కాశీలో కాశీ తెలుగు సంగమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
April 29th, 07:46 pm
నమస్కారం! గంగా పుష్కరాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీరంతా కాశీకి వచ్చారు కాబట్టి, ఈ సందర్శనలో మీరంతా వ్యక్తిగతంగా నా అతిథులు. మరియు అతిథి దేవునితో సమానమని మేము నమ్ముతాము. కొన్ని ముందస్తు పనుల కారణంగా మీకు స్వాగతం పలికేందుకు నేను అక్కడ ఉండలేకపోయినా, మీ అందరి మధ్య నేను ఉండాలని కోరుకుంటున్నాను. కాశీ తెలుగు కమిటీకి, నా పార్లమెంటరీ సహచరుడు జి.వి.ఎల్.నరసింహారావు గారికి అభినందనలు. కాశీలోని ఘాట్ల వద్ద జరిగే ఈ గంగ-పుష్కరాల ఉత్సవం గంగ, గోదావరి సంగమం లాంటిది. ఇది భారతదేశపు పురాతన నాగరికతలు, సంస్కృతులు మరియు సంప్రదాయాల సంగమం యొక్క వేడుక. కొన్ని నెలల క్రితం కాశీ గడ్డపై కాశీ-తమిళ సంగమం జరిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం సౌరాష్ట్ర-తమిళ సంగమంలో పాల్గొనే భాగ్యం కలిగింది. ఈ 'ఆజాదీ కా అమృత్కాల్' దేశంలోని భిన్నత్వాలు, వివిధ ప్రవాహాల సంగమం అని నేను అప్పట్లో చెప్పాను. అనంతమైన భవిష్యత్తు వరకు భారతదేశాన్ని చైతన్యవంతంగా ఉంచే ఈ భిన్నత్వాల సంగమం నుంచి జాతీయతా అమృతం కారుతోంది.ఉత్తరప్రదేశ్‌లోని కాశీ నగరంలో ‘కాశీ తెలుగు సంగమం’ సందర్భంగా ప్రధాని ప్రసంగం
April 29th, 07:45 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని కాశీ నగరంలో నిర్వహించిన ‘కాశీ తెలుగు సంగమం’ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. గంగా పుష్కర వేడుకల నేపథ్యంలో ముందుగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపి, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు. ఈ వేళ కాశీ నగరంలో ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా తన వ్యక్తిగత అతిథులేనని ఆయన అభివర్ణించారు. అలాగే మన భారతీయ సంస్కృతిలో అతిథులు దేవుడితో సమానమని ప్రధాని గుర్తుచేశారు. “మిమ్మల్ని నేను స్వయంగా స్వాగతించలేకపోయినా, నా మనస్సు మీతోనే ఉంది” అని ఈ సందర్భంగా తన మనోభావాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కాశీ-తెలుగు కమిటీతోపాటు పార్లమెంటు సభ్యుడు శ్రీ జి.వి.ఎల్. నరసింహారావును ప్రధాని అభినందించారు. కాశీ ఘాట్‌ల వద్ద గంగా పుష్కర వేడుకలు గంగా-గోదావరి నదుల సంగమం వంటిదని పేర్కొన్నారు. ఇది భారత ప్రాచీన నాగరికత-సంస్కృతులు-సంప్రదాయాల మేలు కలయికకు సంబంధించిన వేడుకని ప్రధానమంత్రి చెప్పారు. కొన్ని నెలల కిందట ఇక్కడే కాశీ- తమిళ సంగమం నిర్వహణను ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే కొన్ని రోజుల ముందు సౌరాష్ట్ర - తమిళ సంగమంలో తాను పాల్గొనడాన్ని కూడా ప్రస్తావించారు. ఈ మేరకు స్వాతంత్ర్య అమృత కాలాన్ని దేశంలోని వైవిధ్యాలు-సంస్కృతుల సంగమంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. “ఈ భిన్నత్వాల సంగమం జాతీయవాద అమృతాన్ని సృష్టిస్తోంది. భవిష్యత్తులో ఇది భారతదేశాన్ని సంపూర్ణంగా శక్తిమంతం చేస్తుంది” అని ప్రధానమంత్రి ఆశాభావం వెలిబుచ్చారు.