There is no losing in sports, only winning or learning: PM Modi
November 01st, 07:00 pm
PM Modi interacted with and addressed India's Asian Para Games contingent at Major Dhyan Chand National Stadium, in New Delhi. The programme is an endeavor by the Prime Minister to congratulate the athletes for their outstanding achievement at the Asian Para Games 2022 and to motivate them for future competitions. Addressing the para-athletes, the Prime Minister said, You bring along new hopes and renewed enthusiasm whenever you come here.ఆసియన్ పారా గేమ్స్ 2022లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
November 01st, 04:55 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో భారతదేశపు ఆసియా పారా గేమ్స్ బృందంతో సంభాషించారు. మరియు ప్రసంగించారు. ఆసియన్ పారా గేమ్స్ 2022లో అత్యుత్తమ విజయాలు సాధించిన క్రీడాకారులను అభినందించేందుకు, భవిష్యత్తులో జరిగే పోటీల కోసం వారిని ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు.India is eager to host the Olympics in the country: PM Modi
October 14th, 10:34 pm
PM Modi inaugurated the 141st International Olympic Committee (IOC) Session in Mumbai. Addressing the event, the Prime Minister underlined the significance of the session taking place in India after 40 years. He also informed the audience that India is eager to host the Olympics in the country and will leave no stone unturned in the preparation for the successful organization of the Olympics in 2036. This is the dream of the 140 crore Indians, he added.ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) 141వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
October 14th, 06:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సమావేశాన్ని ప్రారంభించారు. క్రీడా రంగానికి చెందిన వివిధ భాగస్వాముల మధ్య పరస్పర సంప్రదింపులు, అనుభవాల ఆదానప్రదానానికి ఇది వేదికను సమకూరుస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని వివరించారు. ఇదే సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని క్రికెట్ మైదానంలో ఇవాళ జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిందని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన వెల్లడించారు. అలాగే “ఈ చరిత్రాత్మక విజయంపై భారత జట్టుతోపాటు భారతీయులందరికీ నా అభినందనలు” అని ప్రధాని ప్రకటించారు.Sansad Khel Pratiyogita is a great medium to unearth talented individuals and hone their skills for the nation: PM Modi
October 13th, 01:00 pm
PM Modi addressed the concluding ceremony of Amethi Sansad Khel Pratiyogita 2023 via video message. Noting that this month is auspicious for sports in the country as Indian players have scored a century of medals in the Asian Games, PM Modi pointed out that many players from Amethi have also showcased their sporting talent amidst these events by taking part in Amethi Sansad Khel Pratiyogita.అమేఠీ సాంసద్ఖేల్ ప్రతియోగిత 2023 ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 13th, 12:40 pm
అమేఠీ సాంసద్ ఖేల్ ప్రతియోగిత 2023 యొక్క ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.Varanasi's International Cricket Stadium will become a symbol of India in future: PM Modi
September 23rd, 02:11 pm
The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone of International Cricket Stadium in Varanasi today. The modern international cricket stadium will be developed in Ganjari, Rajatalab, Varanasi at a cost of about Rs 450 crores and spread across an area of more than 30 acres.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
September 23rd, 02:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగరంలోని గంజారి పరిధిలోగల రాజాతాలాబ్ ప్రాంతంలో రూ.450 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక స్టేడియం రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ- వారణాసిని మరోసారి సందర్శించే అవకాశం లభించినందుకు ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ నగర సందర్శనలోని ఆనందానుభూతి మాటల్లో చెప్పలేనిదని వ్యాఖ్యానించారు. గత నెల 23న చంద్రునిపై ‘శివశక్తి’ ప్రదేశానికి చంద్రయాన్ ద్వారా భారత్ చేరుకున్న సరిగ్గా నెల తర్వాత ఈ నెలలే అదే తేదీన కాశీని సందర్శిస్తున్నానని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. “శివశక్తి ప్రదేశం ఒకటి చంద్రునిపై ఉంటే.. మరొకటి ఇక్కడ కాశీ నగరంలో ఉంది” అని చంద్రయాన్ మహత్తర విన్యాసంపై ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ ప్రధాని వ్యాఖ్యానించారు.ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 3వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 25th, 10:16 pm
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, నా మంత్రివర్గ సహచరుడు నిసిత్ ప్రామాణిక్ గారు, ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సిఎం బ్రిజేష్ పాఠక్ గారు, ఇతర ప్రముఖులు ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ అభినందనలు. నేడు యుపి దేశం నలుమూలల నుండి యువ క్రీడా ప్రతిభావంతుల సంగమంగా మారింది. ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ లో పాల్గొంటున్న 4,000 మంది క్రీడాకారుల్లో ఎక్కువ మంది వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందినవారే. నేను ఉత్తరప్రదేశ్ ఎంపీని. నేను ఉత్తరప్రదేశ్ ప్రజల ప్రతినిధిని. అందుకే యూపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా 'ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్'లో పాల్గొనేందుకు యూపీకి వచ్చిన క్రీడాకారులందరికీ ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాను.క్రీడా భారతం 3వ విశ్వవిద్యాలయ క్రీడలను ప్రారంభించిన ప్రధానమంత్రి
May 25th, 07:06 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా క్రీడా భారతం (ఖేలో ఇండియా) 3వ విశ్వవిద్యాలయ క్రీడలు-2023ను ప్రారంభించారు. దేశంలోని 200కుపైగా విశ్వవిద్యాలయాల నుంచి 4750 మంది క్రీడాకారులు మొత్తం 21 క్రీడాంశాల్లో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు. ఈ క్రీడల నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ప్రధాని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉత్తరప్రదేశ్ నేడు క్రీడా-ప్రతిభా సంగమంగా మారిందని వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి 4000 మందికిపైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యునిగా వారందర్నీ ప్రత్యేకంగా స్వాగతిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.మణిపూర్‌లోని ఇంఫాల్‌లో యువజన వ్యవహారాలు ,రాష్ట్రాలు/యుటిల క్రీడల మంత్రుల 'చింతన్ శివిర్'లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 24th, 10:10 am
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరుడు అనురాగ్ ఠాకూర్ జీ, రాష్ట్రాల యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు,మణిపూర్‌లోని ఇంఫాల్‌లో రాష్ట్ర/యూటీల క్రీడా-యువజన వ్యవహారాలశాఖ మంత్రుల ‘మేధోమథన శిబిరం’లో ప్రధానమంత్రి ప్రసంగం
April 24th, 10:05 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మణిపూర్‌లోని ఇంఫాల్‌లో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడా-యువజన వ్యవహారాలశాఖ మంత్రుల మేధోమథన శిబిరాన్ని ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు.ఉత్తరప్రదేశ్ లోని బస్తీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2వ సన్సద్ ఖేల్ మహాకుంభ్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
January 18th, 04:39 pm
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, పార్లమెంటులో నా సహచరుడు నా యువ మిత్రుడు భాయ్ హరీష్ ద్వివేది గారు, వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇతర సీనియర్ ప్రముఖులు మరియు నా చుట్టూ యువకులు ఉండడం నేను చూస్తున్నాను. నా ప్రియమైన సోదర సోదరీమణులారా.బస్తీ జిల్లా లో సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 రెండో దశ ను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యంద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 18th, 01:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 లో భాగం అయిన రెండో దశ ను ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. సాంసద్ ఖేల్ మహాకుంభ్ ను బస్తీ జిల్లా లో పార్లమెంట్ సభ్యుడు శ్రీ హరీశ్ ద్వివేదీ 2021 వ సంవత్సరం నుండి ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కుస్తీ, కబడ్డీ, ఖో ఖో, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, చదరంగం, కేరమ్స్, బాడ్ మింటన్, టెబుల్ టెనిస్ మొదలైన ఇండోర్ మరియు అవుట్ డోర్ స్పోర్ట్ స్ లో వివిధ పోటీల ను ఖేల్ మహాకుంభ్ లో భాగం గా నిర్వహిస్తుంటారు. ఇవి గాక విడి గా, వ్యాస రచన, చిత్రలేఖనం, రంగవల్లుల ను తీర్చిదిద్దడం వంటి వాటి లో పోటీల ను కూడా ఖేల్ మహాకుంభ్ లో భాగం గా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.