ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపును అందుకొని స్థానిక ఉత్పత్తులకు అనుకూలంగా మద్ధతు తెలిపిన ఆధ్యాత్మిక నేతలు
November 17th, 02:14 pm
ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం ‘వోకల్ ఫార్ లోకల్’ ను (‘స్థానిక వస్తువులనే ఆదరిద్దాం’) గురించి ప్రచారం చేయడంలో సాయపడాలంటూ ఆధ్యాత్మిక నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజున చేసిన విజ్ఞప్తికి దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు పెద్ద ఎత్తున ప్రతిస్పందించారు. ప్రధాన మంత్రి అభ్యర్థన పట్ల ‘సంత్ సమాజం’లో గొప్ప ఉత్సుకత వ్యక్తమైంది. ఆత్మనిర్భర్ భారత్ ను ఆవిష్కరించడానికి ‘స్థానిక వస్తువుల వైపు మొగ్గు చూపాలన్న’ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆధ్యాత్మికవేత్తలు ముందంజవేసి, ఆ నినాదానికి తమ సమర్ధన ఉంటుందంటూ ప్రతినబూనారు.ఆత్మనిర్భర్ భారత్ కోసం ‘వోకల్ ఫర్ లోకల్’ కు ప్రచారం చేయడంలో సాయాన్ని అందించవలసిందిగా ఆధ్యాత్మిక నాయకులకు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
November 16th, 12:50 pm
స్వాతంత్య్ర పోరాటానికి ఒక పునాదిని భక్తి ఉద్యమం వేసినట్లుగానే, అదే మాదిరిగా ప్రస్తుతం ఆత్మనిర్భర్ భారత్ కు ఒక ఆధారాన్ని మన దేశంలోని సాధువులు, మహాత్ములు, మహంతులు, అలాగే ఆచార్యులు అందజేయనున్నారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు న జైన ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జీ మహారాజ్ 151వ జయంతి కి గుర్తు గా ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. ఆ తరువాత ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భం లో ఆయన ప్రసంగం ముఖ్యాంశాల్లో.. స్వాతంత్య్ర పోరాటం, ప్రస్తుతం చేపడుతున్న ఆత్మనిర్భరతల వంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక కార్యక్రమాలకు ధార్మిక, ఆధ్యాత్మిక పునాది ని ఏర్పరచడం ఎంతయినా అవసరం అన్నది.. కూడా ఒక ముఖ్యాంశం గా ఉండింది.PM Modi requests spiritual leaders to promote Aatmanirbhar Bharat by going vocal for local
November 16th, 12:46 pm
PM Modi unveiled ‘Statue of Peace’ to mark the 151st birth anniversary celebrations of Jainacharya Shree Vijay Vallabh Surishwer Ji Maharaj. Reiterating his stress on ‘vocal for local’ Shri Modi requested that as happened during the freedom struggle, all the spiritual leaders should amplify the message of Aatmanirbhar Bharat.జైన ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జీ మహారాజ్ 151 వ జయంతి సూచకం గా ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ ను ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
November 16th, 12:45 pm
జైన ఆచార్యుడు శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జీ మహారాజ్ 151 వ జయంతి ఉత్సవాలకు గుర్తు గా ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ (శాంతి విగ్రహం)ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న ఆవిష్కరించారు. జైన ఆచార్య గౌరవార్థం ఆవిష్కరించిన ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ అని పేరు పెట్టడమైంది. 151 అంగుళాల ఎత్తయిన ఈ విగ్రహాన్ని అష్టధాతువుల తో, అంటే 8 లోహాలతో, నిర్మించడం జరిగింది. దీనిలో రాగి ప్రధాన ధాతువు గా ఉంది. దీనిని రాజస్థాన్ లోని పాలీ లో గల జేత్ పుర లో నెలకొల్పారు.జైన ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర జీ మహారాజ్ 151 జయంతి ని పురస్కరించుకుని నవంబర్ 16న శాంతి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి
November 14th, 06:06 pm
జైన ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర జీ మహారాజ్ 151 జయంతి ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, నవంబర్ 16 మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియోకాన్ఫరెన్సు ద్వారా శాంతి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.