రాజస్తాన్ లోని సికార్ వద్ద పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన/ప్రారంభం అనంతరం ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం
July 27th, 12:00 pm
నేడు దేశవ్యాప్తంగా 1.25 లక్షల పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ, బ్లాక్ స్థాయిలో ఏర్పాటైన ఈ కేంద్రాలు నేరుగా కోట్లాది మంది రైతులకు నేరుగా ప్రయోజనం కలిగిస్తోంది. అలాగే 1500 పైగా వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘాలు (ఎఫ్ పిఓ), మన రైతుల కోసం ‘‘ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’’ (ఓఎన్ డిసి) ప్రారంభించడం జరిగింది. దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోని రైతు అయినా ఇంట్లోనే కూచుని దేశంలోని ఏ ప్రాంతంలోని మార్కెట్ లో అయినా తేలిగ్గా తమ ఉత్పత్తిని విక్రయించవచ్చు.రాజస్థాన్ లోనిసీకర్ లో వివిధ అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
July 27th, 11:15 am
రాజస్థాన్ లోని సీకర్ లో వేరు వేరు అభివృద్ధి పథకాల కు ప్రధాన మంత్రి ఈ రోజు న శంకుస్థాపన చేసి వాటి ని దేశ ప్రజల కు అంకితం చేశారు. ఆయా ప్రాజెక్టుల లో 1.25 లక్షల కు పైచిలుకు ‘పిఎమ్ కిసాన్ సమృద్ధి కేంద్రాల’ (పిఎమ్ కెఎస్ కె స్) ను దేశ ప్రజల కు అంకితం చేయడం, గంధకం పూత పూసినటువంటి ఒక క్రొత్త రకం యూరియా ‘యూరియా గోల్డ్ ’ ను ప్రవేశపెట్టడం, 1,600 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ స్) ను ఓపెన్ నెట్ వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్ (ఒఎన్ డిసి) లో చేరినట్లు ప్రకటించడం, ‘ప్రధాన మంత్రి కిసాస్ సమ్మాన్ నిధి’ (పిఎమ్-కిసాన్) లో భాగం గా 8.5 కోట్ల మంది లబ్ధిదారుల కు పధ్నాలుగో వాయిదా సొమ్ము తాలూకు దాదాపు 17,000 కోట్ల రూపాయల ను విడుదల చేయడం, చిత్తౌడ్ గఢ్, ధౌల్ పుర్, సిరోహీ, సీకర్, ఇంకా శ్రీ గంగానగర్ లలో నూతన వైద్య కళాశాలలు అయిదింటి ని ప్రారంభించడం, బారాఁ, బూందీ, కరౌలీ, ఝుంఝునూ, సవాయి మాధోపుర్, జైసల్ మెర్ మరియు టోంక్ లలో వైద్య కళాశాల లు ఏడింటి కి శంకుస్థాపన చేయడం, అలాగే ఉదయ్ పుర్, బాన్స్ వాడ, ప్రతాప్ గఢ్ మరియు డుంగర్ పుర్ జిల్లాల లో ఏర్పటైన ఆరు ఏకలవ్య నమూనా ఆశ్రమ పాఠశాలలు ఆరింటిని మరియు జోద్ పుర్ లో కేంద్రీయ విద్యాలయ తింవరీ ని ప్రారంభించడం భాగం గా ఉన్నాయి.