
శుభాన్షు శుక్లాతో ప్రధాని సంభాషణ
August 19th, 09:43 am
తప్పకుండా మీకో భిన్నమైన అనుభవమే కదా ఇది. మీ అనుభూతులను తెలుసుకోవాలనుకుంటున్నాను.
అంతరిక్ష యాత్రికుడు శ్రీ శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 19th, 09:42 am
రోదసీ యాత్రికుడు శ్రీ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న న్యూ ఢిల్లీలో సమావేశమయ్యారు. అంతరిక్ష యానం అందించిన పరివర్తనాత్మక అనుభవాన్ని గురించి ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, అలాంటి ముఖ్య ప్రస్థానాన్ని చేపట్టి ముగించిన తరువాత ఎవరైనా మార్పును అనుభూతి చెందితీరుతారన్నారు. ఈ మార్పు తాలూకు అనుభవాన్ని వ్యోమగాములు ఎలా అర్థం చేసుకుంటారో తెలుసుకోవాలని ఉందని శ్రీ మోదీ అన్నారు. శ్రీ శుభాంశు శుక్లా జవాబిస్తూ, రోదసిలో స్థితి అచ్చంగా వేరేగా ఉంటుందని, భూమ్యాకర్షణ శక్తి లోపించడం దీనికి ఒక కీలక కారణమన్నారు.
భారత ప్రధానమంత్రి, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంయుక్త ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు తెలుగు అనువాదం
August 05th, 11:06 am
భారతదేశానికి వచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, ఆయన బృందానికి మొదట హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. ఈ ఏడాది భారత్, ఫిలిప్పీన్స్ 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకలను జరుపుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మన దౌత్య సంబంధాలు ఈమధ్యే ప్రారంభమైనవైనప్పటికీ, మన నాగరికతల బంధం చాలా పురాతనమైనది. ఫిలిప్పీన్స్ రామాయణ రూపం అయిన మహారదియా లవానా మన సాంస్కృతిక సంబంధాల ప్రత్యేకతను తెలియజెబుతుంది. ఇరుదేశాల జాతీయ పుష్పాలతో విడుదల చేసిన తపాలా స్టాంపులు మన స్నేహ పరిమళాన్ని ప్రతిబింబిస్తున్నాయి.2047లో అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం స్వావలంబన ద్వారానే సాగుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
July 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన దేశ సాఫల్యాల గురించి, మన ప్రజల విజయాల గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని వారాల్లో – క్రీడలలోనైనా, శాస్త్రవిజ్ఞానంలోనైనా, సంస్కృతిలోనైనా – ఎన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేసిన విషయాలివి. శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకొని భూమిపైకి ఇటీవల విజయవంతంగా తిరిగివచ్చిన సందర్భాన్ని దేశం యావత్తూ ఎంతో ఉత్సాహంగా గమనించింది. ఆయన భూమి పైకి తిరిగివచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా సంతోషాల వెల్లువ పెల్లుబికింది. ప్రతి హృదయంలో ఆనంద తరంగాలు పుట్టుకొచ్చాయి. దేశం అంతా గర్వంతో ఉప్పొంగిపోయింది. నాకు గుర్తుంది.... 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ అయిన తర్వాత దేశంలో శాస్త్రవిజ్ఞానం పట్ల, అంతరిక్ష పరిశోధన పట్ల ఒక కొత్త ఆసక్తి పిల్లల్లో ఏర్పడింది. తాము కూడా అంతరిక్ష యాత్ర చేస్తామని, చంద్రునిపై దిగుతామని, అంతరిక్ష శాస్త్రవేత్తలం అవుతామని ఇప్పుడు చిన్నారులు కూడా చెప్తున్నారు.పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని ప్రసంగం
July 21st, 10:30 am
రుతుపవనాలు కొత్తదనానికి, సృష్టికి ప్రతీక. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా వాతావరణం అనుకూలంగా ఉంది. ఇది వ్యవసాయానికి లాభదాయకమైన సీజన్ అని వార్తలొస్తున్నాయి. మన రైతుల ఆర్థిక స్థితిగతుల్లోనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో, ఇంకా ప్రతి ఇంటి ఆర్థిక స్థితిగతుల్లోనూ వర్షం కీలక పాత్ర పోషిస్తుంది. నాకు అందిన సమాచారం ప్రకారం.. గత పదేళ్లలో నమోదైన నీటి నిల్వ కన్నా ఈ ఏడాది దాదాపు మూడు రెట్లు అధికంగా ఉంది. మున్ముందు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదెంతో ప్రయోజనం చేకూరుస్తుంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ
July 21st, 09:54 am
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలలో, ఆయన భయంకరమైన పహల్గామ్ మారణహోమాన్ని ప్రస్తావించారు మరియు పాకిస్తాన్ పాత్రను బహిర్గతం చేయడంలో భారతదేశ రాజకీయ నాయకత్వం యొక్క ఐక్య స్వరాన్ని ప్రశంసించారు. డిజిటల్ ఇండియా, ముఖ్యంగా యుపిఐ యొక్క ప్రపంచ గుర్తింపును కూడా ప్రధాని గుర్తించారు. నక్సలిజం మరియు మావోయిజం క్షీణిస్తున్నాయని ఆయన ధృవీకరించారు మరియు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని కూడా ప్రశంసించారు.చరిత్రాత్మక అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి
July 15th, 03:36 pm
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చరిత్రాత్మక యాత్ర చేపట్టి, భూమికి తిరిగివచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. ఐఎస్ఎస్ చేరుకున్న తొలి భారతీయ వ్యోమగామిగా కెప్టెన్ శుక్లా సాధించిన విజయం అసాధారణమైందని, దేశ అంతరిక్ష ప్రయాణంలో ఇదొక కీలక ఘట్టమని ప్రశంసించారు.బ్రెజిల్ అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం
July 09th, 06:02 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రెజిలియాలో అధికారిక పర్యటన చేపడుతున్నారు. బ్రెజీలియాలోని అల్వరాడో ప్యాలెస్‌లో బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో ఈ రోజు సమావేశమయ్యారు. అధ్యక్షుడు లూలా ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు.బ్రెజిల్ అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
July 08th, 08:30 pm
రియో, బ్రెజీలియాలో ఆత్మీయ స్వాగతం పలికిన నా స్నేహితుడు, అధ్యక్షుడు లూలాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెజాన్ ప్రకృతి సౌందర్యం, మీ ఆత్మీయత మమ్మల్ని మంత్రముగ్ధులను చేశాయి.బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం: అంతర్జాతీయ పాలనలో సంస్కరణ
July 06th, 09:41 pm
17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న అధ్యక్షుడు లూలాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రెజిల్ నాయకత్వంలో మన బ్రిక్స్ సహకారం కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని సంతరించుకుంది. మనలో నిండిన ఈ శక్తి ఎస్‌ప్రెసో కాదు.. డబుల్ ఎస్‌ప్రెసో షాట్ లాంటిది. ఈ విషయంలో నేను అధ్యక్షుడు లూలా దార్శనికతను, ఆయన అచంచలమైన విశ్వాసాన్ని అభినందిస్తున్నాను. బ్రిక్స్ కుటుంబంలో ఇండోనేషియా చేరిన నేపథ్యంలో నా స్నేహితుడు, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవోకు భారత్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.బహుపాక్షిక సంబంధాలు, ఆర్థిక-ద్రవ్య సహాయ విషయాల పటిష్ఠీకరణతో పాటు కృత్రిమ మేధపై బ్రిక్స్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రకటన పాఠం..
July 06th, 09:40 pm
బ్రిక్స్ కుటుంబానికి చెందిన మిత్ర దేశాల నేతలతో కలసి ఈ సమావేశంలో పాలుపంచుకొంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. లాటిన్ అమెరికా, ఆఫ్రికాలతో పాటు ఆసియాలోని మిత్రదేశాల నేతలతో నా ఆలోచనలను పంచుకొనేందుకు బ్రిక్స్ అవుట్‌రీచ్ సమ్మిట్‌లో ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలాకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని
July 06th, 09:39 pm
బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. నిన్న ప్రారంభమైన ఈ సదస్సు ఈరోజు కూడా జరుగుతోంది. అంతర్జాతీయ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్ వాణిని విస్తరించడం, శాంతి భద్రతలు, బహుపాక్షిక విధానాన్ని బలోపేతం చేయడం, అభివృద్ధి సమస్యలు, కృత్రిమ మేధతో సహా బ్రిక్స్ అజెండాకు సంబంధించిన వివిధ అంశాలపై నాయకులు ఫలప్రదమైన చర్చలు జరిపారు. సదస్సును విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఆత్మీయ ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ అధ్యక్షునికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.ట్రినిడాడ్, టొబాగో దేశంలోని ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 04th, 05:56 am
ఈ సాయంత్రం వేళ ఇలా మీ అందరినీ కలవడం గర్వాన్నీ, అమితానందాన్నీ ఇస్తోంది. చక్కని ఆతిథ్యమిచ్చి, నా గురించి ఆత్మీయంగా మాట్లాడిన ప్రధానమంత్రి కమ్లా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!ట్రినిడాడ్ టొబాగోలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 04th, 04:40 am
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ మోదీని ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసా స్వాగతిస్తూ, ట్రినిడాడ్ టొబాగోలో అత్యున్నత జాతీయ పురస్కారమైన ‘‘ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో’’తో ఆయనను సత్కరించనున్నట్లు ప్రకటించారు. ఈ గౌరవాన్ని తనకు ఇస్తున్నందుకు ఆమెతో పాటు ట్రినిడాడ్ టొబాగో ప్రజానీకానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలను ప్రధానమంత్రి తెలియజేశారు.ఘనా పార్లమెంటునుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 03rd, 03:45 pm
ప్రజాస్వామ్య స్ఫూర్తి, గౌరవం, దృఢత్వంతో తొణికిసలాడే ఘనా దేశాన్ని సందర్శించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రతినిధిగా, నా వెంట 1.4 బిలియన్ భారతీయుల శుభాకాంక్షలను తీసుకువచ్చాను.ఘనా పార్లమెంటులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 03rd, 03:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఘనా పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. పార్లమెంట్ స్పీకర్ గౌరవనీయ అల్బన్ కింగ్స్ఫోర్డ్ సుమనా బాగ్బిన్ నిర్వహించిన ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ఇరు దేశాల నుంచి విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ ప్రసంగం భారత్-ఘనా సంబంధాల్లో ఒక ముఖ్యమైన సందర్భంగా నిలిచింది. ఇది రెండు దేశాలను ఏకం చేసే పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించింది.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న కెప్టెన్ శుభాంశు శుక్లాతో ముచ్చటించిన ప్రధానమంత్రి
June 28th, 08:24 pm
ఈ రోజు మీరు మీ మాతృభూమి భారత్కు దూరంలో ఉన్నా.. భారతీయులందరి హృదయాలకు దగ్గరగా ఉన్నారు. మీ పేరులోనే శుభం ఉంది. అందువల్ల మీ ఈ ప్రయాణం శుభప్రదమైన నవ శకానికి నాంది పలికింది. ఈ సమయంలో మనిద్దరమే ఇలా మాట్లాడుకుంటున్నప్పటికీ మొత్తం 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలూ నాతో ఉన్నాయి. నా గొంతు భారతీయులందరి ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. అంతరిక్షంలో భారత పతాకాన్ని ఎగురవేసినందుకు మీకు నా అభినందనలు. అక్కడ అంతా బాగానే ఉందా? మీరు బాగానే ఉన్నారా?ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
June 28th, 08:22 pm
భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. శుభాంశు శుక్లా ప్రస్తుతం మాతృభూమికి అత్యంత దూరంలో ఉన్నప్పటికీ, ఆయన భారతీయులందరి హృదయాలకు అత్యంత చేరువలో ఉన్నారని ప్రధానమంత్రి అన్నారు. శుభాంశు పేరు స్వయంగా శుభప్రదమైనదని, ఆయన ప్రయాణం కొత్త శకానికి నాంది పలికిందని పేర్కొన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ అయినప్పటికీ, 140 కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలు, ఉత్సాహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు. శుభాంశుతో మాట్లాడుతున్న ఈ స్వరం యావత్ దేశపు సమష్టి ఉత్సాహం, గర్వాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అంతరిక్షంలో భారతదేశ జెండాను ఎగురవేసిన శుభాంశుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాంశు ఆరోగ్య పరిస్థితి గురించి, అంతరిక్ష కేంద్రంలో అంతా బాగానే ఉందా అని అడిగి తెలుసుకున్నారు.ఘనా, ట్రినిడాడ్ - టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి (జూలై 02 - 09)
June 27th, 10:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనాలో ఇదే ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించడం.. ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, అభివృద్ధిలో సహకారాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఘనా అధ్యక్షుడితో ప్రధానమంత్రి చర్చించనున్నారు. ఈ పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడం, ఈసీవోడబ్ల్యూఏఎస్ (ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్), ఆఫ్రికన్ యూనియన్లతో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.భారత్, హంగేరీ, పోలాండ్, అమెరికా వ్యోమగాములతో కూడిన స్పేస్ మిషన్ విజయవంత ప్రయోగం పట్ల ప్రధానమంత్రి హర్షం
June 25th, 01:30 pm
భారత్, హంగేరీ, పోలాండ్, అమెరికా వ్యోమగాములతో కూడిన స్పేస్ మిషన్ విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.