భారతదేశం లో లాజిస్టిక్స్ రంగం లో పరివర్తన ను తీసుకురావడం లో యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫార్మ్ (యుఎల్ఐపి) పాత్ర నుప్రశంసించిన ప్రధాన మంత్రి

July 10th, 10:06 pm

భారతదేశం లోని లాజిస్టిక్స్ రంగం లో మార్పు ను తీసుకు రావడం లో యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫార్మ్ (యుఎల్ఐపి) యొక్క పాత్ర ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

నూతన రవాణా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

September 21st, 04:02 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం జాతీయ రవాణా విధానానికి ఆమోదం తెలిపింది. వివిధ విభాగాలు, రంగాలు, న్యాయపరమైన అంశాలతో రవాణా రంగం కోసం జాతీయ రవాణా విధానం కృషి చేస్తుంది. సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అమలు జరుగుతున్న పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్రణాళిక మరింత పటిష్టంగా అమలు జరిగేందుకు జాతీయ రవాణా విధానం సహకరిస్తుంది. రవాణా రంగ సామర్థ్యాన్ని పెంపొందించి, వివిధ విధానాల క్రమబద్ధీకరణ, మానవ వనరుల సక్రమ వినియోగం, పటిష్ట నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధి,ఉన్నత విద్యలో రవాణా అంశాన్ని ఒక చేర్చడం, సాంకేతికతలను స్వీకరించడం ద్వారా సమర్థతను పెంపొందించాలన్న లక్ష్యంతో జాతీయ రవాణా విధానానికి రూపకల్పన చేయడం జరిగింది.