జనవరి 20-21 తేదీలలో తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్న ప్రధాని

January 18th, 06:59 pm

జనవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ ఆలయంలో వివిధ పండితులు కంబ రామాయణం నుండి పద్యాలను పఠించడాన్ని కూడా ప్రధాన మంత్రి వింటారు.

తమిళ నాడు లో ఒక కార్యక్రమం, అదీ యువత నడుమ జరిగిన కార్యక్రమం తో 2024 వ సంవత్సరాన్ని మొదలు పెట్టుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

January 02nd, 05:27 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నూతన సంవత్సరాన్ని తమిళ నాడు లో జరిగిన ఒక సార్వజనిక కార్యక్రమం తో, అదీ యువత మధ్య జరిగిన కార్యక్రమం తో మొదలుపెట్టుకోవడం పట్ల సంతోషం గా మరియు గర్వం గా ఉందని పేర్కొన్నారు.

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

January 02nd, 12:30 pm

తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి గారు, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ గారు, నా మంత్రివర్గ సహచరులు జ్యోతిరాదిత్య సింధియా గారు, ఈ ధరణి కుమారుడు ఎల్.మురుగన్ గారు, తమిళనాడు ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమిళనాడు లోని నా కుటుంబ సభ్యులు!

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రూ.20,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

January 02nd, 12:15 pm

రాష్ట్రంలో ఇవాళ రూ.20,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేయడంపై ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇవన్నీ తమిళనాడు ప్రగతిని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. రైలు-రోడ్డు మార్గాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇంధనం, పెట్రోలియం పైప్‌లైన్‌ల తదితర రంగాల్లో ఇవన్నీ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయని ప్రధాని తెలిపారు. ఆ మేరకు ప్రయాణ సదుపాయాలను పెంచడంతోపాటు రాష్ట్రంలో వేలాది ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తాయని వెల్లడించారు.

తిరుచిరాపల్లి భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 02nd, 11:30 am

తమిళనాడు గవర్నర్ తిరు ఆర్ఎన్ రవీజీ, తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎంకె స్టాలిన్ జీ, భారతీదాసన్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తిరు ఎం సెల్వంజీ, నా యువ మిత్రులు, ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది అందరికీ

తమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో గల భారతిదాసన్ విశ్వవిద్యాలయం యొక్క 38 వ స్నాతకోత్సవం లో ప్రసంగించిన ప్రదాన మంత్రి

January 02nd, 10:59 am

తమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో భారతిదాసన్ విశ్వవిద్యాలయం యొక్క 38 వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. విశ్వవిద్యాలయం లో ప్రతిభావంతులు అయిన విద్యార్థుల కు పురస్కారాల ను కూడా ఆయన ప్రదానం చేశారు.

తమిళనాడు.. లక్షద్వీప్ దీవులలో 2024 జనవరి 2-3 తేదీల్లో ప్రధానమంత్రి పర్యటన

December 31st, 12:56 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జనవరి 2, 3 తేదీల్లో తమిళనాడు, లక్షద్వీప్ దీవులలో పర్యటిస్తారు. ఈ మేరకు జనవరి 2వ తేదీన ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతంలో తమిళనాడులోని తిరుచిరాపల్లి చేరుకుంటారు. అక్కడ భారతిదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో నగరంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా పౌర విమానయానం, రైలు, రోడ్డు, చమురు-గ్యాస్, ఉన్నత విద్యా రంగాలకు చెందిన రూ.19,850 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు.