మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన... ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 09th, 01:09 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండే, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు సహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్, ఇతర ప్రముఖులు, నా ప్రియ సోదర సోదరీమణులారా...

మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన

October 09th, 01:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈవేళ మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీరణ ప‌నుల‌కు, షిర్డీ విమానాశ్రయంలో కొత్త స‌మీకృత టెర్మినల్ భవన నిర్మణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్)-ముంబయి సహా మహారాష్ట్రలో విద్యా వ్య‌వ‌స్థ ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రానికి శ్రీ మోదీ ప్రారంభోత్స‌వం చేశారు.

మహారాష్ట్రలోని థానేలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

October 05th, 04:35 pm

మహారాష్ట్ర గవర్నరు శ్రీ సీపీ.రాధాకృష్ణన్ గారు, ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, శ్రీ అజిత్ పవార్ గారు.. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహారాష్ట్ర వాసులైన నా ప్రియమైన సోదర సోదరీమణులారా!

మహారాష్ట్ర లోని థానేలో రూ.32,800 కోట్లకు పైగా విలువ చేసే వివిధ పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 05th, 04:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్ర లోని థానేలో రూ.32,800 కోట్ల కు పైగా విలువ చేసే వివిధ పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాంతంలో పట్టణ రవాణకు ఊతం ఇచ్చే ప్రధాన దృష్టితో ఈ ప్రాజెక్టులను చేపట్టారు.

అక్టోబర్ 5 న మహారాష్ట్రలో ప్రధానమంత్రి పర్యటన

October 04th, 05:39 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం (అక్టోబర్ 5న) మహారాష్ట్రలో పర్యటిస్తారు. ఉదయం 11.15 గంటలకు వాసిమ్ చేరుకుని పోహరాదేవి జగదాంబ మాత ఆలయంలో దర్శనం చేసుకుంటారు. వాసిమ్ లోని సంత్ సేవాలాల్ మహరాజ్, సంత్ రామ్ రావ్ మహారాజ్ సమాధుల వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు బంజారా సమాజం గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పే బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యవసాయ, పశుసంవర్ధక రంగానికి సంబంధించిన సుమారు రూ.23,300 కోట్ల విలువైన పలు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు థానేలో రూ.32,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బీకేసీ మెట్రో స్టేషన్ నుంచి ముంబైలోని ఆరే జేవీఎల్ఆర్ వరకు నడిచే మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. బీకేసీ, శాంతాక్రజ్ స్టేషన్ల మధ్య మెట్రోలో శ్రీ మోదీ ప్రయాణం చేయనున్నారు.