We are working fast in every sector for the development of Odisha: PM Modi at Odisha Parba 2024
November 24th, 08:48 pm
PM Modi addressed Odisha Parba 2024, celebrating Odisha's rich cultural heritage. He paid tribute to Swabhaba Kabi Gangadhar Meher on his centenary, along with saints like Dasia Bauri, Salabega, and Jagannath Das. Highlighting Odisha's role in preserving India's cultural persity, he shared the inspiring tale of Lord Jagannath leading a battle and emphasized faith, unity, and pine guidance in every endeavor.ఒడిశా పర్వ 2024 ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
November 24th, 08:30 pm
న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ‘ఒడిశా పర్వ 2024’ ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు హాజరైన ఒడిశా సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదితో స్వభావ్ కవి గంగాధర్ మెహర్ మరణించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భక్త దసియా భౌరీ, భక్త సాలబేగ, భగవద్గీతను ఒడియాలో రచించిన శ్రీ జగన్నాథ్ దాస్‌కు సైతం ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.గుజరాత్, గాంధీనగర్ లో రీ ఇన్వెస్ట్ 2024 కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం
September 16th, 11:30 am
జర్మనీ ఆర్థిక సహకార మంత్రి , డెన్మార్క్ పరిశ్రమల వ్యాపార మంత్రితో సహా విదేశాల నుండి వచ్చిన విశిష్ట అతిథులూ , నా మంత్రి మండలి సభ్యులు ప్రహ్లాద్ జోషి జీ, శ్రీపాద్ నాయక్ జీ , పలు దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు...గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన (రీ-ఇన్వెస్ట్)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం
September 16th, 11:11 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభించారు. మన దేశం 200 గిగావాట్ల శిలాజేతర ఇంధన స్ధాపిత సామర్థ్యం సాధించడంలో సహకరించిన కీలక భాగస్వాములను ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత్ సత్కరిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలు, అంకుర సంస్థలు, ప్రధాన పారిశ్రామిక సంస్థలలో అత్యాధునిక ఆవిష్కరణలతో సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ తిలకించారు.అక్టోబరు 9-11 తేదీలలో ప్రధానమంత్రి గుజరాత్ పర్యటన
October 08th, 12:09 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 9-11 తేదీల మధ్య గుజరాత్‌లో పర్యటించడంతోపాటు అక్టోబరు 11న మధ్యప్రదేశ్‌ను సందర్శిస్తారు. ఈ మేరకు ప్రధాని అక్టోబరు 9న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో మెహసానా జిల్లాలోని మోధెరా గ్రామంలో వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 6:45 గంటలకు మోధేశ్వరి మాత ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని, పూజలు చేయిస్తారు. అటుపైన రాత్రి 7:30 గంటలకు సూర్య దేవాలయానికి వెళ్తారు.