శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీ 80వ జన్మదిన వేడుకల సందర్భంగా - ప్రధానమంత్రి సందేశం
May 22nd, 01:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీ 80వ జన్మదిన వేడుకలను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ శుభ సందర్బంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీ మరియు ఆయన అనుచరులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 'హనుమత్-ద్వార్' ప్రవేశ తోరణాన్ని సాధువులు, ప్రత్యేక అతిథులు అంకితం చేయడాన్ని కూడా శ్రీ మోదీ గుర్తించారు.శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీ 80వ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి సందేశం
May 22nd, 11:36 am
కొన్ని సంవత్సరాల క్రితం నాకు దత్త పీఠాన్ని సందర్శించే అవకాశం వచ్చింది. అప్పుడే ఈ కార్యక్రమానికి రావాలని నన్ను అడిగారు. మీ ఆశీర్వాదం కోసం మళ్లీ వస్తానని ఆ సమయంలోనే నిర్ణయించుకున్నాను కానీ రాలేకపోయాను. నాకు ఈరోజు జపాన్ పర్యటన ఉంది. దత్త పీఠం యొక్క ఈ గొప్ప కార్యక్రమంలో నేను భౌతికంగా లేకపోవచ్చు, కానీ నా ఆత్మ మరియు మనస్సు మీతో ఉన్నాయి.