
అనువాదం: 17వ పౌర సేవల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
April 21st, 11:30 am
నా మంత్రివర్గ సహచరులు డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, శ్రీ శక్తికాంత దాస్ గారు, డాక్టర్ సోమనాథన్ గారు, ఇతర సీనియర్ అధికారులు, దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్‌కు చెందిన సహచరులు, మహిళలు, పెద్దలు.. !
17వ సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
April 21st, 11:00 am
ఈ రోజు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో 17వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్లనుద్దేశించి ప్రసంగించారు. ప్రజాపాలన (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానమంత్రి శ్రేష్ఠత అవార్డులను ప్రదానం చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ మోదీ, సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం రాజ్యాంగం 75వ సంవత్సరాల వేడుకలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా సివిల్ సర్వీసెస్ డే మరింత విశిష్ఠతను సంతరించుకుందన్నారు. అలనాడు 1947 ఏప్రిల్ 21న సర్దార్ పటేల్ చేసిన ప్రకటనను ఉటంకిస్తూ, సర్దార్ సివిల్ సర్వెంట్లను ‘భారత దేశ ఉక్కు కవచం’గా అభివర్ణించారని గుర్తు చేశారు. పూర్తి అంకితభావంతో పని చేస్తూ, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే పాలనా యంత్రాంగాన్ని పటేల్ కోరుకున్నారని చెప్పారు. వికసిత్ భారత్ ఆశయ సాకారంలో సర్దార్ పటేల్ ఆదర్శాలు దారిదీపాలంటూ, పటేల్ దార్శనికత, వారసత్వానికి హృదయపూర్వక నివాళి అర్పించారు.
హర్యానాలోని యమునా నగర్లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం/శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 14th, 12:00 pm
ప్రజాదరణ చూరగొన్న హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహరల్ లాల్, ఇందర్జీత్ సింగ్, శ్రీ క్రిషన్‌పాల్, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు-శాసనసభ సభ్యులు సహా నా ప్రియ సోదరీసోదరులారా... హర్యానాలోని సహోదరులారా... మీకందరికీ ఇవే మోదీ శుభాకాంక్షలు!హర్యానాలోని యమునానగర్ లో అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
April 14th, 11:54 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని యమునా నగర్లో పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హర్యానా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవిత్ర భూమి హర్యానాకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. ఇది సరస్వతీ మాత జన్మస్థలం, మంత్రాదేవి నివాసం, పంచముఖి హనుమాన్ జీ స్థానం, అలాగే పవిత్ర కపాలమోచన్ సాహిబ్ ఉన్న ప్రదేశంగా పేర్కొంటూ, హర్యానా సంస్కృతి, భక్తి అంకితభావ సంగమం అని ఆయన వర్ణించారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు. బాబాసాహెబ్ దార్శనికత, ప్రేరణ ఇప్పటికీ భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.నవ్కార్ మహామంత్ర దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 09th, 08:15 am
మనస్సు ప్రశాంతంగా ఉంది. మనస్సు స్థిరంగా ఉంది. శాంతి మాత్రమే ఉంది. అద్భుతమైన అనుభూతి. మాటలకు చాలనిది - ఆలోచనలకు అతీతమైనది - నవ్కార్ మహామంత్రం ఇంకా మనస్సులో మార్మోగుతోంది. నమో అరిహంతాణం. నమో సిద్ధాణం. నమో ఆయర్యాణం. నమో ఉవజ్ఝాయాణం. నమో లోయే సవ్వసాహుణం. ఒకే స్వరం, ఒకే ప్రవాహం, ఒకే శక్తి, ఎలాటి హెచ్చుతగ్గులూ లేవు. కేవలం స్థిరత్వం మాత్రమే. అంతా సమభావమే. అలాంటి చైతన్యం, ఒకే విధమైన లయ, అంతర్గతంగా ఒకే విధమైన కాంతి. నవ్కార్ మహామంత్రం ఆధ్యాత్మిక శక్తిని నేను ఇప్పటికీ అనుభూతి చెందుతున్నాను. కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ఇలాంటి సామూహిక మంత్రోచ్ఛారణకు సాక్షిగా ఉన్నాను. ఈ రోజు తిరిగి నాకు అదే స్థాయిలో అదే అనుభూతి కలిగింది. ఈ సారి లక్షలాది పవిత్రాత్మలు ఒకే చైతన్యంతో కలిశాయి. ఒకే మాటలు కలసి పలికాయి. ఒకే శక్తి కలసి మేల్కొంది. భారత్‌లోనే కాదు - విదేశాల్లోనూ కూడా. ఇది నిజంగా అపూర్వమైన సంఘటన.నవ్కార్ మహామంత్ర దివస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 09th, 07:47 am
న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఈరోజు ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ్ కర్ మహామంత్ర దివస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మానసిక శాంతిని, స్థిరచిత్తాన్ని అందించే సామర్థ్యం గల నవ్ కర్ మంత్రం.. దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుందని అన్నారు. మంత్ర పఠనం వల్ల సిద్ధించే నిర్వికార స్థితి మాటలకు, ఆలోచనలకు అతీతమైనదని, చేతనలో, అంతరాత్మలో ఆ భావన స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందని అన్నారు. పవిత్రమైన నవ్కార్ మంత్రంలోని పంక్తులను చదివి వినిపించిన శ్రీ మోదీ- సంయమనం, స్థితప్రజ్ఞత, మనసు-అంతరాత్మల మధ్య సమన్వయం సాధించే నిరంతరాయ శక్తిప్రవాహంగా మంత్రశక్తిని అభివర్ణించారు. తన సొంత ఆధ్యాత్మిక అనుభూతిని గురించి చెబుతూ, నవ్ కర్ మంత్రం ఇప్పటికీ తన అంతరాళాల్లో ప్రభావాన్ని చూపుతూనే ఉందన్నారు. కొన్నేళ్ళ కిందట బెంగుళూరులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన సామూహిక మంత్ర పఠన ప్రభావం ఇప్పటికీ తనని వీడి పోలేదన్నారు. దేశ విదేశాల్లోని పవిత్ర హృదయాలు ఒకే చైతన్యంతో ఒక సామూహిక అనుభవంలో భాగమవడం తిరుగులేని అనుభూతి అని సంతోషం వెలిబుచ్చారు. ఈ సామూహిక చర్య ద్వారా ఒకే లయలో ఒదిగే పంక్తుల పఠనం అసాధారమైన శక్తిని వెలువరించి మాటల్లో చెప్పలేని దివ్యానుభూతిని కలిగిస్తుందని శ్రీ మోదీ చెప్పారు.When growth is driven by aspirations, it becomes inclusive and sustainable: PM Modi at Rising Bharat Summit
April 08th, 08:30 pm
PM Modi addressed the News18 Rising Bharat Summit. He remarked on the dreams, determination, and passion of the youth to develop India. The PM highlighted key initiatives, including zero tax on income up to ₹12 lakh, 10,000 new medical seats and 6,500 new IIT seats, 50,000 new Atal Tinkering Labs and over 52 crore Mudra Yojana loans. The PM congratulated the Parliament for enacting Waqf law.న్యూస్18 ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
April 08th, 08:15 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో న్యూస్ 18 నిర్వహించిన ‘ఉషోదయ భారత్ శిఖరాగ్ర సదస్సు’ (రైజింగ్ భారత్ సమ్మిట్)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు ద్వారా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగాగల గౌరవనీయ అతిథులతో మమేకమయ్యే అవకాశం కల్పించిందంటూ నెట్వర్క్18 యాజమాన్యానికి ఆయన ఈ సందదర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి భారత యువత ఆకాంక్షలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ సదస్సు నిర్వహించడాన్ని ప్రశంసించారు. ఈ ఏడాది ఆరంభంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇదే వేదికపై నిర్వహించిన ‘వికసిత భారత్ యువ నాయకత్వ గోష్ఠి’ ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దాలనే యువత కలలు, సంకల్పం, అభినివేశం ఈ కార్యక్రమంలో ప్రస్ఫుటం కావడాన్ని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించే 2047 నాటికి భారత్ పురోగమన పథాన్ని వివరిస్తూ అడుగడుగునా నిరంతర చర్చలు విలువైన అవగాహననిస్తాయని పేర్కొన్నారు. అమృత కాల తరాన్ని శక్తియుతం చేస్తూ.. మార్గదర్శకత్వం వహిస్తూ.. వేగంగా ముందుకు నడిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.శ్రీలంక అధ్యక్షునితో... సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 05th, 11:30 am
గౌరవనీయ అధ్యక్షులు దిసనాయకే గారు, ఇరు దేశాల ప్రతినిధులు, మీడియా మిత్రులారా, నమస్కారం!6వ బిమ్స్ టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 04th, 12:59 pm
ఈ సదస్సు కోసం ఘనమైన ఏర్పాట్లు చేసిన థాయిలాండ్ ప్రభుత్వానికి, గౌరవనీయ షినవత్ర గారికి నా కృతజ్ఞతలు.థాయ్‌లాండ్‌లో జరిగిన బిమ్స్టెక్ ఆరో సదస్సులో పాల్గొన్న ప్రధాని
April 04th, 12:54 pm
థాయ్‌లాండ్‌లో నిర్వహించిన బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) ఆరో సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రస్తుతం థాయ్‌లాండ్ అధ్యక్షత వహిస్తోంది. ‘‘బిమ్స్టెక్: సంక్షేమం, స్థిరత్వం, బహిరంగం’’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. బిమ్స్టెక్ ప్రాంత నాయకుల ప్రాధాన్యాలు, ప్రజల ఆకాంక్షలను ఇది ప్రతిపలిస్తుంది. అలాగే అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ఈ తరుణంలో ఉమ్మడి వృద్ధి సాధిండచంలో బిమ్స్టెక్ ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది.2025 ఏప్రిల్ 03-06 వరకు థాయిలాండ్ మరియు శ్రీలంకలలో ప్రధానమంత్రి పర్యటన
April 02nd, 02:00 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాంకాక్‌లో జరిగే 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి (ఏప్రిల్ 3-4, 2025) థాయిలాండ్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత, అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఆహ్వానం మేరకు (ఏప్రిల్ 4-6, 2025) శ్రీలంకకు రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతారు.ఆర్థిక సహకార విస్తరణపై జపాన్ ప్రతినిధి బృందం కీజై డోయుకైతో ప్రధానమంత్రి సమావేశం
March 27th, 08:17 pm
భారత్, జపాన్ మధ్య ఆర్థిక సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడానికి వచ్చిన ప్రతినిధి బృందం కీజై డోయుకై (జపాన్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ సంఘం)తో ఢిల్లీలోని లోక కళ్యాణ మార్గ్, 7 లో ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 20 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి కీజై డోయుకై అధ్యక్షుడు శ్రీ తకేసి నినామి నాయకత్వం వహిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించే అంశంలో వారి ఆలోచనలను ప్రధానమంత్రి విన్నారు.భారత్-న్యూజిలాండ్ సంయుక్త పత్రికా సమావేశం సందర్భంగా ప్రధాని ప్రకటన
March 17th, 01:05 pm
న్యూజిలాండ్ ప్రధానమంత్రి లగ్జాన్, ఆయన ప్రతినిధి బృందానికి హృదయపూర్వకంగా భారత్‌కు స్వాగతం పలుకుతున్నాను. ప్రధానమంత్రి లగ్జాన్‌కు ఈ దేశంతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఆక్లాండ్‌లో హోలీ పండుగను ఆనందోత్సాహాలతో ఆయన ఎలా జరుపుకొన్నారో కొన్ని రోజుల కిందటే మనమందరం చూశాం. భారత్ పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయన వెంట వచ్చిన ప్రతినిధులను బట్టి, న్యూజిలాండ్ లో నివసిస్తున్న భారత సంతతి ప్రజల పట్ల ప్రధాని లగ్జాన్‌కు ఎంతటి ఆప్యాయతాభిమానాలు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఆయనలాంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రతిభావంతుడైన నాయకుడు ఈ ఏడాది రైజీనా డైలాగ్‌కు ముఖ్య అతిథిగా రావడం సంతోషదాయకం.మారిషస్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నొవేషన్‌ను కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని శ్రీ నవీన్‌చంద్ర రాంగులామ్
March 12th, 03:13 pm
మారిషస్‌లోని రెడుయిట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నొవేషన్‌ను మారిషస్ ప్రధాని శ్రీ నవీన్‌చంద్ర రాంగులామ్‌తోపాటు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. భారత్-మారిషస్ అభివృద్ధి భాగస్వామ్యంలో ఓ భాగమైన ఈ ముఖ్య ప్రాజెక్టు మారిషస్‌లో సామర్థ్యాలను పెంచే కార్యక్రమాల పట్ల భారత్ ఎంత నిబద్ధతతో ఉందీ చెప్పకనే చెబుతోంది.Rural women are playing a significant role in India's economic growth: PM Modi during interaction with Lakhpati Didis
March 08th, 11:00 pm
PM Modi engaged with Lakhpati Didis in Navsari, Gujarat, on Women's Day, celebrating their success in entrepreneurship. He praised their economic contributions, from beadwork to drone piloting, and emphasized India's tradition of ‘Matru Devo Bhava’. Encouraging digital ventures, he envisioned creating 5 crore Lakhpati Didis, highlighting rural women as a key economic force.PM Modi interacts with Lakhpati Didis at Navsari, Gujarat
March 08th, 10:32 pm
PM Modi engaged with Lakhpati Didis in Navsari, Gujarat, on Women's Day, celebrating their success in entrepreneurship. He praised their economic contributions, from beadwork to drone piloting, and emphasized India's tradition of ‘Matru Devo Bhava’. Encouraging digital ventures, he envisioned creating 5 crore Lakhpati Didis, highlighting rural women as a key economic force.గుజరాత్లో సూరత్ ఆహార భద్రతా సంతృప్త ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 07th, 05:34 pm
పేరెన్నికగన్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయి పటేల్ గారు, కేంద్ర క్యాబినెట్ లో నా సహచరుడు శ్రీ సి.ఆర్. పాటిల్ గారూ, గుజరాత్ రాష్ట్ర మంత్రులు, ఇక్కడ హాజరైన ప్రజలు, సూరత్ లోని నా సోదరసోదరీమణులారా!సూరత్ సంతృప్త ఆహార భద్రత ప్రచార కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
March 07th, 05:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సూరత్‌లోని లింబాయత్‌లో ‘సూరత్ సంతృప్త ఆహార భద్రత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో అర్హులైన 2.3 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు సహా వివిధ వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- నిరంతర కృషి, దాతృత్వ స్ఫూర్తి బలమైన పునాదిగాగల సూరత్ నగరం విశిష్టతను ప్రధాని కొనియాడారు. సమష్టి మద్దతు, సర్వజన ప్రగతికి నిర్వచనంగా రూపొందిన నగరం స్వభావాన్ని విస్మరించజాలమని వ్యాఖ్యానించారు.ప్రధాని అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సహకార రంగం పురోగతిపై సమీక్ష
March 06th, 05:30 pm
సహకార రంగం పురోగతిని సమీక్షించడానికి ఈ రోజు 7 ఎల్ కేఎంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. ఈ రంగంలో సాంకేతిక పురోగతి ద్వారా మార్పు తీసుకువచ్చే సహకార్ సే సమృద్ధిని ప్రోత్సహించడం, సహకార సంఘాలలో యువత, మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు, సహకార మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.