సుప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
December 11th, 02:00 pm
నేడు దేశం మహాకవి సుబ్రమణ్య భారతి జయంతిని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వారికి గౌరవ పూర్వక నివాళులర్పిస్తున్నాను. భారతీయ సంస్కృతీ సాహిత్యాలకి, దేశస్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలకు, తమిళుల గౌరవానికి ఇవి అపురూపమైన క్షణాలు! మహాకవి సుబ్రమణ్య భారతి రచనల ప్రచురణను అత్యున్నతస్థాయి సేవగా పరిగణిస్తున్నాను. పరిపూర్ణమైన గొప్ప ఆధ్యాత్మిక యత్నమిది. 21 సంపుటాల్లో తయారైన 'కాల వరిసైయిల్ భారతియార్ పడైప్పుగళ్' సంకలనం అసాధారణమైన, అపూర్వమైన విజయానికి ప్రతీక. ఎంతో స్థైర్యంతో చేపట్టిన ఆరు దశాబ్దాల అవిరామ కృషికి దక్కిన అద్భుత ఫలితం. అనితరసాధ్యమనిపించే ఈ సాఫల్యం శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషికీ, అంకితభావానికీ నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తు తరాలకు ఈ సంకలనం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒకే జీవితం, ఒక లక్ష్యం అన్న మాటని మనం తరచుగా వింటుంటాం కానీ శ్రీ శీని ఆ మాటను నిజం చేసి చూపారు. అపురూపమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచిన ఆయన శ్రమ, ధర్మశాస్త్ర చరిత్రను రాయడానికి 35 ఏళ్ల సమయాన్ని వెచ్చించిన మహామహోపాధ్యాయ పాండురంగ్ వామన్ కానే గారిని గుర్తుకు తెచ్చింది. శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషి విద్యారంగంలో నూతన ప్రమాణాలను పాదుకొల్పగలదని విశ్వసిస్తున్నాను. గొప్ప ఫలితాన్ని సాధించిన విశ్వనాథన్ గారికి, ఆయన బృందం సహా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.తమిళ మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 11th, 01:30 pm
తమిళ భాషా రంగంలో మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ సుబ్రహ్మణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని నంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఈరోజు ఆవిష్కరించారు. శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఆయనకు శ్రీ మోదీ నివాళులు అర్పిస్తూ, ఈరోజు భారతదేశ సంస్కృతికి, సాహిత్యానికి, మన దేశ స్వాతంత్య్ర పోరాట స్మృతులకు, అంతేకాకుండా తమిళనాడు ఆత్మగౌరవానికి కూడా లభించిన ఒక మహదవకాశమన్నారు.శ్రీ సుబ్రహ్మణ్య భారతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి
December 11th, 10:27 am
కవి, రచయిత శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.డిసెంబర్ 11న సుప్రసిద్ధ తమిళ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వాన్ని విడుదల చేయనున్న ప్రధానమంత్రి
December 10th, 05:12 pm
సుబ్రహ్మణ్య భారతి రచనలు ప్రజల్లో దేశభక్తిని జాగృతం చేసి, సాధారణ ప్రజలకు సులభంగా అర్ధమయ్య భాషలో భారతీయ సంస్కృతి వైభవాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని వారికి పరిచయం చేశాయి. శీని విశ్వనాథన్ కూర్చి, సంపాదకత్వం వహించిన 23 సంపుటాల ‘భారతి’ సాహితీ సర్వసాన్ని అలయన్స్ పబ్లిషర్స్ ప్రచురించారు. ఈ ప్రచురణలో సుబ్రహ్మణ్య భారతి రచనల గురించిన వివరణలు, పత్రాలు, నేపథ్యం, తాత్వికపరమైన విశ్లేషణలు సహా సమగ్ర వివరాలు అందుబాటులోకి వస్తాయి.A part of our vision of Vasudhaiva Kutumbakam is putting our Neighborhood First: PM Modi
October 14th, 08:15 am
Addressing the launch of ferry services between Nagapattinam, India and Kankesanthurai, Sri Lanka PM Modi said that India and Sri Lanka share a deep history of culture, commerce and civilization. Nagapattinam and towns near-by have long been known for sea trade with many countries, including Sri Lanka.ఇండియాలోని నాగపట్నం నుంచి శ్రీలంకలోనికనకేసంతురై కి ఫెర్రీ సర్వీసును ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
October 14th, 08:05 am
-ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశంలోనినాగపట్టణం నుంచి శ్రీ లంకలోని కనకేసంతురై కి ఫెర్రీ సర్వీసు ప్రారంభోత్సవకార్యక్రమంలో వీడియో సందేశమిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఇండియా,శ్రీలంకలు దౌత్య, ఆర్థిక సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడంలో , నాగపట్నం, కనకేసంతురైలమధ్య ఫెర్రీ సర్వీసు ప్రారంభం ఒక కీలకమైలురాయిగా నిలుస్తుందని అన్నారు.PM Modi and Sri Lankan President Ranil Wickremesinghe at joint press meet in Hyderabad House
July 21st, 12:13 pm
PM Modi and President Wickremesinghe held a joint Press Meet at the Hyderabad House in New Delhi. PM Modi emphasized on Sri Lanka’s prominent role in India’s ‘Neighbourhood First Policy’ and the ‘SAGAR Vision’. He also said that the development of India and Sri Lanka are interdependent and critical for sustainable growth.PM Modi interacts with the Indian community in Paris
July 13th, 11:05 pm
PM Modi interacted with the Indian diaspora in France. He highlighted the multi-faceted linkages between India and France. He appreciated the role of Indian community in bolstering the ties between both the countries.The PM also mentioned the strides being made by India in different domains and invited the diaspora members to explore opportunities of investing in India.గుజరాత్, తమిళనాడు మధ్య పురాతన బంధాన్ని గుర్తు చేసుకున్న సౌరాష్ట్ర తమిళ సంఘం: ప్రధానమంత్రి
March 19th, 08:49 pm
గుజరాత్, తమిళనాడు మధ్య పురాతన కాలం నుంచీ వస్తున్న అనుబంధాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ బంధాన్ని సౌరాష్ట్ర తమిళ సంగమం ఒక వేడుకలా జరుపుకుంటున్నదన్నారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ నినాదానికి ప్రతీక అని అభివర్ణించారు.చైతన్యభరితం అయినటువంటి తమిళ సంస్కృతిప్రపంచ స్థాయి లో లోకప్రియమైంది: ప్రధాన మంత్రి
February 13th, 09:21 am
సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇచ్చారు. ఎ.ఎమ్.కె, కెబున్ బారు మరియు వైసికె ల నివాసుల తో కలసి పొంగల్ పర్వదినాన్ని ఆలస్యం గా జరుపుకొన్నట్లు శ్రీ లీ సీన్ లూంగ్ తన ట్వీట్ లో తెలియ జేశారు.స్వాతంత్ర్యయోధుడు, పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారి కి ఆయనగురుపూజ సందర్భం లో నమస్కరించిన ప్రధాన మంత్రి
October 30th, 12:07 pm
స్వాతంత్ర్య యోధుడు, పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారికి ఆయన గురు పూజ సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.ఆడికృత్తిక సందర్భంగా ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
July 23rd, 01:13 pm
ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.మంగళకరమైన పూత్తాండు సందర్భం లో దేశప్రజల కు, ప్రత్యేకించి తమిళ ప్రజానీకాని కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
April 14th, 09:35 am
పూత్తాండు సందర్బం లో అందరి కి మరి ప్రత్యేకించి తమిళ సోదరీమణులకు మరియు సోదరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.తమిళ నాడు లో 11 నూతన వైద్య కళాశాల లను మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కు చెందిన నూతన కేంపస్ ను జనవరి 12వ తేదీన ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
January 10th, 12:38 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జనవరి 12వ తేదీ నాడు సాయంత్రం 4 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా తమిళ నాడు లో 11 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల లను, చెన్నై లో సెంట్రల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కు చెందిన ఒక కొత్త కేంపస్ ను ప్రారంభించనున్నారు.రాణివేలు నాచియార్ ను ఆమె జయంతి సందర్భం లో స్మరించుకొన్న ప్రధాన మంత్రి
January 03rd, 11:49 am
రాణి వేలు నాచ్చియార్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు శ్రద్ధాంజలి ని ఘటించారు.వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అనేక పథకాల శంకుస్థాపన సందర్భంగా చెన్నైలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం పూర్తి పాఠం
February 14th, 11:31 am
తమిళనాడు రాష్టంలో చేపట్టే పలు కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు ఆయనశంకుస్థాపన చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో,. ఎం.కె.-1ఎ పేరిట రూపొందించిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకును ఆయనసైన్యానికి అప్పగించారు.తమిళనాడులో పలు ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన
February 14th, 11:30 am
తమిళనాడు రాష్టంలో చేపట్టే పలు కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు ఆయనశంకుస్థాపన చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో,. ఎం.కె.-1ఎ పేరిట రూపొందించిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకును ఆయనసైన్యానికి అప్పగించారు.శ్రీలంక ప్రధాని రాజపక్సేతో ఉమ్మడి పత్రికా ప్రకటన లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
February 08th, 02:23 pm
శ్రీలంకకు చెందిన ప్రధాని రాజపక్సేతో సంయుక్త ప్రెస్ మీట్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ, శ్రీలంకలో స్థిరత్వం, భద్రత మరియు శ్రేయస్సు భారతదేశంలోనే ఉందని, మొత్తం భారత మహాసముద్ర ప్రాంతం పట్ల ఆసక్తి ఉందని అన్నారు. శాంతి, అభివృద్ధి కోసం భారతదేశం తన ప్రయాణంలో శ్రీలంకకు సహాయం చేస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.శ్రీ లంక రాష్ట్రపతి భారతదేశాని కి ఆధికారిక సందర్శన కు విచ్చేసిన సందర్భం గా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన పాఠం
November 29th, 12:50 pm
అధ్యక్షుడు శ్రీ గోతాబయ రాజపక్ష ను మరియు వారి ప్రతినిధి వర్గాన్ని భారతదేశాని కి ఆహ్వానించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఎన్నికల లో నిర్ణయాత్మకమైన విజయాన్ని సాధించినందుకు గాను అధ్యక్షుని కి నేను నా హృదయపూర్వకం గా అభినందనల ను తెలియ జేస్తున్నాను.స్వామి వివేకానందుని శికాగో ప్రసంగం 125వ వార్షికోత్సవం ముగింపు వేడుకల సందర్భంగా కోయంబత్తూరు లోని శ్రీ రామకృష్ణ మఠం నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొన్న వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 11th, 03:30 pm
స్వామి వివేకానందుని శికాగో ప్రసంగం 125వ వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా కోయంబత్తూరు లోని శ్రీ రామకృష్ణ మఠం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.