గుజరాత్ లో పలు ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
July 16th, 04:05 pm
మంత్రి మండలిలో నా సహచరులు, గాంధీనగర్ ఎంపి శ్రీ అమిత్ షా జీ, రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ జీ భాయ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి శ్రీ దర్శన జార్డోష్ జీ, గుజరాత్ ప్రభుత్వ ఇతర మంత్రులు, పార్లమెంటులో నా సహచరులు మరియు గుజరాత్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ సిఆర్ పాటిల్ జీ ఇతర ఎంపిలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన సోదర సోదరీమణులు, మీ అందరికీ శుభాకాంక్షలుగుజరాత్ లో అనేక ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
July 16th, 04:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో రైల్వే లకు చెందిన కీలకమైన అనేక పథకాల ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఆయన గుజరాత్ సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్- రోబోటిక్స్ గ్యాలరీ ని, నేచర్ పార్కు ను కూడా ప్రారంభించారు. గాంధీనగర్ రాజధాని- వారాణసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గాంధీ నగర్ రాజధాని, వరేఠా ల మధ్య ఎమ్ఇఎమ్‌యు సర్వీస్ రైలు అనే రెండు కొత్త రైళ్ళ కు ఆయన జెండా ను చూపెట్టి, వాటిని ప్రారంభించారు.గుజరాత్ లో జూలై 16న పలు ప్రాజెక్టుల ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; వాటి ని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు
July 14th, 06:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైల్వేల కు చెందిన అనేక కీలక ప్రాజెక్టుల ను 2021 జూలై 16న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా గుజరాత్ లో ప్రారంభించనున్నారు. అనేక పథకాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేయనున్నారు కూడా. ఈ కార్యక్రమం లో భాగం గా గుజరాత్ లోని సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్-రోబోటిక్స్ గ్యాలరీ ని, నేచర్ పార్కు ను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.