స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడితో ప్రధాని సమావేశం

December 01st, 08:01 pm

ఈ సందర్భంగా వాణిజ్యం-పెట్టుబడులు, సాంకేతికత, ఆరోగ్యం, విద్య, ఐటీ, పర్యాటక రంగాలు సహా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించి సహకారంతోపాటు తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. అలాగే పరస్పర ప్రయోజనం సంబంధిత ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.

దావోస్‌ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ‘‘క్రియేటింగ్ ఎ శేర్ డ్ ఫ్యూచర్ ఇన్ ఎ ఫ్రాక్చర్ డ్ వరల్డ్’’ అంశంపై ప్ర‌ధాన‌ మంత్రి ఉపన్యాసం

January 23rd, 05:02 pm

దావోస్‌ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వ‌హిస్తున్న ఈ 48 వ వార్షిక సమావేశానికి హాజరైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ను ఓ బలమైన, సమగ్ర వేదికగా తీర్చిదిద్దడంలో చొరవ చూపిన శ్రీ క్లావుస్ శ్వాబ్‌ ను అభినందించడం సముచితమని నేను భావిస్తున్నాను. ప్రపంచ స్థితిగతులను మెరుగుపరచాలన్న బలీయమైన ఆయన ఆకాంక్షే ఈ వేదిక స్థాపన లోని పరమోద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఆయన ఆర్థిక, రాజకీయ మధనానికి గట్టిగా జోడించారు. అలాగే నాకు సాదర స్వాగతం పలికి, ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి, ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

స్విస్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్, అలైన్ బెర్సేతో చర్చించనున్న ప్రధాని మోదీ

January 23rd, 09:08 am

దావోస్ చేరుకున్న తరువాత, ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్తో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు మార్గాలను ఇరువురు నాయకులు చర్చించారు.

దావోస్ కు బ‌య‌లుదేరే ముందు ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన‌ ప్ర‌క‌ట‌న‌

January 21st, 09:04 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దావోస్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరే ముందు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.