భారతదేశంలో తక్కువ ఖర్చులో, మళ్ళీ మళ్ళీ ఉపయోగించేందుకు వీలున్న కొత్త అంతరిక్ష వాహక నౌక
September 18th, 04:27 pm
ఆధునిక అంతరిక్ష వాహక నౌక (నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్-ఎన్‌జిఎల్‌వి)ని అభివృద్ధి పరచాలన్న ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. విశ్వంలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికీ, దానిని నిర్వహించడానికీ ఈ అంతరిక్ష నౌక చాలా ముఖ్యం. 2040 సంవత్సరానికల్లా చంద్రగ్రహం మీదకు భారతీయ వ్యోమగాములను పంపించాలన్న ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసే దిశలో ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన అడుగు కానుంది. ప్రస్తుతం ఉన్న ఎల్‌విఎమ్3 తో పోలిస్తే ఒకటిన్నర రెట్ల అదనపు ఖర్చుతో ప్రస్తుత పేలోడ్ కన్నా మూడింతల పేలోడ్ ను మోసుకు పోయే సత్తా ఎన్‌జిఎల్‌వికి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకునేందుకు కూడా అనువుగా ఎన్‌జిఎల్‌వి రూపొందనున్న కారణంగా విశ్వాన్ని అందుకోవడానికి ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ రాకెట్ ను మండించడానికి పర్యావరణ హిత ఇంధనాలను మాత్రమే ఉపయోగించడం ఈ కొత్త వాహక నౌక ప్రత్యేకత.ఎస్ఎస్ఎల్‌వి-డి3ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
August 16th, 01:48 pm
కొత్త ఉపగ్రహ ప్రయోగ నౌక- ఎస్.ఎస్.ఎల్.వీ-డీ 3ని విజయవంతంగా ప్రయోగించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఖర్చు పరిమితం కావడం వల్ల ఇది అంతరిక్ష ప్రయోగాల్లో ముఖ్య భూమికను పోషిస్తుందని, ప్రైవేటు రంగానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు.