భారతీయ ప్రవాసులు వివిధ దేశాల్లో తమదైన ముద్ర వేశారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

November 24th, 11:30 am

మన్ కీ బాత్ యొక్క 116వ ఎపిసోడ్‌లో, పీఎం మోదీ ఎన్సిసి డే యొక్క ప్రాముఖ్యతను చర్చించారు, ఎన్సిసి క్యాడెట్ల పెరుగుదల మరియు విపత్తు సహాయంలో వారి పాత్రను హైలైట్ చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం యువత సాధికారతను నొక్కి, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ గురించి మాట్లాడారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నావిగేట్ చేయడంలో సీనియర్ సిటిజన్‌లకు యువత సహాయం చేయడం మరియు ఏక్ పెద్ మా కే నామ్ క్యాంపెయిన్ విజయాన్ని కూడా ఆయన పంచుకున్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ-స్లొవాక్‌ రిపబ్లిక్‌ ప్రధాని గౌరవనీయ ఎడ్వర్డ్ హెగర్‌ల మధ్య ఫోన్‌ సంభాషణ

February 28th, 09:48 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ స్లొవాక్‌ రిపబ్లిక్‌ ప్రధాని గౌరవనీయ ఎడ్వర్డ్ హెగర్‌తో ఫోన్‌ద్వారా సంభాషించారు. ఉక్రెయిన్‌ నుంచి భారత పౌరులను తరలించడంలో సహకరించడంపై ఈ సందర్భంగా గౌరవనీయ ఎడ్వర్డ్ హెగర్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారతదేశం నుంచి ప్రత్యేక తరలింపు విమానాలను అనుమతించడంపైనా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో స్లొవాక్‌ రిపబ్లిక్‌ నుంచి నిరంతర సహాయం కోరారు. అదే సమయంలో సంఘర్షణ ప్రాంతాల నుంచి ఇతర దేశాల పౌరులను తరలించే ప్రక్రియను కూడా భారత్‌ చేపట్టింది.

ల‌ఖ్‌ నవూ లో ఫిబ్రవరి 21న ‘ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్’ ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

February 20th, 07:34 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ 2018’ ని రేపు లఖ్‌న‌వూ లో ప్రారంభించ‌నున్నారు. ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నానికి శ్రీ‌ రాజ్‌నాథ్ సింగ్‌, శ్రీ‌ అరుణ్ జైట్లీ, శ్రీ‌ నితిన్ గ‌డ్క‌రీ, శ్రీ‌ సురేశ్ ప్ర‌భు, శ్రీ‌ ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్‌, డాక్ట‌ర్ హ‌ర్ష్ వ‌ర్ధన్‌, శ్రీ‌ వి.కె. సింగ్‌, శ్రీ‌ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీతార‌మ‌ణ్‌, శ్రీ‌మ‌తి స్మృతి ఇరానీ లు సహా ప‌లువురు కేంద్ర మంత్రులు హాజ‌రై, రాష్ట్రం లోకి పెట్టుబ‌డును ఆక‌ర్షించేందుకుగాను ఉద్దేశించినటువంటి వివిధ స‌ద‌స్సుల‌కు అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్నారు. శిఖ‌ర స‌మ్మేళ‌నాన్ని ఫిబ్ర‌వ‌రి 21 నాడు ప్ర‌ధాన మంత్రి ప్రారంభించనుండ‌గా, ఈ స‌మ్మేళ‌నం ముగింపు ఉత్స‌వంలో రాష్ట్రప‌తి శ్రీ రామ్‌ నాథ్ కోవింద్ పాలుపంచుకోనున్నారు.