శ్రీ టి.ఎన్. శేషన్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

November 11th, 02:40 pm

‘‘శ్రీ టి.ఎన్. శేషన్ ఒక అసాధారణ ప్రభుత్వోద్యోగి. ఆయన చిత్తశుద్ధి తో, అత్యంత తత్పరత తో భారతదేశాని కి సేవ చేశారు. ఎన్నికల సంస్కరణ ల పట్ల ఆయన చేసినటువంటి కృషి మన ప్రజాస్వామ్యాన్ని మరింత మంది పాలు పంచుకొనేటట్టుగాను, మరింత బలవత్తరం గాను చేసింది. ఆయన మరణం తో వేదనకు లోనయ్యాను. ఓం శాంతి.’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.