కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
December 07th, 05:52 pm
పవిత్రమైన కార్యకర్ సువర్ణ మహోత్సవం సందర్భంగా, భగవాన్ స్వామి నారాయణుని పాదాలకు వినమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు హరి ప్రగత్ బ్రహ్మ స్వరూపమైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి ఈ రోజు. ఆయనకు కూడా భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్ చేస్తున్న నిర్విరామ కృషి, అంకిత భావం ద్వారానే భగవాన్ స్వామి నారాయణుడి బోధనలు, ప్రముఖ్ స్వామి మహరాజ్ తీర్మానాలు ఈ రోజు నిజరూపం దాలుస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్లు, యువత, చిన్నారులు భాగం పంచుకుంటున్న ఈ అద్బుతమైన సాంస్కృతిక కార్యక్రమం విత్తనం, చెట్టు, ఫలం అనే భావనను అందంగా సూచిస్తోంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, ఈ కార్యక్రమ ఉత్సాహాన్ని, శక్తినీ నా హృదయం అనుభూతి చెందుతోంది. ఇంత గొప్ప దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, మహనీయులైన సాధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినయంగా నమస్కరిస్తున్నాను.అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 07th, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్‌లో ఏర్పాటైన కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మొదట పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, ఆరాధనీయులైన సాధు సంతులకు, సత్సంగి కుటుంబ సభ్యులకు, ఇతర ప్రముఖులకు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ చరణాలకు శ్రీ మోదీ ప్రణామాన్ని ఆచరించారు. ఈ రోజు ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి సందర్భం కూడా అని ప్రధాని గుర్తుకు తీసుకువచ్చారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రబోధాలు, ప్రముఖ్ స్వామి మహారాజ్ సంకల్పాలు పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్ కఠోర శ్రమతో, అంకితభావం తో నెరవేరుతున్నాయని కూడా శ్రీ మోదీ అన్నారు. సుమారు ఒక లక్షమంది కార్యకర్తలతోపాటు యువతీయువకులు, బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇదెంత భారీ కార్యక్రమమో చెప్పకనే చెబుతోందని, దీనిని చూడడం తనకు సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు. తాను సభాస్థలిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఈ కార్యక్రమంలో ఉత్సాహాతిరేకం ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందీ తనకు తెలుస్తూనే ఉందన్నారు. పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, సాధువులందరికీ ఈ భవ్య దివ్య కార్యక్రమానికిగాను ఆయన తన అభినందనలను అందజేశారు.రష్యా అధ్యక్షునితో ద్వైపాక్షిక సమావేశం లో ప్రధానమంత్రి తొలి పలుకులు (అక్టోబర్ 22, 2024)
October 22nd, 07:39 pm
మీ స్నేహం, సాదర స్వాగతం, ఆతిథ్యం అందించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం అందమైన కజాన్ నగరాన్ని సందర్శించినందుకు సంతోషిస్తున్నాను. ఈ నగరంతో భారతదేశానికి చారిత్రక సంబంధాలు ఉన్నాయి. కజాన్ నగరంలో నూతన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ఆ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.ఉక్రెయిన్ అధ్యక్షునితో ప్రధాన మంత్రి భేటీ
September 24th, 03:57 am
న్యూయార్క్ లో ‘ది సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమం సందర్భంగా నిన్న (2024 సెప్టెంబర్ 23న) ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జిలెన్ స్కీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.ఉమ్మడి వాస్తవ పత్రం: సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణను కొనసాగించనున్న అమెరికా, ఇండియా
September 22nd, 12:00 pm
అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.అధ్యక్షుడు శ్రీ పుతిన్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 27th, 03:25 pm
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు.అధ్యక్షుడు బిడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషణ
August 26th, 10:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఇవాళ అమెరికా అధ్యక్షుడు గౌరవనీయ జోసెఫ్ ఆర్.బిడెన్ ఫోన్ ద్వారా సంభాషించారు.భారత ప్రధానమంత్రి ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా భారత్, ఉక్రెయిన్ దేశాల ఉమ్మడి ప్రకటన
August 23rd, 07:00 pm
ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఆగస్ట్ 23, 2024న భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉక్రెయిన్ దేశాన్ని సందర్శించారు. రెండు దేశాల మధ్యన 1992లో దౌత్యసంబంధాలు ఏర్పడిన తర్వాత భారతదేశ ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే మొదటిసారి.ప్రధానమంత్రి ఉక్రెయిన్ పర్యటన (2024 ఆగస్టు 23) సందర్భంగా సంతకాలు పూర్తయిన పత్రాల జాబితా
August 23rd, 06:45 pm
వ్యవసాయం, ఆహార పరిశ్రమ రంగాల్లో సహకారంపై భారత్-ఉక్రెయిన్ ఒప్పందం.ఉక్రెయిన్ అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం
August 23rd, 06:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు కీవ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్ స్కీతో సమావేశమయ్యారు. మరుసియిన్ స్కీ ప్యాలెస్ వద్ద ప్రధానమంత్రికి అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వాగతం పలికారు.ఉక్రెయిన్ లోని హిందీ భాష అభ్యసిస్తున్న విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషణ
August 23rd, 06:33 pm
కీవ్ లోని స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ స్టడీస్ లో హిందీ భాష నేర్చుకుంటున్న విద్యార్థులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంభాషించారు.ఉక్రెయిన్ కు భిష్మ్ క్యూబులను బహూకరించిన ప్రధానమంత్రి
August 23rd, 06:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉక్రెయిన్ ప్రభుత్వానికి నాలుగు భిష్మ్ (సహయోగ్ హిత, మైత్రికి భారత ఆరోగ్య కార్యక్రమం) క్యూబులను బహూకరించారు. ఈ మానవతాపూర్వకమైన సహాయం అందించినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్ స్కీ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. క్షతగాత్రులకు వేగంగా చికిత్స అందించేందుకు తద్వారా విలువైన ప్రాణాలు కాపాడేందుకు ఈ క్యూబులు ఉపయోగపడతాయి.PM Modi pays homage at Gandhi statue in Kyiv
August 23rd, 03:25 pm
Prime Minister Modi paid homage to Mahatma Gandhi in Kyiv. The PM underscored the timeless relevance of Mahatma Gandhi’s message of peace in building a harmonious society. He noted that the path shown by him offered solutions to present day global challenges.పిల్లలపై మార్టయిరాలజిస్ట్ ఎక్స్ పొజిషన్: సందర్శించిన ప్రధానమంత్రి
August 23rd, 03:24 pm
ఉక్రెయిన్లో అమరులైన బాలల స్మృతికి కీవ్ నేషనల్ హిస్టరీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన (మార్టయిరాలజిస్ట్ ఎక్స్ పొజిషన్)ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఉన్నారు.ఉక్రెయిన్‌లోని కైవ్ చేరుకున్న ప్రధాని మోదీ
August 23rd, 02:14 pm
ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లోని కైవ్ చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి.భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం (2024-2028) అమలుకు కార్యాచరణ ప్రణాళిక
August 22nd, 08:22 pm
భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక అమలు దిశగా రెండు దేశాల ప్రధానమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా ద్వైపాక్షిక సహకారం వేగం పుంజుకోవడాన్ని 2024 ఆగస్టు 22న వార్సాలో సమావేశం సందర్భంగా వారిద్దరూ గుర్తించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 2024-28 మధ్య ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన-అమలుకు ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో కింది ప్రాధాన్యాంశాల పరంగా ద్వైపాక్షిక సహకారానికి ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది:‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు’’పై భారత-పోలెండ్ సంయుక్త ప్రకటన
August 22nd, 08:21 pm
పోలెండ్ ప్రధానమంత్రి మాననీయ డోనాల్డ్ టస్క్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 21,22 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ చారిత్రక పర్యటన చోటు చేసుకుంది.పోలాండ్ అధ్యక్షునితో సమావేశమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 22nd, 08:14 pm
పోలాండ్ అధ్యక్షుడు శ్రీ ఆంద్రేవ్ సెబాస్టియన్ డూడాతో వార్సాలోని బెల్వడియర్ ప్యాలెస్ లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.పోలండ్ ప్రధానితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనల ఆంగ్ల అనువాదం
August 22nd, 03:00 pm
అందమైన వార్సా నగరంలో సాదర స్వాగతం, మర్యాదపూర్వకమైన ఆతిథ్యం అలాగే స్నేహపూర్వక మాటలు అందించిన ప్రధాన మంత్రి టస్క్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.పోలాండ్ లోని వార్సా లో భారతీయ సమాజం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 21st, 11:45 pm
ఇక్కడి దృశ్యం నిజంగా అద్భుతం... మీ ఉత్సాహం కూడా అమోఘం. నేను ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి, మీరు అలసిపోలేదు. మీరందరూ పోలాండ్‌లోని వివిధ భాషలు, మాండలికాలు, వివిధ ఆహారపు అలవాట్లున్న ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ భారతీయతే మిమ్మల్ని ఒకటిగా కలిపింది. మీరు ఇక్కడ నాకు స్వాగతం పలికారు... మీరు చూపిన ఈ ఆదరణకు మీ అందరికీ, ముఖ్యంగా పోలాండ్ ప్రజలకు చాలా కృతజ్ఞతలు.