బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు 2022లో పాల్గొనే క్రీడాకారులతో ప్రధాన మంత్రి సంభాషణ
August 13th, 11:31 am
మీ అందరితో ప్రత్యక్షం గా మాట్లాడడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది కానీ అందరితో మాట్లాడడం సాధ్యం కాదు. కానీ మీలో చాలా మందికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యే అవకాశం నాకు లభించింది. లేదా ఏదైనా సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు నా ఇంటికి కుటుంబ సభ్యుడిలా రావడానికి సమయం కేటాయించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు సాధించిన విజయాలకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. ఈ విషయంలో మీతో సహకరించగలిగినందుకు నేను కూడా గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం.కామన్‌వెల్త్ గేమ్స్-2022 భారత బృందానికి ప్రధానమంత్రి సత్కారం
August 13th, 11:30 am
కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)-2022లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో సత్కరించారు. వివిధ క్రీడల్లో పోటీపడిన క్రీడాకారులు, వారి శిక్షకులతోపాటు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలు, సమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇటీవల ముగిసిన ఈ క్రీడలలో భారతదేశానికి వివిధ విభాగాల్లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు లభించాయి. ఈ మేరకు పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి శిక్షకులను ప్రధానమంత్రి అభినందించారు. సీడబ్ల్యూజీ-2022లో క్రీడాకారుల, శిక్షకుల ప్రతిభా ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సాధించిన విజయాలు తమకు గర్వకారణమని అభివర్ణించారు. క్రీడాకారుల అద్భుత కృషి వల్ల దక్కిన అద్భుత విజయాలతో దేశం స్వాతంత్ర్య అమృత కాలంలో ప్రవేశించడం గర్వించదగిన అంశమని ప్రధాని పేర్కొన్నారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
August 08th, 08:25 am
బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. కామన్ వెల్థ్ గేమ్స్ లో శ్రీ శ్రీకాంత్ కిదాంబి నాలుగో పతకం సాధించడం పట్ల కూడా ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.2021వ సంవత్సర ప్రపంచ చాంపియన్ శిప్ పోటీల లో బాడ్ మింటన్ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీకిదాంబి శ్రీకాంత్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
December 20th, 02:17 pm
2021వ సంవత్సర ప్రపంచ చాంపియన్ శిప్ పోటీల లో బాడ్ మింటన్ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ కిదాంబి శ్రీకాంత్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సీరీస్ గెలిచిన బాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ ను అభినంధించిన ప్రధాని
June 25th, 07:57 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ గెలుచుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాబి శ్రీకాంత్ ను అభినంధించారు. “ఆస్ట్రేలియన్ ఓపెన్లో కిదాబి శ్రీకాంత్ విజయం సాధించినందుకు మేము నిజంగా గర్వంగా ఉన్నాం, మరో అద్భుత విజయం కోసం నేను ఆయనను అభినందింస్తున్నాను'అని ప్రధానమంత్రి అన్నారు.1975 లో అత్యవసర పరిస్థితి మన ప్రజాస్వామ్యానికి చీకటి రాత్రి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 25th, 12:21 pm
1975 జూన్ లో అత్యవసర పరిస్థితిని విధించిన భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి కాలం అని మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల హక్కులను వారి స్వరాన్ని పెంచిన వేలాదిమంది ప్రజల హక్కులు ఎలా స్వాధీనం చేసుకున్నారని జైలు శిక్ష విధించారని వివరిస్తూ ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు, ప్రధాని మోదీ కూడా పరిశుభ్రతను, ఇటీవల జరిగిన యోగా మూడవ అంతర్జాతీయ దినోత్సవం, అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం మరియు క్రీడల శక్తిని హైలైట్ చేశారు,