
2025 కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన ప్రారంభం: కేవలం 15 రోజుల్లోనే దార్శనికతను వాస్తవంలోకి మార్చడం
January 16th, 02:18 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 సంవత్సరాన్ని అనేక పరివర్తనాత్మక కార్యక్రమాలతో ప్రారంభించారు, ప్రగతిశీల, స్వావలంబన మరియు ఐక్య భారతదేశం కోసం తన దార్శనికతను ప్రదర్శించారు. మౌలిక సదుపాయాలు మరియు శాస్త్రీయ పరిశోధనలను అభివృద్ధి చేయడం నుండి యువతకు సాధికారత కల్పించడం మరియు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకోవడం వరకు, ఆయన నాయకత్వం రాబోయే అద్భుతమైన సంవత్సరానికి నాంది పలికింది.
జమ్ముాకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ టన్నెల్ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
January 13th, 12:30 pm
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు, నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ గారు, జితేంద్ర సింగ్ గారు, అజయ్ తమ్తా గారు, ఉప ముఖ్యమంత్రి సురేందర్ కుమార్ చౌదరి గారు, ప్రతిపక్ష నేత సునీల్ శర్మ గారు, అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన జమ్మూకశ్మీర్ సోదరసోదరీమణులారా…
జమ్మూ కాశ్మీర్ లో సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
January 13th, 12:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్ లో సోనామార్గ్ సొరంగ (టన్నెల్) మార్గాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్, భారత్ అభివృద్ధి కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శ్రమించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. సవాళ్లు ఎదురైనా మన సంకల్పం ఏమాత్రం తగ్గలేదని శ్రీ మోదీ అన్నారు. కార్మికులు సంకల్పంతో, నిబద్ధతతో అన్ని అడ్డంకులను అధిగమించి పనులు పూర్తి చేశారని కొనియాడారు. ఏడుగురు కార్మికుల మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు.సొరంగం ప్రారంభోత్సవం కోసం జమ్ముకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ వెళ్లేందుకు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాను: ప్రధానమంత్రి
January 11th, 06:30 pm
జడ్-మోర్ సొరంగం ప్రారంభోత్సవం కోసం జమ్ముకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ వెళ్లడానికి తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.జనవరి 13న జమ్మూ కాశ్మీర్ లో సోనామార్గ్ టన్నెల్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధానమంత్రి
January 11th, 05:41 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 13న జమ్మూశ్మీర్ లోని సోనామార్గ్ ను సంద ర్శించనున్నారు. ఆరోజు ఉదయం 11.45 గంటలకు సోనామార్గ్ టన్నెల్ ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా జరిగే సభలో ప్రధాని ప్రసంగిస్తారు.