ఈ నెల 17న తమిళ నాడు లో చమురు మరియు వాయు రంగం లో కీలక పథకాల ను కొన్నిటిని దేశాని కి అంకితం చేయడం తో పాటు మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
February 15th, 08:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు లో చమురు మరియు వాయు రంగం లో కొన్ని కీలకమైన పథకాల ను బుధవారం నాడు, అంటే ఈ నెల 17న, సాయంత్రం 4 గంటల 30 నిముషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు మరికొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ప్రధాన మంత్రి రామనాథపురం - తూత్తుక్కుడి సహజవాయు గొట్టపు మార్గాన్ని, మణలీ లోని చెన్నై పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ కు చెందిన గ్యాసొలీన్ డీసల్ఫరైజేశన్ యూనిటు ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. నాగపట్టినమ్ లో ఏర్పాటు కానున్న కావేరీ బేసిన్ రిఫైనరీ కి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ పథకాలతో చెప్పుకోదగ్గ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు అందడమే కాకుండా దేశం ఊర్జా ఆత్మనిర్భరత దిశ లో పయనించే అవకాశాలు కూడా పెంపొందుతాయి. ఈ సందర్బం లో తమిళ నాడు గవర్నరు, తమిళ నాడు ముఖ్యమంత్రి లతో పాటు పెట్రోలియమ్, సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి కూడా పాల్గొంటారు.వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అనేక పథకాల శంకుస్థాపన సందర్భంగా చెన్నైలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం పూర్తి పాఠం
February 14th, 11:31 am
తమిళనాడు రాష్టంలో చేపట్టే పలు కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు ఆయనశంకుస్థాపన చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో,. ఎం.కె.-1ఎ పేరిట రూపొందించిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకును ఆయనసైన్యానికి అప్పగించారు.తమిళనాడులో పలు ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన
February 14th, 11:30 am
తమిళనాడు రాష్టంలో చేపట్టే పలు కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు ఆయనశంకుస్థాపన చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో,. ఎం.కె.-1ఎ పేరిట రూపొందించిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకును ఆయనసైన్యానికి అప్పగించారు.ఈ నెల 14న తమిళ నాడు ను, కేరళ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
February 12th, 06:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 14న తమిళ నాడు, కేరళ రాష్ట్రాల ను సందర్శించనున్నారు. పగటి పూట 11 గంటల 15 నిముషాల కు చెన్నై లో ప్రధాన మంత్రి అనేక కీలకమైన ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం/శంకు స్థాపన చేస్తారు. అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకు (ఎమ్‌కె-1ఎ)ని సైన్యాని కి అప్పగిస్తారు. సాయంత్రం 3 గంటల 30 నిముషాల కు కొచ్చి లో వివిధ ప్రాజెక్టుల ను దేశానికి అంకితం చేయడంతో పాటు, కొన్ని పథకాల కు శంకు స్థాపన కూడా చేస్తారు. ఈ ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల వృద్ధి గతికి కీలకమైన వేగాన్ని జత పరచడమే కాకుండా, పూర్తి స్థాయి అభివృద్ధి సామర్ధ్యాన్ని సంతరించుకోవడానికి తోడ్పడుతాయి.