వైపరీత్యాలను తట్టుకునే మౌలిక వసతుల అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో సందేశం

April 04th, 09:46 am

గౌరవ అతిథులు, ప్రభుత్వాధినేతలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విధానకర్తలు, ప్రపంచం మొత్తం నుండి వచ్చిన నా ప్రియ మిత్రులారా !

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై 5వ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన - ప్రధానమంత్రి

April 04th, 09:45 am

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలు - సి.డి.ఆర్.ఐ. పై 5వ అంతర్జాతీయ సదస్సు నుద్దేశించి ప్రధానమంత్రి ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

ఎన్ పిడిఆర్ ఆర్, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ –2023 తృతీయ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ న రేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

March 10th, 09:43 pm

విపత్తులనుంచి కోలుకునేలా చేయడంలో, విపత్తుల నిర్వహణ పనులలో నిమగ్నమైన వారందరికీ ముందుగా నా అభినందనలు. చాల సందర్భాలలో మీరు మీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి మీరు అద్భుతమైన కృషి చేస్తుంటారు. ఇటీవవవల, టర్కీ, సిరియాలలో భారత బృందం కృషిని మొత్తం ప్రపంచం అభినందించింది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం.

విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక 3వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

March 10th, 04:40 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో “విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక” (ఎన్‌పిడిఆర్ఆర్) 3వ సమావేశాన్ని ప్రారంభించారు. “మారుతున్న వాతావరణంలో స్థానిక ప్రతిరోధకత రూపకల్పన” ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ‘సుభాష్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారం-2023’ గ్రహీతలను ఆయన సత్కరించారు. ఈ గౌరవం పొందిన సంస్థలలో ‘ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ (ఒఎస్‌డిఎంఎ), మిజోరంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్ ఉన్నాయి. విపత్తు ముప్పు తగ్గింపు రంగంలో వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలు, ఉపకరణాలు, సాంకేతికత పరిజ్ఞానాల సంబంధిత ప్రదర్శనను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ తదితరులు పాల్గొన్నారు.

తుర్కియా, సిరియా దేశాలలో పనిచేసి వచ్చిన ఎన్ డీఆర్ ఎఫ్ దళాలనుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

February 20th, 06:20 pm

మానవత కోసం మహోన్నత కార్యం పూర్తి చేసుకొని మీరంతా తిరిగి వచ్చారు. ఎన్డీ ఆర్ ఎఫ్ కావచ్చు, సైన్యం కావచ్చు, వైమానిక దళం కావచ్చు, ఇతర సేవా బృందాలు కావచ్చు.. ‘ఆపరేషన్ దోస్త్’ లో పాలుపంచుకున్న మీ మొత్తం బృందం చాలా గొప్ప పని చేసింది. మన నోరు లేని మూగ జీవాలైన శునక బృందం కూడా అద్భుతమైన ప్రతిభ కనబరచింది. దేశం మీ అందరినీ చూసి గరవిస్తోంది.

తుర్కియే.. సిరియాలలో ‘ఆపరేషన్‌ దోస్త్‌’లోపాల్గొంటున్నఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో ప్రధానిసంభాషణ

February 20th, 06:00 pm

తుర్కియే, సిరియాలలో భూకంప బాధితుల రక్షణ-సహాయ కార్యక్రమాల్లో భాగంగా ‘ఆపరేషన్‌ దోస్త్’లో పాల్గొంటున్న భారత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌)తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. రెండు దేశాల్లో భూకంప బాధితులను ఆదుకోవడంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారని వారితో మాట్లాడిన సందర్భంగా ప్రధాని కొనియాడారు. ఈ నేపథ్యంలో వసుధైవ కుటుంబకం భావన గురించి ప్రధాని విశదీకరించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ స్ఫూర్తిని తుర్కియే, సిరియాల్లో భారత బృందం సేవలు ప్రతిబింబించాయని ఆయన వివరించారు.

భూకంపం కారణం గా సిరియా లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

February 06th, 03:30 pm

భూకంపం కారణం గా సిరియా లో ప్రాణ నష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. సిరియా ప్రజల దుఃఖం లో మేం సైతం పాలుపంచుకొంటున్నాం; ఈ కష్ట కాలం లో సహాయాన్ని అందించడాని కి మేం కట్టుబడి ఉన్నాం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.