రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర‌్భంగా తీర్మానాలు

December 05th, 05:53 pm

ఒక దేశ పౌరులు మరొక దేశ భూభాగానికి తాత్కాలిక కార్మిక కార్యకలాపాలకు సంబంధించి భారత ప్రభుత్వం, రష్యా ఫెడరేషన్

భారత్ - రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనంతర సంయుక్త ప్రకటన

December 05th, 05:43 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ 23వ భారత-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు 2025 డిసెంబర్ నాలుగు, ఐదు తేదీలలో భారత్ లో పర్యటించారు.

వారణాసిలో నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

November 08th, 08:39 am

పరిపాలన దక్షుడైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు.. కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు, వికసిత భారత నిర్మాణానికి గట్టి పునాదులు వేస్తున్న అద్భుత సాంకేతిక ప్రగతికి సారథ్యం వహిస్తున్న శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు.. టెక్నాలజీ సాయంతో ఎర్నాకులం నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతున్న కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్ గారు.. కేంద్రంలోని నా సహచరులు సురేశ్ గోపీ గారు, జార్జ్ కురియన్ గారు.. కేరళలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. కేంద్రంలో నా సహచరుడు, పంజాబ్ నాయకుడు, ఫిరోజ్‌పూర్ నుంచి కార్యక్రమంలో పాల్గొంటున్న రవ్నీత్ సింగ్ బిట్టు గారు, అక్కడి ప్రజా ప్రతినిధులు.. లక్నో నుంచి పాల్గొంటున్న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ గారు.. ఇతర విశిష్ట అతిథులు.. కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులారా!

వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 08th, 08:15 am

భారతదేశ ఆధునిక రైలు మౌలిక సదుపాయాల విస్తరణలో మరో ముందడుగు పడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి ప్రముఖులందరికీ స్వాగతం పలికారు. విశ్వనాథుని పవిత్ర నగరమైన వారణాసి స్థానిక కుటుంబాలందరికీ గౌరవ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల దేవ్ దీపావళి సందర్భంగా జరిగిన అసాధారణ వేడుకలను ఆయన గుర్తు చేశారు. ఈ రోజు కూడా ఒక శుభ సందర్భమని పేర్కొన్న ఆయన.. ఈ అభివృద్ధి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

అక్టోబరు 8,9 తేదీల్లో మహారాష్ట్రలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన

October 07th, 10:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 8వ, 9వ తేదీల్లో మహారాష్ట్రలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి మధ్యాహ్నం సుమారు 3 గంటలకు నవీ ముంబయికి చేరుకొంటారు. కొత్తగా కట్టిన నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన పరిశీలిస్తారు. ఆ తరువాత, సుమారు మూడున్నర గంటల వేళకు, ప్రధానమంత్రి నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు ముంబయిలో వివిధ పథకాలను కూడా ప్రారంభించి, జాతికి అంకితమిస్తారు. ఈ సందర్భంగా జనసమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

అస్సాంలోని దరంగ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 14th, 11:30 am

భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై! అస్సాం ప్రజల ఆదరణ పొందిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, అస్సాం ప్రభుత్వంలోని అందరు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వర్షం కురుస్తూనే ఉన్నప్పటికీ మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు నమస్కారం.

అస్సాంలోని దరంగ్‌లో రూ.6,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 14th, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాంలోని దరంగ్‌లో దాదాపు రూ.6,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- అస్సాం ప్రగతి పయనంలో నేటి కార్యక్రమం చారిత్రక సందర్భమని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు దరంగ్ ప్రజలతోపాటు రాష్ట్ర పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

మిజోరాంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

September 13th, 10:30 am

అందమైన ఈ నీలి పర్వత క్షేత్రాన్ని కాపాడుతున్న సర్వోన్నతుడైన దేవుడు పతియన్‌కు నమస్కరిస్తున్నాను. నేనిక్కడ మిజోరాంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో ఉన్నాను. దురదృష్టవశాత్తు వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఐజ్వాల్‌లో మీ మధ్య లేనందుకు చింతిస్తున్నాను. కానీ ఈ మాధ్యమం నుంచి కూడా మీ ప్రేమాదరాలను నేను ఆస్వాదిస్తున్నాను.

మిజోరంలోని ఐజ్వాల్‌లో 9వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభించిన ప్రధానమంత్రి

September 13th, 10:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మిజోరంలోని ఐజ్వాల్‌లో రూ. 9000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. రైల్వేలు, రోడ్డు మార్గాలు, ఇంధనం, క్రీడలు వంటి అనేక రంగాలకు ఈ ప్రాజెక్టులు ప్రయోజనం కలిగించనున్నాయి. వీడియో అనుసంధానం ద్వారా సభికులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి.. నీలి పర్వతాలతో కూడిన అందమైన ఈ భూమిని రక్షిస్తున్న భగవాన్ పతియాన్‌కు నమస్కరించారు. తాను మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో ఉన్నానన్న ప్రధానమంత్రి.. ప్రతికూల వాతావరణం కారణంగా ఐజ్వాల్‌లో ప్రజలను కలుసుకోలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మాధ్యమం ద్వారా కూడా తాను ప్రజల ప్రేమ, ఆప్యాయతల అనుభూతిని పొందగలనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

రానున్న దశాబ్దంపై భారత్‌-జపాన్ ఉమ్మడి దృక్కోణం: ఎనిమిది లక్ష్యాలతో ప్రత్యేక వ్యూహాత్మక-ప్రపంచ భాగస్వామ్యానికి సారథ్యం

August 29th, 07:11 pm

ఇండో-పసిఫిక్ ప్రాంతంపై భార‌త్‌, జ‌పాన్‌ దేశాలది ఉమ్మ‌డి దృక్కోణం. ఈ ప్రాంతం చట్టబద్ధ పాలన సహిత స్వేచ్ఛ, సౌహార్ద‌ం, శాంతి, సౌభాగ్యాలతో ఘ‌ర్ష‌ణ ర‌హితంగా పురోగ‌మించాల‌న్న‌ది రెండు దేశాల అభిమతం. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పర సహాయకారిగా మెలగుతాయి. వనరులు, సాంకేతికత, ఉత్పత్తి వ్యయం రీత్యా పోటీతత్వంలో రెండింటికీ ప్రత్యేక బలాలున్నాయి. దీంతోపాటు సుదీర్ఘ సుహృద్భావ, చారిత్రక స్నేహబంధం ఉన్నందువల్ల ఇకపైనా జంటగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. రాబోయే దశాబ్దంలో మన దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్పులు, అవకాశాలు అందిరానున్నాయి. వీటన్నిటి సద్వినియోగం దిశగా సంయుక్త సారథ్యానికి మేం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా ప్రకటిస్తున్నాం. జాతీయ లక్ష్యాల సాధనతో్పాటు మన దేశాలను, భవిష్యత్తరం పౌరులను మునుపటికన్నా చేరువ చేయడానికి మా నాయకత్వం తోడ్పడుతుంది.

తెలంగాణ... కర్ణాటక... బీహార్... అస్సాం రాష్ట్రాల కోసం 3 మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు సహా గుజరాత్‌లోని కచ్‌లో దూర ప్రాంతాలను అనుసంధానించే ఒక రైలు మార్గానికి మంత్రిమండలి ఆమోదం

August 27th, 04:50 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి తెలంగాణ సహా దేశంలోని 5 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే 4 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.12,328 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుల వివరాలిలా ఉన్నాయి:

పశ్చిమ బెంగాల్‌... కోల్‌కతాలో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం ప్రధానమంత్రి ఇంగ్లిషు ప్రసంగానికి తెలుగు అనువాదం

August 22nd, 05:15 pm

పశ్చిమ బెంగాల్‌ గవర్నరు సీవీ ఆనంద్ బోస్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శాంతను ఠాకుర్ గారు, రవ్‌నీత్ సింగ్ గారు, సుకాంత మజుమ్దార్ గారు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి గారు, పార్లమెంటులో నా సహచరుడు షోమిక్ భట్టాచార్య గారు, ఇక్కడున్న ఇతర ప్రజాప్రతినిధులు, మహిళలు, సజ్జనులారా,

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో రూ. 5,200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి

August 22nd, 05:00 pm

పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాలో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూ. 5,200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని వేగవంతం చేసే అవకాశం తనకు మరోసారి లభించిందన్నారు. నోపారా నుంచి జై హింద్ విమానాశ్రయం వరకు కోల్‌కతా మెట్రో‌లో ప్రయాణించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ పర్యటన‌లో చాలా మంది సహచరులతో మాట్లాడానని, కోల్‌కతా ప్రజా రవాణా వ్యవస్థ ఆధునికీకరించటం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆరు వరుసల ఎలివేటెడ్ కోనా ఎక్స్‌ప్రెస్‌వేకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టులకు సంబంధించి కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఢిల్లీ పరిధిలోని యూఈఆర్-II, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి విభాగాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

August 17th, 12:45 pm

కేంద్ర కేబినెట్‌లో నా సహచరుడు నితిన్ గడ్కరీ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు అజయ్ తమ్టా గారు, హర్ష మల్హోత్రా గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ, హర్యానా ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రియమైన సోదర సోదరీమణులారా...

రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

August 17th, 12:39 pm

ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్‌... దుర్గాపూర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

July 18th, 02:35 pm

పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సి.వి. ఆనంద బోస్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు హర్దీప్ సింగ్ పురీ గారు, శాంతనూ ఠాకుర్ గారు, సుఖాంత మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, పార్లమెంటులో నా సహచరులు సౌమిక్ భట్టాచార్య గారు, జ్యోతిర్మయ్ సింగ్ మహతో గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, నా ప్రియమైన సోదర సోదరీమణులారా, నమస్కారం!

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో రూ.5,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

July 18th, 02:32 pm

పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్‌లో రూ.5,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయగా, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన దుర్గాపూర్, భారతీయ శ్రామిక శక్తికి కూడా ఒక ప్రధాన కేంద్రమని ప్రధాని అన్నారు. దేశాభివృద్ధికి ఈ నగరం అందిస్తున్న గణనీయమైన సహకారాన్ని గుర్తిస్తూ.. దాని సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఈ రోజు లభించిందన్నారు. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తాయని, గ్యాస్ ఆధారిత రవాణాను, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తాయని, ఉక్కు నగరంగా దుర్గాపూర్ గుర్తింపును పెంపొందిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ ‘‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’’ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయని, పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు తోడ్పడతాయని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో యువతకు లెక్కలేనన్ని నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని హామీ ఇచ్చారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు గాను ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రోజ్‌గార్ మేళా కింద 51,000కు పైగా నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

July 12th, 11:30 am

కేంద్ర ప్రభుత్వంలో యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే దిశగా మా చర్యలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సిఫార్సు లేదు, అవినీతి లేదు- ఈ విధానానికి మేం కట్టుబడి ఉన్నాం. నేడు 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందించాం. ఇలాంటి రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువత ఇప్పటికే భారత ప్రభుత్వంలో శాశ్వత కొలువులను పొందారు. ఈ యువత ఇప్పుడు దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోంది. నేడు మీలో చాలా మంది భారతీయ రైల్వేలలో బాధ్యతలను మొదలుపెట్టారు. కొందరు దేశ భద్రతకు రక్షకులవుతుండగా, మరికొందరు తపాలా శాఖలో నియమితులై ప్రభుత్వ సేవలను ఊరూరా చేరవేయబోతున్నారు. ‘అందరికీ ఆరోగ్యం’ మిషన్‌లో అడుగుపెట్టబోయే సైనికులు మరికొందరు. ఆర్థిక సమ్మిళిత్వాన్ని వేగవంతం చేసేలా సేవలందించేందుకు యువ నిపుణులనేకులు సిద్ధమవుతుండగా, మరికొందరు దేశ పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించబోతున్నారు. మీ విభాగాలు వేరు కావచ్చు... కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. విభాగం, పని, హోదా, ప్రాంతం ఏవైనా సరే – దేశ సేవే ఏకైక లక్ష్యం. మళ్లీమళ్లీ మనం దీన్ని మననం చేసుకోవాలి. ప్రజలే ప్రథమం: ఇదే మన మార్గదర్శక సూత్రం. దేశ ప్రజలకు సేవ చేయడానికి మీకు గొప్ప వేదిక లభించింది. జీవితంలోని ఈ ముఖ్యమైన దశలో ఇంత గొప్ప విజయాన్ని సాధించిన మీ అందరికీ అభినందనలు. కెరీర్‌లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్న మీకు నా శుభాకాంక్షలు.

రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 12th, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికి పైగా యువతకు వీడియో అనుసంధానం ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఈ యువత కొత్త బాధ్యతలు ప్రారంభించనున్నదని తెలిపారు. వివిధ విభాగాల్లో తమ సేవలను ప్రారంభిస్తున్న యువకులను ఆయన అభినందించారు. ఉద్యోగ నిర్వహణలో ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ.. పౌరులకు ప్రథమ ప్రాధాన్యం అనే సూత్ర మార్గనిర్దేశంలో దేశానికి సేవ చేయడమే వారి సమష్టి లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, ‘ఏక్ పేడ్ మాఁ కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక మొక్కల పెంపకం కార్యక్రమానికి నేతృత్వం వహించనున్న ప్రధాని

June 04th, 01:20 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, గురువారం (జూన్ 5న) ఉదయం 10.15 గంటలకు న్యూఢిల్లీ లోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో చేపట్టే మొక్కల పెంపకం కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించనున్నారు. పర్యావరణ సంరక్షణ, హరిత ప్రధాన రవాణా సదుపాయాలు .. వీటి పట్ల భారత్ నిబద్దతను ప్రధాని పునరుద్ఘాటించనున్నారు.