Prime Minister Narendra Modi meets with Prime Minister of Lao PDR

October 11th, 12:32 pm

Prime Minister Narendra Modi held bilateral talks with Prime Minister of Lao PDR H.E. Mr. Sonexay Siphandone in Vientiane. They discussed various areas of bilateral cooperation such as development partnership, capacity building, disaster management, renewable energy, heritage restoration, economic ties, defence collaboration, and people-to-people ties.

ఆంగ్ల అనువాదం: లావో‌స్‌లోని వియాంటియాన్‌లో జరుగుతోన్న 19వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

October 11th, 08:15 am

ఆసియాన్ ఐక్యత కోసం, ప్రాంతీయంగా అది ప్రధాన శక్తిగా ఎదిగేందుకు భారత్ నిరంతరం మద్దతిస్తోంది. భారత్ ఇండో-పసిఫిక్ దార్శనికత, క్వాడ్ సహకారానికి ఆసియాన్ కీలకం. భారత్ తీసుకున్న ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం, ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథం మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాంతంలో శాంతి నెలకొనడంతోపాటు అభివృద్ధి జరగడానికి స్వేచ్ఛ, అరమరికలులేని, సమ్మిళిత, అభ్యున్నతి దిశగా- పద్ధతితో కూడిన ఇండో-పసిఫిక్ కార్యక్రమాలు ఉండాలి.

19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్న ప్రధాన మంత్రి

October 11th, 08:10 am

ఇండో-పసిఫిక్ ప్రాంతీయ రాజకీయ నిర్మాణంలోనూ, భారతదేశపు ఇండో-పసిఫిక్ దార్శనికత, క్వాడ్ సహకారంలో- ఆసియాన్ పాత్ర చాలా కీలకమని ప్రధానమంత్రి తన ప్రసంగంలో వివరించారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో భారతదేశం పాల్గొనడం తన తూర్పు దేశాల ప్రాధాన్యత (యాక్ట్ ఈస్ట్)లో ముఖ్యమైన విధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతికీ, అభివృద్ధికీ- స్వేచ్చ, సమ్మిళిత, సుసంపన్నమైన, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్ ముఖ్యమని చెబుతూ భారతదేశ ఇండో-పసిఫిక్ మహాసముద్ర కార్యక్రమం, ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథం మధ్య సారూప్యత, సాధారణ విధానం గురించీ మాట్లాడారు. ఈ ప్రాంతం విస్తరణ వాదంపై దృష్టి సారించడం కంటే అభివృద్ధి ఆధారిత విధానాన్ని అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు.