సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

December 15th, 09:32 am

ఈ రోజు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రతతో పాటు అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని సాధించేందుకు శ్రీ పటేల్ వ్యక్తిత్వం, ఆయన కృషి ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

దిగ్గజ నటుడు రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని

December 14th, 11:17 am

దిగ్గజ నటుడు శ్రీ రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. ఆయన దూరదృష్టి గల సినీ రూపకర్త, నటుడు, వెండితెర సార్వభౌముడనీ ప్రధాని కొనియాడారు. శ్రీ రాజ్ కపూర్ చిత్ర దర్శకుడు మాత్రమే కాదని భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సాంస్కృతిక రాయబారిగా వర్ణిస్తూ, అనేక తరాలపాటు సినిమా దర్శకులు, నటులు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని శ్రీ మోదీ అన్నారు.

పార్లమెంటుపై 2001లో దాడి సందర్భంగా అమరులైన వారికి ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

December 13th, 10:21 am

పార్లమెంటుపై 2001లో దాడి జరగగా ఆ దాడిని అడ్డుకొనే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వీరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు.

శ్రీ గురు తేగ్ బహదూర్ బలిదాన దినం సందర్భంగా ఆయనకు ప్రణామాలర్పించిన ప్రధానమంత్రి

December 06th, 08:07 pm

శ్రీ గురు తేగ్ బహదూర్ బలిదాన దినాన్ని సంస్మరిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక గురువుకు నివాళులర్పించారు. న్యాయం, సమానత్వం, మానవాళి సంక్షేమం కోసం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి ప్రాణ త్యాగం చేసిన గురు తేగ్ బహదూర్ త్యాగాన్ని ఈ సందర్భంగా ప్రధాని స్మరించుకున్నారు.

దేశ తొలి రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు

December 03rd, 08:59 am

భారతదేశ తొలి రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జీ జయంతి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక బలమైన పునాదిని వేయడంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందించిన అమూల్య తోడ్పాటును ప్రధాని ప్రశంసించారు.

ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద ప్రధాని నివాళి

November 22nd, 03:09 am

గయానా లోని జార్జ్ టౌన్ లో ఉన్న ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గయానాలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో వారి కృషి, పాత్ర ప్రశంసనీయమని శ్రీ మోదీ కొనియాడారు. స్వామి దయానంద సరస్వతి 200వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది చాలా ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు.

భారత ఆగమన స్మృతి చిహ్నాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

November 21st, 10:00 pm

జార్జ్ టౌన్ లోని స్మారకోద్యానవనంలో భారత ఆగమన స్మృతిచిహ్నాన్ని ప్రధానమంత్రి సందర్శించారు. ఆయన వెంట గయానా ప్రధానమంత్రి బ్రిగేడియర్ (విశ్రాంత) మార్క్ ఫిలిప్స్ ఉన్నారు. అక్కడ పూలమాలలు వేసి నివాళి అర్పించిన ప్రధానమంత్రికి టస్సా డోలు బృందం స్వాగతం పలికింది. స్మృతిచిహ్నం వద్ద నివాళి అర్పించిన ప్రధానమంత్రి.. గయానాలోని భారత సంతతికి చెందిన వారి పోరాటాన్నీ, త్యాగాలనూ.. గయానాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడంలో వారి విశేష కృషినీ గుర్తుచేసుకున్నారు. స్మృతిచిహ్నం వద్ద ఆయన బేల్ పత్ర మొక్క నాటారు.

శ్రీ బాలాసాహెబ్ థాకరే వర్ధంతి సందర్బంగా ప్రధానమంత్రి నివాళులు

November 17th, 01:22 pm

శ్రీ బాలాసాహెబ్ థాకరే జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ థాకరే జీ ఒక దార్శనికుడు, మహారాష్ట్ర అభివృద్ధి ని సాధించాలి అనే ఆశయ సాధనకు, మరాఠీ ప్రజానీకానికి సాధికారితను కల్పించడానికి ఆయన కృషి చేశారు అని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి గిరిజన గౌరవ దినోత్సవంగా... భగవాన్ బిర్సా ముండా జయంతి

November 15th, 08:41 am

భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని దేశ ప్రజలు గిరిజన గౌరవ దినోత్సవంగా కూడా జరుపుకొంటున్నారు. మాతృభూమి అభిమానాన్నీ, గౌరవాన్నీ పరిరక్షించడానికి భగవాన్ బిర్సా ముండా జీ సర్వస్వాన్నీ త్యాగం చేశారని ప్రధాని అన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి

October 31st, 07:33 am

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వ పరిరక్షణపై ఆయన అంకితభావాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.

శ్రీ పసుంపోన్ ముత్తురామలింగ దేవర్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు

October 30th, 03:38 pm

శ్రీ పసుంపోన్ ముత్తురామలింగ దేవర్ గురుపూజ వేడుక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు.

గిరిజన నేత శ్రీ కార్తిక్ ఉరావ్ శత జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

October 29th, 09:16 am

ఈ రోజు గిరిజన నేత శ్రీ కార్తిక్ ఉరావ్ శత జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. గిరిజన సమూహాల హక్కులు, వారి ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నేత శ్రీ ఉరావ్ అని ప్రధాని కొనియాడారు. గిరిజనుల ప్రతినిధిగా వారి సంస్కృతి, గుర్తింపును రక్షించేందుకు ఎనలేని కృషి చేశారని తెలిపారు.

పోలీసు సంస్మరణ దినం సందర్భంగా అమర వీరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి

October 21st, 12:58 pm

పోలీసు సంస్మరణ దినం సందర్భంగా ఈ రోజు పోలీసు అమర వీరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

October 15th, 10:21 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.

రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

October 12th, 08:45 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. రాజమాత విజయరాజే సింధియా జీవితాంతం అంకితభావంతో దేశ సేవ చేశారని మోదీ కొనియాడారు.

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నివాళి

October 11th, 08:50 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. దేశానికి, సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. జేపీ నారాయణ్ వ్యక్తిత్వం, ఆదర్శాలు ప్రతి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని మోదీ అన్నారు.

భారతరత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నివాళి

October 11th, 08:47 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారత రత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. దేశంలోని గ్రామీణ ప్రజల సాధికారత విషయంలో ఆయన అంకితభావం, సేవలను మోదీ స్మరించుకొని ప్రశంసించారు.

సంత్ శ్రీ రామ్ రావ్ బాపు మహారాజ్‌కు ప్రధాన మంత్రి నివాళులు

October 05th, 02:51 pm

సంత్ శ్రీ రామ్ రావ్ బాపు మ‌హారాజ్ స‌మాధి వ‌ద్ద ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. మానవుల బాధలను తొలగించి కరుణామయ సమాజాన్ని నిర్మించేందుకు సంత్ శ్రీ రామ్ రావ్ బాపు ఎల్లప్పుడూ కృషి చేశారని అన్నారు.

సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్‌కు ప్రధాన మంత్రి నివాళులు

October 05th, 02:41 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. సంఘ సంస్కరణకు, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి ఆయన దిక్సూచి అని మోదీ కొనియాడారు.

మహారాష్ట్రలోని వాషిమ్‌లో వ్యవసాయ, పశుసంవర్ధక రంగ కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం

October 05th, 12:05 pm

మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్ గారు.. ప్రముఖ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గారు.. కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాజీవ్ రంజన్ సింగ్.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్.. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బంజారా సామాజిక వర్గానికి చెందిన నా సోదరసోదరీమణులు, దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదర సోదరీమణులు.. ఇతర గౌరవనీయులైన ప్రముఖులు, మహారాష్ట్ర సోదర సోదరీమణులారా.. ఈ పవిత్ర భూమి వాషిం నుంచి పోహ్రాదేవికి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. నవరాత్రుల సందర్భంగా ఈ రోజు జగదాంబ అమ్మవారి ఆశీస్సులు పొందే భాగ్యం కలిగింది. సంత్ సేవాలాల్ మహరాజ్, సంత్ రాంరావ్ మహారాజ్ సమాధిని సందర్శించి వారి ఆశీస్సులు తీసుకున్నాను. ఈ వేదిక మీద నుంచి ఈ ఇద్దరు మహానుభావులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాను.