తిరు ఢిల్లీ గణేశ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

November 10th, 05:48 pm

చలనచిత్ర రంగంలో ప్రముఖ నటుడు తిరు ఢిల్లీ గణేశ్ ఈ రోజు మరణించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తిరు ఢిల్లీ గణేశ్ లో గొప్ప నటనా పాటవం మూర్తీభవించిందని, ఆయన తాను పోషించిన ప్రతి పాత్రకు జతపరిచిన ప్రజ్ఞ‌కు, భిన్న తరాల ప్రేక్షకుల మనస్సులను చూరగొన్న సామర్థ్యానికి గాను ప్రేక్షకలోకం ఆయనను ఆప్యాయంగా స్మరించుకొంటుందని శ్రీ మోదీ అన్నారు.