Hanuman ji is a key thread of Ek Bharat Shrestha Bharat: PM

April 16th, 04:57 pm

On the occasion of Hanuman Jayanti, PM Modi unveiled a 108 feet statue of Hanuman ji in Morbi, Gujarat. The PM said that the project of establishing four such statues in the four corners of the country was a reflection of the resolve of ‘Ek Bharat Shreshtha Bharat.’

గుజరాత్ లోని మోర్బిలో 108 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి

April 16th, 11:18 am

హనుమజ్జయంతి పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్ లోని మోర్బిలో 108 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో మహామండలేశ్వరి కనకేశ్వరి దేవి మాత కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ముందుగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మోర్బిలో 108 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయడం ప్రపంచవ్యాప్తంగాగల ఆ చిరంజీవి భక్తులందరికీ ఆనందం కలిగించే సంఘటన అని ఆయన అభివర్ణించారు. ఇటీవలి కాలంలో భక్తజన సమూహాలతోపాటు ఆధ్యాత్మిక గురువుల నడుమ పలుమార్లు గడపడం తనకు ఎనలేని ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. ఈ మేరకు ఉమియా మాత, మాత అంబ, అన్నపూర్ణ ధామంలను వరుసగా దర్శించుకునే అవకాశం కూడా లభించిందని హర్షం వ్యక్తం చేశారు. తనపై ‘హరి కృప‘ ఉండటం వల్లనే ఇదంతా సాధ్యమైందని ప్రధాని పేర్కొన్నారు.

గుజరాత్‌లోని జునాగఢ్‌లోని ఉమియా మాత దేవాలయం 14వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాన మంత్రి సందేశం

April 10th, 01:01 pm

గుజరాత్‌లోని జనాదరణ, సౌమ్యత, దృఢ సంకల్పం కలిగిన ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు పుర్షోత్తమ్ రూపాలా, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులందరూ, పార్లమెంటులో నా సహచరులు, ఇతర ఎమ్మెల్యేలు, పంచాయతీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ మరియు మునిసిపాలిటీలు, ఉమాధం గతిల అధ్యక్షుడు వల్జీభాయ్ ఫల్దు, ఇతర ఆఫీస్ బేరర్లు మరియు సమాజంలోని సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులందరూ మరియు పెద్ద సంఖ్యలో హాజరైన తల్లులు మరియు సోదరీమణులు - ఈ రోజు మా ఉమియా 14వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేను ప్రత్యేక నివాళులర్పిస్తున్నాను. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు!

శ్రీరామ నవమి సందర్భంగా జునాగఢ్‌లోని గథిలవద్ద ఉమియా మాత ఆలయ 14వ సంస్థాపన దినోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి

April 10th, 01:00 pm

శ్రీరామ నవమి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని జునాగఢ్‌లోగల గథిలవద్ద ఉమియా మాత ఆలయ 14వ సంస్థాపన వేడుకల్లో వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం ద్వారా ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్‌ పటేల్‌, కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్‌ రూపాలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ముందుగా పవిత్ర శ్రీరామ నవమి, ఆలయ సంస్థాపన దినోత్సవాల నేపథ్యంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చైత్య నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్ధిధాత్రి మాత భక్తులందరి మనోభీష్టం నెరవేర్చాలని ప్రార్థించారు. అంతేకాకుండా పవిత్ర గిర్నార్‌ గడ్డకు శిరసాభివందనం ఆచరించారు.

హ‌రిద్వార్ లో ఉమియా ధామ్ ఆశ్ర‌మం ప్రారంభ సూచ‌కంగా జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా పాల్గొని స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన‌ ప్ర‌ధాన మంత్రి

October 05th, 10:01 am

హరిద్వార్ లో ఉమియా ధామ్ ఆశ్ర‌మం ప్రారంభ సూచ‌కంగా ఈ రోజు జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా పాల్గొని, స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.