ప్రజాస్వామ్య సదస్సునుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
March 20th, 10:55 pm
ఈ చొరవను కొనసాగిస్తున్నందుకు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు నా అభినందనలు. ప్రజాస్వామ్య దేశాలు తమ అనుభవాలు తెలియచేసుకునేందుకు, పరస్పరం నేర్చుకునేందుకు ‘‘ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సు’’ ఒక ముఖ్యమైన వేదికగా రూపాంతరం చెందింది.ప్రజాస్వామ్యంపై శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
March 20th, 10:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజాస్వామ్యంపై శిఖరాగ్ర సదస్సు’లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్య దేశాల మధ్య అనుభవాల ఆదానప్రదానానికి ఈ సదస్సు ఓ కీలక వేదికని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై భారత్ నిబద్ధత ఎంతో లోతైనదని పునరుద్ఘాటిస్తూ- ‘‘భారతదేశానిది అత్యంత ప్రాచీన, నిరంతరాయ ప్రజాస్వామ్య సంస్కృతి. భారతీయ నాగరికతకు జీవనాడి అదే’’నని స్పష్టం చేశారు. అలాగే ‘‘ఏకాభిప్రాయ సాధన, బహిరంగ చర్చ, స్వేచ్ఛాయుత సంప్రదింపులు భారతదేశ చరిత్ర అంతటా కనిపిస్తాయి. అందువల్లనే నా సహ పౌరులు భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా పరిగణిస్తారు’’ అని నొక్కిచెప్పారు.‘సమిట్ ఫార్ డెమోక్రసీ’ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన జాతీయప్రకటన
December 10th, 05:52 pm
ఇది అన్ని రంగాల లోను అపూర్వమైనటువంటి సామాజిక, ఆర్థిక మేళనాని కి చెందినటువంటి ఒక గాథ గా ఉంది. ఇది ఆరోగ్యం, విద్య, మానవ శ్రేయం వంటి రంగాల లో ఊహించలేనటువంటి స్థాయి లో నిరంతరం మెరుగుదల ల తాలూకు ఒక గాథ గా కూడా ఉంది. భారతదేశం గాథ ద్వారా ప్రపంచాని కి ఒక స్పష్టమైన సందేశం లభిస్తున్నది. అది ఏమిటి అంటే ప్రజాస్వామ్యం ఫలితాల ను ఇవ్వగలుగుతుంది, ప్రజాస్వామ్యం ఫలితాల ను ఇచ్చింది, మరి ప్రజాస్వామ్యం ఫలితాల ను ఇవ్వడాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది అనేదే.