2024 అక్టోబర్ 28, 29 తేదీల్లో స్పెయిన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా భారత్-స్పెయిన్ సంయుక్త ప్రకటన
October 28th, 06:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో శాంచెజ్ 2024 అక్టోబర్ 28, 29 తేదీల్లో భారత్ లో అధికారికంగా పర్యటించారు. అధ్యక్షుడు శాంచెజ్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. 18 ఏళ్ల తర్వాత స్పెయిన్ ప్రభుత్వ అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తున్నారు. ఆయన వెంట రవాణా, సుస్థిర రవాణా శాఖ మంత్రి, పరిశ్రమలు, పర్యాటక శాఖ మంత్రులతో పాటు ఉన్నత స్థాయి అధికార, వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.స్పెయిన్ అధ్యక్షులు శ్రీ పెడ్రో శాంచెజ్ భారత పర్యటన (అక్టోబరు 28-29) సందర్భంగా ఒప్పందాలు-కార్యక్రమాలు
October 28th, 06:30 pm
స్పెయిన్ సంస్థ ‘ఎయిర్‌బస్’ సహకారంతో ‘టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్’ సంస్థ వడోదరలో నిర్మించిన ‘సి295’ విమాన ‘ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంటు’కు సంయుక్త ప్రారంభోత్సవం.సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్ర ప్రారంభ వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం
October 28th, 10:45 am
గౌరవనీయ పెడ్రో సాంచెజ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, విదేశాంగ మంత్రి శ్రీ ఎస్. జైశంకర్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, స్పెయిన్, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎయిర్‌బస్, టాటా బృందాల సభ్యులు, సోదరసోదరీమణులారా!సీ-295 విమానాల తయారీ నిమిత్తం గుజరాత్ వడోదరలో ఏర్పాటు చేసిన టాటా వైమానిక కేంద్రాన్ని స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 28th, 10:30 am
గుజరాత్ వడోదరలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) ప్రాంగణంలో సీ-295 విమానాల తయారీ నిమిత్తం ఏర్పాటు చేసిన టాటా వైమానిక వ్యవస్థను స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో శాంచెజ్ తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రదర్శనను ఇరువురు నేతలు సందర్శించారు.ఈనెల 28న గుజరాత్‌లో పర్యటించనున్న పీఎమ్
October 26th, 03:28 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈనెల 28న గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం 10 గంటలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) క్యాంపస్ ఆవరణలో సీ-295 విమానాల తయారీ కోసం నిర్మించిన టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్పానిష్ ప్రధానమంత్రి శ్రీ పెడ్రో శాంచెజ్‌తో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం, సుమారు 11 గంటలకు, ఆయన వడోదరలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను సందర్శిస్తారు. వడోదర నుంచి సుమారు మధ్యాహ్నం 2.45 గంటలకు అమ్రేలీకి చేరుకుని దుధాలా వద్ద భారత్ మాతా సరోవర్‌ను ఆయన ప్రారంభిస్తారు. సుమారుగా 3 గంటలకు ఆయన అమ్రేలీలోని లథీ వద్ద రూ.4800ల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేస్తారు.