297 పురాత‌న వ‌స్తువుల‌ను భార‌త్‌కు తిరిగిచ్చిన అమెరికా

September 22nd, 12:11 pm

భార‌త్‌, అమెరికా మ‌ధ్య స‌న్నిహిత ద్వైపాక్షిక సంబంధాల‌కు అనుగుణంగా ఉన్న‌త‌మైన‌ సాంస్కృతిక అవ‌గాహ‌న‌ను పెంపొందించుకోవ‌డానికి జూలైలో సాంస్కృతిక సంపద ఒప్పందం కుదిరింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్య‌, సాంస్కృతిక వ్య‌వ‌హారాల బ్యూరో, భార‌త ప్ర‌భుత్వంలోని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో గ‌ల‌ భార‌తీయ పురావ‌స్తు స‌ర్వేక్ష‌ణ విభాగం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సాంస్కృతిక వార‌స‌త్వాన్ని ప‌రిర‌క్షించేందుకు స‌హ‌కారాన్ని పెంపొందించుకోవాల‌ని 2023 జూన్‌లో జ‌రిగిన స‌మావేశం అనంత‌రం అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌, భార‌త ప్ర‌ధాన‌మంత్రి మోదీ చేసిన ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌లోని ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చ‌డంలో భాగంగా ఈ ఒప్పందం జ‌రిగింది.

వాస్తవ పత్రం (ఫ్యాక్ట్ షీట్) : 2024 క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు

September 22nd, 12:06 pm

సెప్టెంబర్ 21, 2024 న, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ డెలావేర్ లోని విల్మింగ్టన్ లో నాల్గవ క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫ్యూమియో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లకు ఆతిథ్యం ఇచ్చారు.

సమాచార పట్టిక: ఇండో-పసిఫిక్‌లో క్యాన్సర్‌ను ‌తగ్గించడానికి క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన క్వాడ్ దేశాలు

September 22nd, 12:03 pm

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో క్యాన్సర్‌ను అంతం చేయటంలో పురోగతి సాధించేందుకు అద్భుతమైన కార్యక్రమాన్ని క్వాడ్ దేశాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ప్రధాన ఆరోగ్య సంక్షోభంగా కొనసాగుతున్న, చాలావరకు నివారించదగిన వ్యాధి అయిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై ఈ కార్యక్రమం పనిచేయనుంది. ఈ ఒక్క రకం క్యాన్సర్‌తో మొదలైన ఈ కార్యకమం ఇతర క్యాన్సర్‌ల సమస్యను కూడా పరిష్కరించేందుకు పునాది వేయనుంది. క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న విస్తృత నిర్ణయాల్లో ఈ కార్యక్రమం ఒకటిగా ఉంది.

ఉమ్మడి వాస్తవ పత్రం: సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణను కొనసాగించనున్న అమెరికా, ఇండియా

September 22nd, 12:00 pm

అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.

విల్మింగ్టన్ డిక్లరేషన్‌పై ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా నేతల సంయుక్త ప్రకటన

September 22nd, 11:51 am

ఈరోజు, అమెరికా అధ్యక్షులు జోసెఫ్ ఆర్.బిడెన్ జూనియర్ తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఆతిథ్యమిచ్చిన క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోఆయనతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో సమావేశమయ్యాం .

సుర‌క్షిత‌మైన అంత‌ర్జాతీయ స్వచ్ఛ ఇంధ‌న స‌ర‌ఫ‌రా వ్యవస్థల నిర్మాణం కోసం అమెరికా- భార‌త్ చొర‌వ‌కు మార్గ‌ద‌ర్శ ప్ర‌ణాళిక‌

September 22nd, 11:44 am

ఉమ్మ‌డి జాతీయ‌, ఆర్థిక భ‌ద్ర‌త‌కు సంబంధించిన పరస్పర అంశాల‌పై స‌హ‌కారాన్ని మ‌రింత పెంచుకోవాల‌ని అమెరికా, భార‌త్ లు మరింత సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఆర్థిక పరమైన అజెండాలో స్వ‌చ్ఛ ఇంధ‌నానికి పెద్దపీట వేయడం ద్వారా ప్రజలకు ఉన్నతోద్యోగాలను కల్పించవచ్చనీ, స్వ‌చ్ఛ ఇంధ‌న వినియోగాన్ని ప్రపంచవ్యాప్తం చేయవచ్చుననీ, అంత‌ర్జాతీయ పర్యావరణ ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డం కూడా సాధ్యం అవుతుందని ఇరుదేశాలూ నిర్ణయించుకున్నాయి.

న్యూయార్క్ చేరుకున్న ప్రధాని మోదీ

September 22nd, 11:19 am

డెలావేర్‌లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఫలవంతంగా ముగించుకుని, కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. నగరంలో జరిగే కమ్యూనిటీ ప్రోగ్రామ్ మరియు 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్' వంటి వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు.

అమెరికా పర్యటనకు ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన

September 21st, 04:15 am

అధ్యక్షుడు బైడెన్ తన స్వస్థలం విల్మింగ్టన్ లో నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి, న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భవిష్యత్తుకు సంబంధించిన శిఖరాగ్ర సమావేశం (సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ ) లో ప్రసంగించడానికి నేను మూడు రోజుల అమెరికా పర్యటనకు ఈ రోజు బయలుదేరుతున్నాను.

తొలి అంతర్జాతీయ సౌర ఉత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం

September 05th, 11:00 am

గౌరవనీయ ప్రముఖులారా, విశిష్ట అతిథులారా, నా ప్రియ మిత్రులారా! మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటి అంతర్జాతీయ సౌరోత్సవానికి మీ అందరినీ సంతోషంగా స్వాగతిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమికి అభినందనలు.

అధ్యక్షుడు బిడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషణ

August 26th, 10:03 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఇవాళ అమెరికా అధ్య‌క్షుడు గౌరవనీయ జోసెఫ్ ఆర్.బిడెన్ ఫోన్ ద్వారా సంభాషించారు.

శ్రీడోనాల్డ్ ట్రంప్ మీద జరిగిన దాడి ని ఖండించిన ప్రధాన మంత్రి

July 14th, 09:15 am

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పూర్వ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ మీద జరిగిన దాడి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఈ రోజున ఖండించారు.

మారిశస్ ప్రధాని, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు మరియు యుఎస్ అధ్యక్షుడు లతో మూడుద్వైపాక్షిక సమావేశాల ను న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో నిర్వహించనున్న ప్రధానమంత్రి

September 08th, 01:40 pm

మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జుగ్ నాథ్, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు మరియు యుఎస్ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ లతో మూడు ద్వైపాక్షిక సమావేశాల ను ఈ రోజు న సాయంత్రం పూట న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో జరపనున్నట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ మాధ్యం ద్వారా తెలియ జేశారు.

అమెరికాలోని ప్రముఖ వృత్తినిపుణులతో ప్రధాని ముఖాముఖి

June 24th, 07:28 am

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23 న వాషింగ్టన్ డీసీ లోని జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్ లో అమెరికా వృత్తినిపుణులతో భేటీ జరిపి వారితో సంభాషించారు. అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా పాల్గొన్నారు.

అమెరికా అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి తొలి పలుకుల తెలుగు అనువాదం

June 23rd, 07:56 pm

ముందుగా మీకు… జిల్‌ బైడెన్‌ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాతోపాటు మా ప్రతినిధి బృందానికి మీరు సాదర స్వాగతం పలికినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేడు భారత సమాజాన్ని శ్వేతసౌధంలోకి అనుమతించినందుకూ నా కృతజ్ఞతలు. మీ హృదయపూర్వక స్వాగతం ఫలితంగా అమెరికా-భారత్‌ మధ్య భవిష్యత్‌ వ్యూహాత్మక సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూసే అవకాశం వేలాది భారతీయులకు లభించింది.

India-USA partnership augurs well for the democracy: PM Modi in his address to the US Congress

June 23rd, 07:17 am

PM Modi addressed a Joint Sitting of the US Congress. He spoke about the rapid strides made in India-US bilateral relations and shared his vision for elevating bilateral ties. He also outlined the enormous progress made by India and the opportunities that it presents for the world.

యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం

June 23rd, 07:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ హౌస్ ఆప్ రిప్రెజెంటెటివ్స్ స్పీకర్ శ్రీ కెవిన్ మేక్ కార్థీ, సీనెట్ లో సంఖ్యాబలమున్న నేత శ్రీ చార్ల్ స్ శూమర్, సీనెట్ లో రిపబ్లికన్ పార్టీ నేత శ్రీ మిచ్ మేక్ కోనెల్ మరియు సభ లో డెమోక్రెటిక్ పార్టీ నేత శ్రీ హకీమ్ జెఫ్రీస్ లు ఆహ్వానించిన మీదట 2023 వ సంవత్సరం లో జూన్ 22 తేదీ న యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

యుఎస్ఎఅధ్యక్షుని తో ప్రధాన మంత్రి సమావేశం

June 23rd, 12:51 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ఎ లో ఆధికారిక పర్యటన లో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఈ రోజు న ఉదయం పూట వైట్ హౌస్ ను సందర్శించారు. అక్కడ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ మరియు ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ గారు లు ఆయన కు సంప్రదాయబద్ధ స్వాగతం పలికారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి కి స్వాగతం పలికేందుకు భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ లు వేల సంఖ్య లో తరలివచ్చారు.

అమెరికా అధ్యక్షుడితో సంయుక్తంగా పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన తెలుగు అనువాదం

June 22nd, 11:19 pm

భారత-అమెరికా వాణిజ్య/పెట్టుబడి భాగస్వామ్యం మా రెండు దేశాలకు మాత్రమేగాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ కీలకమైనది. నేడు భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ నేపథ్యంలో అపరిష్కృత వాణిజ్య సంబంధ సమస్యలకు స్వస్తి పలికి సరికొత్తగా ప్రారంభించాలని మేం నిర్ణయించుకున్నాం. మా సాంకేతిక సహకారంలో భాగంగా ‘సునిశిత-భవిష్యత్‌ సాంకేతికతల కోసం చొరవ’ (ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్-ఐసిఇటి) ఒక ముఖ్యమైన చట్రంగా రూపొందింది. ఆ మేరకు కృత్రిమ మేధస్సు. సెమి-కండక్టర్స్, అంతరిక్షం, క్వాంటం, టెలికాం వగైరా రంగాల్లో సహకార విస్తరణ ద్వారా బలమైన భవిష్యత్ భాగస్వామ్యం నిర్మిస్తున్నాం. మైక్రాన్, గూగుల్, అప్లైడ్ మెటీరియల్స్ వంటి అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించడమే దీనికి నిదర్శనం.

అమెరికా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాలన్న ఆహ్వానాన్ని మన్నించిన ప్రధాన మంత్రి

June 06th, 09:45 pm

అమెరికా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా సభాపతి కెవిన్ మెకార్తే ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవంగా స్వీకరించారు. ఇరుదేశాల ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య సంబంధాలు, ప్రపంచ శాంతికి, సుసంపన్నతకు అంకితభావంతో కట్టుబడి ఉండటం పునాదిగా రెండు దేశాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడటం గర్వకారణమని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

సిడ్ నీ లో తరువాతి క్వాడ్ సమిట్ కు ఆతిథేయి గావ్యవహరించనున్నందుకు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీస్ కు ధన్యవాదాల ను తెలియజేసిన ప్రధాన మంత్రి

April 26th, 06:46 pm

ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో జరగబోయే తరువాతి క్వాడ్ శిఖర సమ్మేళనాని కి ఆతిథేయి గా వ్యవహరించనున్న ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీ స్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.