'ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కే ఓర్' కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 20th, 10:31 am

కార్యక్రమంలో మాతో పాటు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా జీ, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్‌రాజ్ మిశ్రా జీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ కిషన్ రెడ్డి జీ, భూపేందర్ యాదవ్ జీ, అర్జున్ రామ్ మేఘవాల్ జీ, పురుషోత్తమ్ రూపాలా జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ, రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ గులాబ్ చంద్ కటారియా జీ, బ్రహ్మ కుమారీల కార్యనిర్వాహక కార్యదర్శి రాజయోగి మృత్యుంజయ జీ, రాజయోగిని సోదరి మోహిని సోదరి చంద్రికా జీ, బ్రహ్మ కుమారీల సోదరీమణులు, లేడీస్ అండ్ జెంటిల్మన్, యోగులందరూ!

‘ఆజాదీ కె అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’యొక్క జాతీయ ప్రారంభ కార్యక్రమం లో కీలకోపన్యాసాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి

January 20th, 10:30 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’ జాతీయ ప్రారంభ కార్యక్రమం లో ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు. ఆయన బ్రహ్మ కుమారీస్ యొక్క ఏడు కార్యక్రమాల కు జెండా ను కూడా చూపెట్టారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్ రాజ్ మిశ్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గహ్ లోత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ భూపేందర్ యాదవ్, శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్, శ్రీ పర్ శోత్తమ్ రూపాలా, ఇంకా శ్రీ కైలాస్ చౌధరి తదితరులు ఉన్నారు.

జాతీయ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ మిష‌న్‌- ‘ఆయుష్మాన్ భార‌త్’ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

March 21st, 09:31 pm

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం, కొత్త‌గా కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కమైన ‘ఆయుష్మాన్ భార‌త్ – జాతీయ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ మిష‌న్‌’ (ఎబి- ఎన్‌హెచ్‌పిఎమ్) ను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌ శాఖ ప‌రిధి లో ఆయుష్మాన్ భార‌త్ మిశన్ లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వ కంపొనంట్‌ తో ఇది అమ‌లవుతుంది. ఈ ప‌థ‌కం లో ప్ర‌తి పేద కుటుంబానికి ఏడాదికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ప్ర‌యోజ‌నంతో కూడిన క‌వ‌రేజ్ ల‌భిస్తుంది. ఎస్‌ఇసిసి సమాచార నిధి ప్ర‌కారం ఈ ప‌థ‌కం కింద ప్ర‌యోజ‌నం పొంద‌నున్న పేద‌ల కుటుంబాల సంఖ్య 10 కోట్లుగా ఉండ‌నుంది. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజ‌న‌ (ఆర్‌ఎస్‌బివై), సీనియ‌ర్ సిటిజ‌న్స్ హెల్త్ స్కీమ్ (ఎస్‌సిహెచ్ ఐఎస్‌) ల‌ను ఎబి- ఎన్‌హెచ్‌పిఎమ్ లో విలీనం చేయనున్నారు.