Today the youth of India is full of new confidence, succeeding in every sector: PM Modi
December 23rd, 11:00 am
PM Modi addressed the Rozgar Mela and distributed more than 71,000 appointment letters to newly appointed youth in Government departments and organisations. PM Modi underlined that in the last one and a half years, around 10 lakh permanent government jobs have been offered, setting a remarkable record. These jobs are being provided with complete transparency, and the new recruits are serving the nation with dedication and integrity.PM Modi distributes more than 71,000 appointment letters to newly appointed recruits
December 23rd, 10:30 am
PM Modi addressed the Rozgar Mela and distributed more than 71,000 appointment letters to newly appointed youth in Government departments and organisations. PM Modi underlined that in the last one and a half years, around 10 lakh permanent government jobs have been offered, setting a remarkable record. These jobs are being provided with complete transparency, and the new recruits are serving the nation with dedication and integrity.Double-engine Governments at the Centre and state are becoming a symbol of good governance: PM in Jaipur
December 17th, 12:05 pm
PM Modi participated in the event ‘Ek Varsh-Parinaam Utkarsh’ to mark the completion of one year of the Rajasthan State Government. In his address, he congratulated the state government and the people of Rajasthan for a year marked by significant developmental strides. He emphasized the importance of transparency in governance, citing the Rajasthan government's success in job creation and tackling previous inefficiencies.రాజస్థాన్ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా
December 17th, 12:00 pm
‘ఏక్ వర్ష్ - పరిణామ్ ఉత్కర్ష్: రాజస్థాన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంవత్సరం పూర్తి’ పేరుతో ఈ రోజు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకొన్నందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికీ, ఆ రాష్ట్ర ప్రజలకూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదాల్ని అందుకోవడం తనకు దక్కిన సౌభాగ్యమని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో అభివృద్ధి పనులకు ఒక కొత్త దిశను, జోరును ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రినీ, ఆయన జట్టునీ శ్రీ మోదీ ప్రశంసించారు. రాబోయే అనేక సంవత్సరాల్లో అభివృద్ధికి ఈ మొదటి సంవత్సరం ఒక బలమైన పునాదిగా మారిందని అన్నారు. ఈ రోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వానికి సంవత్సర కాలం పూర్తి అవడం ఒక్కటే కాకుండా రాజస్థాన్ అభివృద్ధి ఉత్సవంతోపాటు రాజస్థాన్ ఉజ్వలంగా మెరిసిపోతూ ఉండడానికి కూడా సంకేతంగా నిలిచిందని ఆయన అన్నారు. ఇటీవల రైజింగ్ రాజస్థాన్ సమ్మిట్ 2024 సందర్భంగా తాను ఇక్కడ పర్యటించిన సంగతిని శ్రీ మోదీ గుర్తు చేస్తూ.. ప్రపంచమంతటి నుంచీ ఎంతో మంది పెట్టుబడిదారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఈ రోజు రూ.45,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు నీటి విషయంలో రాజస్థాన్ ఎదుర్కొంటున్న అడ్డంకుల్ని తొలగించేందుకు సముచిత పరిష్కారాన్ని అందిస్తాయనీ, భారతదేశంలో చాలా రాష్ట్రాలతో చక్కని అనుసంధాన సదుపాయాన్ని కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా రాజస్థాన్‌ను నిలబెడతాయని కూడా ఆయన అన్నారు. ఈ అభివృద్ధి పనులు మరింత మంది పెట్టుబడిదారులను ఆహ్వానించి, అనేక ఉద్యోగావకాశాలను కల్పించి, పర్యాటక రంగాన్ని బలపరచడంతోపాటు రాజస్థాన్‌లో రైతులకు, మహిళలకు, యువతకు ప్రయోజనాలను అందిస్తాయని ప్రధాని అన్నారు.Maha Kumbh is a divine festival of our faith, spirituality and culture: PM in Prayagraj
December 13th, 02:10 pm
PM Modi inaugurated development projects worth ₹5500 crore in Prayagraj, highlighting preparations for the 2025 Mahakumbh. He emphasized the cultural, spiritual, and unifying legacy of the Kumbh, the government's efforts to enhance pilgrimage facilities, and projects like Akshay Vat Corridor and Hanuman Mandir Corridor.ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం
December 13th, 02:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యే వారిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, పవిత్ర సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్‌కు, మహాకుంభమేళాకు వచ్చే సాధువులు, సన్యాసులకు భక్తితో నమస్కరించారు. కృషి, అంకితభావంతో మహా కుంభమేళాను విజయవంతం చేస్తున్న ఉద్యోగులు, శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా జరిగే పరిమాణాన్ని, స్థాయి గురించి వివరిస్తూ, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే మహాయజ్ఞంగా, ప్రతి రోజూ లక్షల మంది భక్తుల పాల్గొనే, ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ‘‘ప్రయాగరాజ్ నేలపై సరికొత్త చరిత్ర లిఖితమవుతోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. వచ్చే ఏడాది జరగబోతున్న మహా కుంభమేళా దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును నూతన శిఖరాలకు తీసుకెళుతుందతని, ఈ ఐక్యత ‘మహాయజ్ఞం’ గురించి ప్రపంచమంతా చర్చిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మహా కుంభమేళాని విజయవంతంగా నిర్వహించాలన్నారు.అహ్మదాబాద్ రామకృష్ణ మఠం కార్యక్రమంలో వీడియో మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
December 09th, 01:30 pm
పూజ్య స్వామి గౌతమానందజీ మహరాజ్, రామకృష్ణ మఠానికి చెందిన దేశవిదేశాల సాధువులు, మహాత్ములు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్, కార్యక్రమంలో భాగమైన విశిష్ఠ అతిథులు, సోదర సోదరీమణులు.. అందరికీ నా నమస్కారాలు!గుజరాత్ లో రామకృష్ణ మఠం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 09th, 01:00 pm
గుజరాత్ రామకృష్ణ మఠం ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పూజ్య స్వామి గౌతమానందజీ మహరాజ్, రామకృష్ణ మఠానికి చెందిన దేశవిదేశాల సాధువులు, మహాత్ములు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్, కార్యక్రమంలో భాగమైన విశిష్ఠ అతిథులు తదితరులకు అభినందనలు తెలిపారు. మాతా శారదాదేవి, గురుదేవులు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల వారి పాదాలకు ప్రణామాలు అర్పించారు. నేటి కార్యక్రమం స్వామి ప్రేమానంద్ మహరాజ్ జీ జయంతి సందర్భంగా ఏర్పాటయ్యిందంటూ వారికి వందనాలర్పించారు.కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
December 07th, 05:52 pm
పవిత్రమైన కార్యకర్ సువర్ణ మహోత్సవం సందర్భంగా, భగవాన్ స్వామి నారాయణుని పాదాలకు వినమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు హరి ప్రగత్ బ్రహ్మ స్వరూపమైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి ఈ రోజు. ఆయనకు కూడా భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్ చేస్తున్న నిర్విరామ కృషి, అంకిత భావం ద్వారానే భగవాన్ స్వామి నారాయణుడి బోధనలు, ప్రముఖ్ స్వామి మహరాజ్ తీర్మానాలు ఈ రోజు నిజరూపం దాలుస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్లు, యువత, చిన్నారులు భాగం పంచుకుంటున్న ఈ అద్బుతమైన సాంస్కృతిక కార్యక్రమం విత్తనం, చెట్టు, ఫలం అనే భావనను అందంగా సూచిస్తోంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, ఈ కార్యక్రమ ఉత్సాహాన్ని, శక్తినీ నా హృదయం అనుభూతి చెందుతోంది. ఇంత గొప్ప దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, మహనీయులైన సాధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినయంగా నమస్కరిస్తున్నాను.అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 07th, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్‌లో ఏర్పాటైన కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మొదట పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, ఆరాధనీయులైన సాధు సంతులకు, సత్సంగి కుటుంబ సభ్యులకు, ఇతర ప్రముఖులకు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ చరణాలకు శ్రీ మోదీ ప్రణామాన్ని ఆచరించారు. ఈ రోజు ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి సందర్భం కూడా అని ప్రధాని గుర్తుకు తీసుకువచ్చారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రబోధాలు, ప్రముఖ్ స్వామి మహారాజ్ సంకల్పాలు పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్ కఠోర శ్రమతో, అంకితభావం తో నెరవేరుతున్నాయని కూడా శ్రీ మోదీ అన్నారు. సుమారు ఒక లక్షమంది కార్యకర్తలతోపాటు యువతీయువకులు, బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇదెంత భారీ కార్యక్రమమో చెప్పకనే చెబుతోందని, దీనిని చూడడం తనకు సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు. తాను సభాస్థలిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఈ కార్యక్రమంలో ఉత్సాహాతిరేకం ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందీ తనకు తెలుస్తూనే ఉందన్నారు. పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, సాధువులందరికీ ఈ భవ్య దివ్య కార్యక్రమానికిగాను ఆయన తన అభినందనలను అందజేశారు.భారతీయ ప్రవాసులు వివిధ దేశాల్లో తమదైన ముద్ర వేశారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 24th, 11:30 am
మన్ కీ బాత్ యొక్క 116వ ఎపిసోడ్‌లో, పీఎం మోదీ ఎన్సిసి డే యొక్క ప్రాముఖ్యతను చర్చించారు, ఎన్సిసి క్యాడెట్ల పెరుగుదల మరియు విపత్తు సహాయంలో వారి పాత్రను హైలైట్ చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం యువత సాధికారతను నొక్కి, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ గురించి మాట్లాడారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నావిగేట్ చేయడంలో సీనియర్ సిటిజన్‌లకు యువత సహాయం చేయడం మరియు ఏక్ పెద్ మా కే నామ్ క్యాంపెయిన్ విజయాన్ని కూడా ఆయన పంచుకున్నారు.హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు 2024లో ప్రధాని ప్రసంగానికి అనువాదం
November 16th, 10:15 am
వందేళ్ల క్రితం, పూజనీయ బాపూజీ హిందూస్థాన్ టైమ్స్‌ను ప్రారంభించారు. ఆయన గుజరాతీ మాట్లాడతారు. వందేళ్ల తర్వాత మరో గుజరాతీని మీరు ఇక్కడకు ఆహ్వానించారు. హిందూస్థాన్ టైమ్స్‌కు, ఈ వందేళ్ల చారిత్రక ప్రయాణంలో ఈ పత్రికతో కలసి పనిచేసిన వారికి, అభివృద్ధిలో భాగస్వాములైనవారికి, సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ అభినందనలకు, గౌరవానికి వీరంతా అర్హులు. వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ గుర్తింపునకు మీరంతా అర్హులు, మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి రాగానే, ఈ కుటుంబ సభ్యులను నేను కలుసుకున్నాను. వందేళ్ల ప్రయాణాన్ని (హిందూస్థాన్ టైమ్స్) తెలియజేసే ప్రదర్శనను సందర్శించాను. మీకు సమయం ఉంటే, ఇక్కడి నుంచి వెళ్లే ముందు దాన్ని సందర్శించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అది ప్రదర్శన మాత్రమే కాదు. ఓ అనుభవం. నా కళ్ల ముందే వందేళ్ల చరిత్ర నడయాడిన అనుభూతికి నేను లోనయ్యాను. భారత దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన రోజు, రాజ్యాంగం అమల్లోకి వచ్చన నాటి పత్రికలను నేను చూశాను. మార్టిన్ లూథర్ కింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వంటి విశిష్ట వ్యక్తులు హిందూస్థాన్ టైమ్స్‌లో వ్యాసాలు రాసేవారు. వారి రచనలు పత్రికను సుసంపన్నం చేశాయి. నిజంగా మనం చాలా దూరమే ప్రయాణించాం. స్వాంతంత్య్రం సాధించడానికి చేసిన పోరాటం నుంచి, స్వాంతంత్య్రం అనంతరం సరిహద్దులు లేని ఆశల తరంగాలను చేరుకోవడం వరకు చేసిన ప్రయాణం అద్భుతం, అసాధారణం. అక్టోబర్ 1947లో కశ్మీర్ భారత్‌లో విలీనమైన తర్వాత ప్రతి పౌరుడూ అనుభవించిన ఉత్సాహాన్ని మీ వార్తా పత్రిక ద్వారా తెలుసుకున్నాను. సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఏడు దశాబ్దాలుగా కశ్మీర్లో హింస ఎలా చెలరేగిందో కూడా తెలుసుకోగలిగాను. గతానికి భిన్నంగా జమ్ము కశ్మీర్లో రికార్డు స్థాయిలో జరిగిన పోలింగ్‌కు సంబంధించిన వార్తలను ఈ రోజు మీ పత్రికలో ప్రచురిస్తున్నారు. పత్రిక మరో పేజీ కూడా పాఠకుల దృష్టిని ఆకర్షించింది. ఒక వైపు అస్సాంను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారన్న వార్తను ప్రచురిస్తే, మరో పక్క అటల్‌జీ బీజేపీకి పునాది వేశారన్న వార్త ప్రచురించారు. ఈ రోజు అస్సాంలో శాశ్వతంగా శాంతిని నెలకొల్పడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించడం కాకతాళీయమే.న్యూఢిల్లీలో ‘2024- హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్’ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 16th, 10:00 am
న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన ‘2024-హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్’ నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వందేళ్ల కిందట జాతి పిత మహాత్మా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన హిందుస్థాన్ టైమ్స్ పత్రిక, నూరేళ్ళ చారిత్రాత్మక ప్రయాణం పూర్తిచేసినందుకు పత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. తొలినాళ్ళ నుంచీ పత్రికతో అనుబంధం కలిగిన వారిని అభినందిస్తూ, వారికి అన్ని విధాలా శుభం చేకూరాలని ఆకాంక్షించారు. పత్రిక శతాబ్ది వేడుకల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక ప్రదర్శనను తిలకించిన శ్రీ మోదీ, అద్భుతమైన ఈ ప్రదర్శనను ప్రతినిధులందరూ తప్పక సందర్శించాలని సూచించారు. భారత్ కు స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భం, రాజ్యాంగం అమలు… మొదలైన అలనాటి చారిత్రక ఘట్టాలకు సంబంధించిన పాత ప్రతులను చూసే అవకాశం కలిగిందన్నారు. మార్టిన్ లూథర్ కింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి, డాక్టర్ ఎం ఎస్ స్వామినాథన్ వంటి లబ్ధ ప్రతిష్ఠులు హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు వ్యాసాలు రాసేవారని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర పోరు నాటి పరిస్థితులకు, అనంతర కాలంలోని ఆశలూ ఆకాంక్షలకు ప్రత్యక్షసాక్షిగా నిలిచిన పత్రిక ప్రయాణం అద్భుతమనదగ్గదని అన్నారు. అక్టోబర్ 1947లో భారతదేశంలో కాశ్మీర్ విలీనానికి సంబంధించిన వార్తను తానూ మిగతా దేశవాసులతో కలిసి అబ్బురంగా చదివానని శ్రీ మోదీ నెమరువేసుకున్నారు. నిర్ణయం తీసుకోవడంలో అసంగదిగ్ధత కాశ్మీర్ ను ఏ విధంగా ప్రతికూలంగా ప్రభావితం చేసిందో ఆ క్షణం తనకు అవగతమైందని, ఏడు సుదీర్ఘ దశాబ్దాల పాటు కాశ్మీర్ హింసను ఎదుర్కొనవలసి వచ్చిందని అన్నారు. ఇప్పటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, ఇప్పుడు జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో రికార్డు సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం గురించి వార్తల ప్రచురణ తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. తనని ఆకర్షించిన మరో వార్త గురించి చెబుతూ, వార్తా పత్రిక ఒకవైపు పుటలో అస్సాం ను సమస్యాత్మక ప్రాంతంగా ప్రకటించిన వార్త ప్రచురితమవగా, మరోవైపు భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి శంకుస్థాపనకు సంబంధించిన వార్త ప్రచురితమైందని వెల్లడించారు. నేడు అస్సాంలో సుస్థిర శాంతిని నెలకొల్పేందుకు అదే బీజేపీ కీలక భూమిక పోషిస్తూండడం తనకు ఆనందం కలిగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.Tribal society is the one that led the fight for centuries to protect India's culture and independence: PM Modi
November 15th, 11:20 am
PM Modi addressed Janjatiya Gaurav Diwas, emphasizing India's efforts to empower tribal communities, preserve their rich heritage, and acknowledge their vital role in nation-building.గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా భగవాన్ బిర్సా ముండా150వ జయంతి వేడుకలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 15th, 11:00 am
జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు(నవంబర్ 15న) భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. బీహార్‌లోని జముయిలో దాదాపు రూ. 6,640 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలూ ప్రారంభోత్సవాలూ చేశారు. వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు.నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 27th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది- అది గత సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరిగింది. ఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను. ఈ యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. ఈ పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే. ఆ క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా ఈ భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చింది. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను.గత 10 సంవత్సరాల్లో స్వచ్ఛ భారత్ తెచ్చిన పరివర్తన ప్రభావాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని
October 03rd, 08:52 am
గత 10 సంవత్సరాలలో స్వచ్ఛ భారత్ సాధించిన పరివర్తనాత్మక ప్రభావాన్ని ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా ప్రస్తావించారు.సామాజిక మార్పులో...సమష్టి కృషి అద్భుతాలు చేయగలదు: ప్రధాన మంత్రి
October 03rd, 08:50 am
సమష్టి కృషిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కొనియాడారు. ఇది సామాజిక మార్పు దిశగా ఇది అద్భుతాలు చేయగలదని వ్యాఖ్యానించారు.మన్ కీ బాత్‌లో అన్నింటికన్నా ఎక్కువగా చర్చించిన అంశం స్వచ్ఛత: ప్రధానమంత్రి
October 02nd, 05:56 pm
మన్ కీ బాత్ సమయంలో అత్యంత ఎక్కువగా చర్చించిన అంశాల్లో స్వచ్ఛత ఒకటని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.140 కోట్ల మంది భారతీయులతో నడిచే అపూర్వ ఉద్యమం స్వచ్ఛ భారత్: ప్రధానమంత్రి
October 02nd, 05:48 pm
10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వచ్ఛ భారత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల సారథ్యంలో జరిగిన ఒక అపురూప ఉద్యమం అని కొనియాడారు.