యక్షుడు, డాక్టర్ కస్తూరి రంగంజీ, ఆమె బృందంలోని గౌరవనీయ గౌరవనీయ సభ్యులు, దేశం నలుమూలల నుండి మాతో ఉన్న అన్ని నేర్చుకున్న ప్రచారగణాలు, ఉపాధ్యాయులు మరియు ప్రియమైన విద్యార్థులు!‘శిక్షక్పర్వ్’ ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి; విద్య రంగం లో అనేక మహత్వపూర్ణ పథకాల ను ఆయన ప్రారంభించారు
September 07th, 10:30 am
‘శిక్షక్ పర్వ్’ తాలూకు ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఆయన భారతీయ సంజ్ఞా భాషా నిఘంటువు (వినికిడి లోపం ఉన్నవారి కి యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లెర్నింగ్ కు అనుగుణం గా ఆడియో మరియు టెక్స్ ట్ ఎంబెడెడ్ సంజ్ఞ భాష వీడియో) ను, మాట్లాడే పుస్తకాలు (దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందినటువంటి ఆడియో బుక్స్) ను, సిబిఎస్ఇ యొక్క స్కూల్ క్వాలిటీ అశ్యోరన్స్ ఎండ్ అసెస్ మెంట్ ఫ్రేమ్ వర్క్ ను, ‘నిపుణ్ భారత్’ కు ఉద్దేశించినటువంటి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం అయిన ‘నిష్ఠ’ ను, విద్యాంజలి పోర్టల్ ను (పాఠశాల అభివృద్ధి కి విద్య వాలంటియర్ లు/ దాత లు/ సిఎస్ఆర్ సహకారాన్ని సులభతరం చేయడం కోసం ఉద్దేశించింది) కూడా ప్రారంభించారు.