In the development of digital technology, India is behind no developed nation: PM Modi
October 27th, 10:56 am
PM Modi inaugurated the 7th Edition of the India Mobile Congress 2023 at Bharat Mandapam in New Delhi. Addressing the gathering, the PM Modi said that in the changing times of the 21st century, this event has the power to change the lives of crores of people. Underling the fast pace of technology, the PM Modi said “The future is here and now”.ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) యొక్క ఏడో సంచికను ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 27th, 10:35 am
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 యొక్క ఏడో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రారంభించారు. ‘గ్లోబల్ డిజిటల్ ఇనొవేశన్’ అంశం ఇతివృత్తం గా 2023 అక్టోరు 27 వ తేదీ మొదలుకొని 29 వ తేదీ వరకు కొనసాగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) ఆసియా లో అతి పెద్ద టెలికం, మీడియా, మరియు టెక్నాలజీ ల వేదిక గా ఉందని చెప్పాలి. కీలకమైన అత్యాధునిక సాంకేతికతల ను అభివృద్ధి పరచే, తయారు చేసే మరియు ఎగుమతి చేసే దేశం గా భారతదేశం యొక్క స్థితి ని బలపరచడం ఐఎమ్ సి 2023 యొక్క లక్ష్యం గా ఉంది. ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ‘5జి యూస్ కేస్ లేబ్స్’ ను దేశవ్యాప్తం గా వంద అనేక విద్య సంస్థల కు ప్రదానం చేశారు.The double-engine government gives priority to the underprivileged: PM Modi in Madhya Pradesh
October 05th, 03:31 pm
PM Modi laid the foundation stone of various development projects in sectors like road, rail, gas pipeline, housing and clean drinking water worth more than Rs 12,600 crore in Jabalpur, Madhya Pradesh and dedicated it to the nation. Addressing the event, he said, With the advent of new industries in the region, the youth will now find jobs here.మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో రూ.12,600 కోట్ల విలువ గల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, అంకితం చేసిన ప్రధానమంత్రి
October 05th, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో రూ.12,600 కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్డు, రైలు, గ్యాస్ పైప్ లైన్, గృహనిర్మాణ, స్వచ్ఛ మంచినీటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి కొన్నింటిని ప్రారంభించారు. రాణి దుర్గావతి 500వ జయంతి సందర్భంగా జబల్ పూర్ లో నిర్మిస్తున్న ‘‘వీరాంగన రాణి దుర్గావతి స్మారక్ ఔర్ ఉద్యాన్’’ ప్రాజెక్టుకు శ్రీ మోదీ భూమిపూజ చేశారు. శ్రీ మోదీ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో లైట్ హౌస్ ప్రాజెక్టు కింద ఇండోర్ లో నిర్మించిన 1000 ఇళ్లు కూడా ఉన్నాయి. మాండ్లా, జబల్ పూర్, దిండోరి జిల్లాల్లో అనేక జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సియోని జిల్లాలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. మధ్యప్రదేశ్ లో రూ.4800 కోట్ల పైబడిన వ్యయంతో చేపడుతున్న పలు రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.1850 కోట్ల పైబడిన వ్యయంతో నిర్మించిన రైలు ప్రాజెక్టులను, విజయ్ పూర్-ఔరియాన్-ఫూల్పూర్ పైప్ లైన్ ప్రాజెక్టును, జబల్ పూర్ లో కొత్త బాట్లింగ్ ప్లాంట్ ను జాతికి అంకితం చేశారు. ముంబై-నాగపూర్-ఝార్సుగుడా పైప్ లైన్ ప్రాజెక్టులో నాగపూర-జబల్ పూర్ సెక్షన్ కు (317 కిలోమీటర్లు) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను కూడా తిలకించి వీరాంగన రాణి దుర్గావతికి పుష్పాంజలి ఘటించారు.Sengol links us with a very important part of our past: PM Modi
September 19th, 01:50 pm
PM Modi addressed the Lok Sabha in the new building of the Parliament. Highlighting the importance of the occasion, the Prime Minister remarked that it is the dawn of the Amrit Kaal as India is moving forward with a resolve for the future by heading into the new Parliament edifice.నూతన పార్లమెంటు భవనంలో లోక్‌సభ నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ.
September 19th, 01:18 pm
ఈ రోజుకు గల ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇది అమృత్ కాల్‌కు ఉషోదయమని అన్నారు. ఇండియా నూతన పార్లమెంటు మహాభవనంలోకి అడుగుపెడుతూ ఉజ్వల భవిష్యత్‌కు సంకల్పం చెప్పుకుంటున్నదని అన్నారు. ఇటీవల ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, శాస్త్ర విజ్ఞాన రంగంలో చంద్రయాన్ 3 విజయం గురించి ప్రస్తావించారు. జి 20 సమావేశాలు విజయవంతంగా నిర్వహించడం గురించి, అంతర్జాతీయంగా దాని ప్రభావం గురించి తెలియజేశారు. ఈ నేపథ్యంలో దేశ నూతన పార్లమెంటు భవనం లో కార్యకలాపాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయన్నారు. గణేశ్ చతుర్థి పర్వదినం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, గణేశుడు జ్ఞానానికి,సహేతుకతకు, పవిత్రతకు, సుసంపన్నతకు అధిదేవత అని ఆయన అన్నారు.Central Hall of Parliament inspires us to fulfill our duties: PM Modi
September 19th, 11:50 am
PM Modi addressed the Members of Parliament in the Central Hall during the Special Session. Speaking about the Parliament Building and the Central Hall, PM Modi dwelled on its inspiring history. He recalled that in the initial years this part of the building was used as a kind of library. He remembered that this was the place where the Constitution took shape and transfer of power took place at the time of Independence.పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: సంయుక్త సభా మందిరంలో ఎంపీలనుద్దేశించి ప్రధాని ప్రసంగం
September 19th, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సంయుక్త సభా మందిరంలో ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. గణేష్ చతుర్థి నేపథ్యంలో మొదట సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సౌధంలో సభా కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ “దేశాన్ని వికసిత భారతంగా మార్చాలనే సంకల్పం, దృఢదీక్షతో మనం కొత్త పార్లమెంటు భవనానికి వెళ్తున్నాం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.యశోభూమిని జాతికి అంకితం చేసి, పిఎం విశ్వకర్మ పథకం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 17th, 06:08 pm
నేడు భగవాన్ విశ్వకర్మ జయంతి మహోత్సవం. మన సాంప్రదాయిక కళాకారులు, హస్తకళాకారులకు ఈ రోజు అంకితం. విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వకర్మ మిత్రులతో కూడా ఈ సందర్భంగా అనుసంధానం అయ్యే అవకాశం నాకు కలిగింది. కొద్ది సమయం క్రితమే నేను విశ్వకర్మ సోదరసోదరీమణులతో నేను సంభాషించాను. వారితో సంభాషిస్తూ ఉండడం వల్లనే నేను ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాను. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన చాలా అద్భుతమైనది, అది వదిలి వెళ్లాలని నేను భావించలేకపోయాను. దాన్ని సందర్శించాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈ ప్రదర్శన మరో రెండు మూడు రోజులుంటుందని నాకు చెప్పారు. ప్రదర్శనను సందర్శించాలని నేను ఢిల్లీ ప్రజలను కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను.న్యూఢిల్లీలో భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి
September 17th, 12:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ‘భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం’ (ఐసిఇసి) ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అద్భుతమైన సదస్సుల వేదిక, బహుళ ప్రదర్శనశాలలు, ఇతర అధునాతన సౌకర్యాలున్నాయి. మరోవైపు విశ్వకర్మ జయంతి సందర్భంగా సంప్రదాయ వృత్తి నిపుణులు, హస్తకళాకారుల కోసం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ కూడా ప్రధాని చేతులమీదుగా ప్రారంభమైంది. అలాగే ‘పీఎం విశ్వకర్మ’ లోగో, నినాదం, పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంపుల ఫలకం, ఉపకరణసమూహ కరదీపికలతోపాటు వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 18 మంది లబ్ధిదారులకు విశ్వకర్మ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.మధ్యప్రదేశ్ రోజ్‌గార్ మేళా సందర్భంగా ప్రధానమంత్రి వీడియో సందేశానికి - తెలుగు అనువాదం
August 21st, 12:15 pm
ఈ చారిత్రక సమయంలో, ఈ కీలకమైన బోధనా బాధ్యత తో ఈరోజు మీరందరూ మిమ్మల్ని మీరు కలుపుకుంటున్నారు. ఈ సంవత్సరం, నేను ఎర్రకోట బురుజుల నుండి ప్రసంగిస్తూ, దేశ అభివృద్ధిలో జాతీయత అనేది ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో వివరంగా చెప్పాను. భావి భారత తరాన్ని తీర్చిదిద్దడం, వారిని ఆధునికతగా తీర్చిదిద్దడం, కొత్త దిశానిర్దేశం చేయడం మీ అందరి బాధ్యత. మధ్యప్రదేశ్ లోని ప్రాథమిక పాఠశాలల్లో నియమితులైన 5,500 మందికి పైగా ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత మూడేళ్లలో మధ్యప్రదేశ్ లో దాదాపు 50 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు అధికారులు తెలియజేశారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాను.మధ్య ప్రదేశ్ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 21st, 11:50 am
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు న నియామక లేఖ లను అందుకొంటున్న వ్యక్తులు ఈ చరిత్రాత్మకమైనటువంటి కాలం లో విద్య బోధన తాలూకు ముఖ్యమైన కర్తవ్య పాలన లో అడుగిడుతున్నారని పేర్కొన్నారు. దేశాభివృద్ధి లో జాతీయ గుణగణాల పాత్ర కీలకం అని వివరిస్తూ, ఎర్ర కోట నుండి తాను ఇచ్చిన ఉపన్యాసం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి ఈ రోజు న ఉద్యోగాల ను అందుకొంటున్న వారంతా భారతదేశం యొక్క భావి తరాల ను తీర్చిదిద్దేటటువంటి, వారిని ఆధునికులు గా తీర్చిదిద్దేటటువంటి మరియు వారి కి ఒక క్రొత్త దిశ ను ఇచ్చేటటువంటి బాధ్యత ను స్వీకరిస్తున్నారు అని స్పష్టం చేశారు. రోజ్ గార్ మేళా లో భాగం గా ఈ రోజు న మధ్య ప్రదేశ్ లో ప్రాథమిక పాఠశాల ల ఉపాధ్యాయులు గా నియమితులైన అయిదున్నర వేల మంది కి పైగా అభ్యర్థుల కు ఆయన తన శుభాకాంక్షల ను తెలియ జేశారు. గడచిన మూడు సంవత్సరాల లో మధ్య ప్రదేశ్ లో సుమారు ఏభై వేల మంది గురువుల ను నియమించడమైందని కూడా ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, ఈ కార్యాని కి గాను రాష్ట్ర ప్రభుత్వాని కి అభినందనల ను వ్యక్తం చేశారు.ఈ సంక్షోభ సమయాన వేగుచుక్కలా ప్రకాశిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ: ప్రధానమంత్రి
August 19th, 06:42 pm
భారతదేశంపై ప్రపంచం ఆశావహ భావనకుగల కారణాలను వివరించే కథనాలు, సమాచార చిత్రాలను మనీ కంట్రోల్ వెబ్‌సైట్ సేకరించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని, స్థితిస్థాపక స్ఫూర్తిని ఈ కథనాలు, సమాచార చిత్రాలు చాటి చెబుతున్నాయని ఆయన పునరుద్ఘాటించారు.77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 02:14 pm
నా ప్రియమైన 140 కోట్ల కుటుంబ సభ్యులు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇప్పుడు జనాభా దృష్ట్యా కూడా మనదే మొదటి స్థానం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంత పెద్ద దేశం, 140 కోట్ల మంది దేశప్రజలు, నా సోదరసోదరీమణులు, నా కుటుంబ సభ్యులు ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నారు. భారతదేశాన్ని ప్రేమించే, భారతదేశాన్ని గౌరవించే, భారతదేశం గురించి గర్వించే దేశంలోని, ప్రపంచంలోని కోట్లాది మందికి నేను ఈ గొప్ప పవిత్ర స్వాతంత్ర్య పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.India Celebrates 77th Independence Day
August 15th, 09:46 am
On the occasion of India's 77th year of Independence, PM Modi addressed the nation from the Red Fort. He highlighted India's rich historical and cultural significance and projected India's endeavour to march towards the AmritKaal. He also spoke on India's rise in world affairs and how India's economic resurgence has served as a pole of overall global stability and resilient supply chains. PM Modi elaborated on the robust reforms and initiatives that have been undertaken over the past 9 years to promote India's stature in the world.77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
August 15th, 07:00 am
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇప్పుడు జనాభా పరంగా కూడా మనమే ప్రపంచంలో మొదటి స్థానం లో ఉన్నామని చాలా మంది అభిప్రాయం. ఇంత విశాల దేశం, 140 కోట్ల ప్రజల దేశం, నా సోదర సోదరీమణులు, నా కుటుంబ సభ్యులు ఈ రోజు స్వాతంత్ర్య పండుగను జరుపుకుంటున్నారు. దేశంలోని కోట్లాది ప్రజలకు, భారతదేశాన్ని ప్రేమించే, భారతదేశాన్ని గౌరవించే, భారతదేశం గర్వపడేలా చేసే ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలకు ఈ గొప్ప పవిత్రమైన స్వాతంత్ర్య పండుగ సందర్భంగా నేను అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.21st century is about fulfilling every Indian's aspirations: PM Modi in Lok Sabha
August 10th, 04:30 pm
PM Modi replied to the Motion of No Confidence in Lok Sabha. PM Modi said that it would have been better if the opposition had participated with due seriousness since the beginning of the session. He mentioned that important legislations were passed in the past few days and they should have been discussed by the opposition who gave preference to politics over these key legislations.PM Modi's reply to the no confidence motion in Parliament
August 10th, 04:00 pm
PM Modi replied to the Motion of No Confidence in Lok Sabha. PM Modi said that it would have been better if the opposition had participated with due seriousness since the beginning of the session. He mentioned that important legislations were passed in the past few days and they should have been discussed by the opposition who gave preference to politics over these key legislations.Lokmanya Tilak was a great institution builder and a nurturer of traditions: PM Modi
August 01st, 12:00 pm
PM Modi was conferred the Lokmanya Tilak National Award in Pune. PM Modi described the honour bestowed on him by the place and institution directly linked with the Lokmanya as ‘unforgettable’. He dedicated the Lokmanya Tilak Award to the 140 crore citizens of India. He assured them that the government will leave no stone unturned to help them achieve their dreams and aspirations. The Prime Minister also donated the cash prize to the Namami Gange Project.మహారాష్ట్ర లోని పుణె లో లోక్ మాన్య తిలక్ జాతీయపురస్కారాన్ని ప్రధాన మంత్రి కి ఇవ్వడమైంది
August 01st, 11:45 am
ప్రధాన మంత్రి కార్యక్రమ స్థలాని కి చేరుకొని లోక్ మాన్య తిలక్ గారి ప్రతిమ కు పుష్పాంజలి ని సమర్పించారు. సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, లోక్ మాన్య తిలక్ గారి వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ఘటించారు. ఈ రోజు తనకు ఒక విశిష్ఠమైనటువంటి రోజు అని ఆయన అన్నారు. ఈ సందర్భం లో తన లో కలిగిన అనుభూతుల ను ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, ఈ దినం లోక్ మాన్య తిలక్ గారి వర్ధంతి, ఈ రోజు న అన్నాభావూ సాఠే జయంతి కూడా అని పేర్కొన్నారు. ‘‘లోక్ మాన్య తిలక్ గారు భారతదేశం యొక్క స్వాతంత్య్ర పోరాటం లో ‘నుదుటి తిలకం’ గా నిలచారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సమాజం యొక్క సంస్కరణ దిశ లో అన్నాభావూ సాఠే గారు అందించిన తోడ్పాటు అసాధారణమైంది, సాటి లేనటువంటిది అని కూడా ఆయన నొక్కి పలికారు. ఛత్రపతి శివాజి గారు, చాఫేకర్ సోదరులు, జ్యోతిబా ఫులే గారు మరియు సావిత్రిబాయి ఫులే గారు లకు జన్మ ను ఇచ్చిన ఈ పవిత్రమైనటువంటి గడ్డ కు ప్రధాన మంత్రి వందనాన్ని ఆచరించారు. అంతక్రితం ప్రధాన మంత్రి దగ్ డూ శేఠ్ ఆలయాన్ని దర్శించి దైవాన్ని దీవెన లు కోరారు.