మన్ కి బాత్, డిసెంబర్ 2023

December 31st, 11:30 am

మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని వినేటటువంటి వారు అనేకులు నాకు లేఖల ను వ్రాసి వారి యొక్క స్మరణీయమైనటువంటి క్షణాల ను గురించి నాకు తెలియజేశారు. ఈ సంవత్సరం లో, మన దేశం అనేక ప్రత్యేకమైనటువంటి సాఫల్యాల ను సాధించడం 140 కోట్ల మంది భారతీయుల బలం అని చెప్పాలి. ఏళ్ల తరబడి ఎదురుచూసిన ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఆమోదం పొందింది ఈ సంవత్సరం లోనే. భారతదేశం 5 వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ఉత్తరాల ను వ్రాశారు. జి- 20 శిఖర సమ్మేళనం సఫలం అయిన విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. సహచరులారా, ఈ రోజు న భారతదేశం మూలమూలన ఆత్మవిశ్వాసం తో నిండిపోయి ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క స్ఫూర్తి తో, స్వావలంబన భావన తో నిండి ఉంది. అదే స్ఫూర్తి ని, ఊపును 2024 లో కూడాను మనం కొనసాగించాలి. దీపావళి రోజు న రికార్డు స్థాయి లో జరిగినటువంటి వ్యాపార లావాదేవీ లు భారతదేశం లో ప్రతి ఒక్కరు ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానికం గా తయారైన ఉత్పాదనల నే ఆదరించాలి) అనే మంత్రాని కి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు అని నిరూపించాయి.

బందీపూర్‌.. ముదుమలై పులుల అభయారణ్యాలను సందర్శించిన ప్రధాని

April 09th, 02:48 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ క‌ర్ణాట‌క, తమిళనాడు రాష్ట్రాల పరిధిలోని బందీపూర్, ముదుమ‌లై పులుల అభయారణ్యాలను సంద‌ర్శించారు. అలాగే ముదుమలై అభయారణ్యంలోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని కూడా ఆయన సందర్శించారు. అక్కడి మావటులు, వారి సహాయకులతో కాసేపు సంభాషించడంతోపాటు ఏనుగులకు ఆహారం అందించారు. అంతేకాకుండా ఆస్కార్ పురస్కారం గెలుచుకున్న డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్‌’లో కనిపించిన ఏనుగుల సంరక్షకులు బొమ్మన్‌, బెల్లిలతో కూడా ప్రధానమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు.

మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాల స్మారకోత్సవ ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

April 09th, 01:00 pm

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ భూపేందర్ యాదవ్ జీ, శ్రీ అశ్విని కుమార్ చౌబే జీ, ఇతర దేశాల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఇతర ప్రతినిధులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

కర్ణాటకలోని మైసూరులో టైగర్ ప్రాజెక్టు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు

April 09th, 12:37 pm

టైగర్ పోజెక్టు 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా క‌ర్ణాట‌క‌, మైసూరులోని మైసూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐ.బీ.సీ.ఏ) ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. పులుల సంరక్షణ కేంద్రాల నిర్వహణ సమర్థతపై రూపొందించిన 5వ సారాంశ నివేదిక - ‘పులుల సంరక్షణ కోసం అమృత్ కాల్ దృష్టి’ ప్రచురణలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అఖిల భారత పులుల (5వ) అంచనా సారాంశ నివేదికలో పులుల సంఖ్యను ప్రకటించారు. టైగర్‌ పాజెక్టు 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక స్మారక నాణేన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.

‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ చిత్రం అవార్డు విజేతలతో ప్రధాని భేటీ

March 30th, 03:46 pm

“అద్భుతమైన చిత్రంగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ యావత్ ప్రపంచం దృష్టినీ ఆకట్టుకొని ప్రసంశలందుకుంది. ఈ రోజు ప్రతిభావంతులైన ఆ చిత్ర నిర్మాణ బృందాన్ని కలుసుకునే అవకాశం లభించింది. వాళ్ళు భారతదేశం గర్వపడేట్టు చేశారు.”