టుటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

September 16th, 02:00 pm

నా మంత్రివర్గ సహచరులు, సర్బానంద సోనావాల్ జీ, శాంతనూ ఠాకూర్ జీ, టుటికోరిన్ పోర్ట్ అధికారులు, ఉద్యోగులు, ఇతర ప్రముఖ అతిథులు, సోదర సోదరీమణులారా,

తమిళనాడులోని ట్యుటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 16th, 01:52 pm

టుటుకోరిన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా తన సందేశం అందించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశంగా అవ‌త‌రించే దిశ‌గా జరుగుతున్న భార‌తదేశ ప్రయాణంలో ఈ రోజు అత్యంత ముఖ్యమైనది అన్నారు. నూతనంగా ప్రారంభించుకుంటున్న టుటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్‌ను ‘భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాలలో కొత్త తార’గా అభివర్ణించారు. వి.వో చిదంబరనార్ నౌకాశ్రయ సామర్థ్యాన్ని విస్తరించడంలో దీని పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తూ, “14 మీటర్ల కంటే ఎక్కువ లోతైన డ్రాఫ్ట్, 300 మీటర్ల కంటే ఎక్కువ బెర్త్‌తో, ఈ టెర్మినల్ వి.ఓ.సి. నౌకాశ్రయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. కొత్త టెర్మినల్ పోర్టు వల్ల రవాణాపరమైన ఖర్చులు తగ్గి, భారతదేశానికి విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాని, రెండేళ్ల కిందట తన పర్యటనలో ప్రారంభించిన వి.ఓ.సి. సంబంధిత పలు ప్రాజెక్టులను గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ టెర్మినల్ ఉద్యోగుల్లో 40% మంది మహిళలు ఉండడం లింగ వైవిధ్యపరంగా ఈ ప్రాజెక్టు సాధించిన కీలక విజయంగా ప్రధాని పేర్కొన్నారు. సముద్ర రంగంలోనూ మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధికి ఇది ప్రతీకగా నిలుస్తుందన్నారు.