మాకు, చరిత్ర మరియు విశ్వాసం యొక్క సారాంశం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్: ప్రధాని మోదీ

August 20th, 11:01 am

గుజరాత్ లోని సోమనాథ్ లో పిఎం మోడీ బహుళ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. గౌరవనీయమైన దేవాలయ చరిత్రను ప్రతిబింబిస్తూ, ప్రతి దాడి తరువాత దేవాలయం ఎలా పునరావృతమవుతుందో మరియు ఆలయం ఎలా పుంజుకుంటుందో ప్రధాని గుర్తు చేశారు. ఇది ఒక చిహ్నం సత్యాన్ని అబద్ధం ద్వారా ఓడించలేము మరియు విశ్వాసాన్ని భీభత్సం ద్వారా అణిచివేయలేము అనే నమ్మకం అని ప్రధాని అన్నారు.

సోమ‌నాథ్ లో బ‌హుళ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి

August 20th, 11:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా గుజ‌రాత్ లోని సోమ‌నాథ్ లో ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించి, శంకుస్థాప‌న చేశారు. సోమ‌నాథ్ విహార‌యాత్రా కేంద్రం, సోమ‌నాథ్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్, పాత (జునా) సోమ‌నాథ్ లో పున‌ర్నిర్మించిన దేవాల‌యం ఆ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. దీనికి తోడు ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ పార్వ‌తి దేవాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. శ్రీ లాల్ కృష్ణ అద్వానీ, కేంద్ర హోం మంత్రి, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, ఉప‌ముఖ్య‌మంత్రి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

సోమనాథ్ లో అనేక పథకాల ను ఆగస్టు 20 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; కొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేస్తారు

August 18th, 05:57 pm

గుజరాత్ లోని సోమనాథ్ లో అనేక పథకాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 20 న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఇదే సందర్భం లో మరికొన్ని పథకాల కు ఆయన శంకుస్థాపన కూడా చేస్తారు. ప్రారంభం కానున్న పథకాల లో సోమనాథ్ విహార స్థలం, సోమనాథ్ ప్రదర్శన కేంద్రం లతో పాటు పునర్ నిర్మాణం జరిగిన పాత సోమనాథ్ (జూనా) ఆలయం ఆవరణ కూడా కలసి ఉన్నాయి. ఇదే కార్యక్రమం లో భాగం గా శ్రీ పార్వతి ఆలయ నిర్మాణానికి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.